ప్రయాణ బీమా అంటే ఏమిటి? ప్రయాణ బీమా ఉపయోహాలు ? -

ప్రయాణ బీమా అంటే ఏమిటి? ప్రయాణ బీమా ఉపయోహాలు ?

share

పరిచయం :

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నముగ్గురు స్నేహితులు రమేష్ ,విశాల్ , శంకర్ అనే మిత్రులు తమ కుటుంభముతో ఒక్కసారైనా పర్యటించాలని కలలుకనేవారు. అదృష్టం కొద్ది ఈ ముగ్గురికి ఒక్క పెద్ద డీల్ కుదిరి పెద్ద మొత్తంలో కమిషన్ వచ్చింది. ఎన్నో రోజులుగా కలలుగన్న అమెరికా పర్యటనకు సిద్ధం అయ్యారు. రమేష్ దగ్గరుండి ఫ్లైట్ టిక్కెట్స్ ,హోటల్ బుకింగ్స్ ,సైట్ సీయింగ్ ప్యాకేజీలు దాంతో  పాటు ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాడు. ఈ మూడు కుటుంబాలు ఎంతో సంతోషముగా అమెరికాలలో వివిధ ప్రదేశాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వారి షెడ్యూల్ లో ని పర్యటన ముగించుకొని సాయంత్రం వేల హోటల్ రూమ్ కి వస్తుండగా వారి కారుకు ప్రమాదం జరిగింది. హుటాహుటిన హాస్పిటల్ కి వెళ్లగా  డాక్టర్లు అందరిని పరీక్షించి స్పల్ప గాయాలు అయినట్టు ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పడం జరిగింది. ఆ తరవాత ఆసుపత్రి వాళ్ళు  3 వేల డాలర్ల బిల్లు వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. ఆ బిల్లు చూసి అందరూ షాక్ కు గురై భారతీయ కరెన్సీలో 2.5 లక్షలు అనేసరికి అంత డబ్బా అని విచారించడం మొదలు పెట్టారు. రమేష్ మాత్రం తేలికగా తీసుకొనే ఎవ్వరు బిల్లుల గురించి చింతించవద్దని మన అందరికి  ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉందని ఈ ఇన్సూరెన్స్ ద్వారా విదేశాల్లో వైద్యానికి అయ్యే ప్రతి పైసా ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపినీయే భరిస్తుందని  చెప్పే సరికి హమ్మయ్య అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ మంచి పని చేసిన రమేష్ కి వారి మిత్రుల కుటుంభం నుండి ప్రశంసలు అందుకున్నాడు మరియు తిరిగి షెడ్యూల్ ప్రకారం మల్లి పర్యటనకు ప్రయాణం ప్రారంభించారు.

ఈ కథ ద్వారా విదేశీ ప్రయాణాల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రాధాన్యత ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

ట్రావెల్ ఇన్సూరెన్స్ అర్ధం :

ట్రావెల్ ఇన్సూరెన్స్ ని తెలుగులో ప్రయాణ బీమా అంటారు అనగా ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలు అనగా ప్రయాణ సమయంలో మన  వెంట తెచ్చుకున్న బ్యాగులు తప్పిపోవటం అందులో ఉన్న విలువైన వస్తువులు  ఆభరణాలు ,సెల్ ఫోన్, లైసెన్సుసులు, పాస్ పోర్ట్, ఎలక్ట్రానిక్ వస్తువులులకు ప్రయాణ బీమా పరిహారం అందిస్తుంది. అలాగే  తాము ప్రయాణం చేయాలకున్న  విమానం ఆలస్యం ,రద్దు,మరియు  మిస్ అవ్వటం లాంటి నష్టాలను కవర్ చేస్తుంది. ప్రయాణాల్లో ఎదురయ్యే మెడికల్ ఎమెర్జెన్సీలు, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, స్కామ్స్ నుండి మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే విదేశాల్లో మీరు కారు నడుపుతున్నప్పుడు ఏదేని ప్రమాదం జరిగితే ప్రయాణ బీమా కవర్ చేస్తుంది. విదేశాల్లో  ఏదేని చట్టపరమైన కేసుల్లో ఇరుక్కుంటే ”పర్సనల్ లయబిలిటీ బెయిల్ బాండ్ ” ఇచ్చి ప్రయాణ బీమా మీకు సహాయం చేస్తుంది. కొన్ని దేశాల్లో ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా ప్రయాణ బీమా అవసరం, లేదంటే ఆ దేశాలు వీసా జారీ చెయ్యవు.  మీ విదేశీ  పర్యటనలో ఆహ్లాదం కోసం లేదా ఏదేని సహస క్రీడలలో పాల్గొన్నప్పుడు  దురదృష్టశాత్తు ఏదేని ప్రమాదం జరిగిన ప్రయాణ బీమా కవర్ చేస్తుంది.ఈ  విధంగా ప్రయాణాల్లో ఎదురయ్యే ఆర్ధిక నష్టాలను. అత్యవసర పరిస్థితులను నుండి ప్రయాణ బీమా మీకు  తక్షణ కవచం లాగా పనిచేస్తుంది.

ట్రావెల్ ఇన్సూరెన్స్ రకాలు :

1 వ్యక్తిగత ప్రయాణ బీమా

2 ఫామిలీ ప్రయాణ బీమా

3 స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్

4 సీనియర్ సిటిజెన్ ట్రావెల్ ఇన్సూరెన్స్

5 గ్రూప్ ట్రావెల్ ఇన్సూరెన్స్

6 కార్పొరేట్ ట్రావెల్ ఇన్సూరెన్స్

7 డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్

8 ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్

9 స్కెన్ జెన్ (26)యూరప్ దేశాల ట్రావెల్ ఇన్సూరెన్స్

10 సింగిల్ ట్రిప్ ట్రావెలిన్స్యూరెన్సు

11 మల్టిట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్

వీటిని గురించి వివరంగా తెల్సుకుందాం

1 ఇండివిసువల్ ట్రావెల్ ఇన్సూరెన్స్  :ఒంటరిగా ప్రయాణం చేసే వారికీ ఈ పాలసీ సరిగ్గా పనిచేస్తుంది. ఈ పాలసీలో ప్రయాణం మొదలై ఇంటికి చేరడంతో ఈ పాలసీ ముగుస్తుంది. ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా ఆ వ్యక్తిగా జరిగే నష్టానికి ట్రావెల్ ఇన్సూరెన్సు ద్వారా ఆర్ధిక ప్రయోజనం పొందవచ్చు.

2 ఫామిలీ  ట్రావెల్ ఇన్సూరెన్స్ : ఒకే కుటుంబంలోని సంభ్యులందరు కలసి ప్రయాణం చేసే వారికి ఈ  పాలసీ సరిపోతుంది. పైన వివరించిన రమేష్ ,విశాల్ ,శంకర్ ల వారి కుటుంబాలకు సంబంధిన 3 పాలసీలు తీసుకోవటం జరిగింది.

3 స్టూడెంట్ ట్రావెలిన్స్యూరెన్సు : విదేశాల్లో చదువుకోసం వెళ్లే విద్యార్థుల కోసం  ఈ పాలసీ రూపొందించబడింది.విదేశాల్లో ఎదురయ్యే వైద్య పరమైన సమస్యలకు రోడ్డు ప్రమాదాలు ఏదేని నేరంతో సంభంధం ఉంటె పర్సనల్ లయబిలిటీ బెయిల్ బాండ్ లాంటివి కవర్ చేస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయాణం చేస్తున్న ఎంతో మంది విద్యార్థులకు ఈ పాలసీ వరంగా చెప్పవచ్చు. దీంతో విద్యార్థులకు భద్రత తల్లిదండ్రులకు బరోసా ఉంటుంది.

4 సీనియర్  సిటిజెన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ : వృద్ధులు 60 సంవత్సరాలకంటే ఫై బడిన వారి కోసం ఈ పాలసీ రూపొందించబడ్డది. ప్రయాణాల్లో ఊహించని వైద్య ఖర్చులను, మరియు దురదృష్టకర సంఘటనల్లో  విదేశాల్లో మరణిస్తే  వారి మృతదేహాన్ని  స్వదేశానికి పంపించడం లాంటి అత్యవసర ఆర్ధిక పరిస్థితులనుండి కాపాడుతుంది.

5 గ్రూప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ : కొంత మంది వ్యక్తులు గ్రూప్ గా ప్రయాణం చేసే వారికోసం ఈ పాలసీ ఉపయోగపడుతుంది. ఒకే కుటుంభం లేదా బంధువులు ఈ ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చెయ్యబడుతారు.అలాగే ట్రావెల్ కంపినీలు లేదా వారి ప్యాకేజీ లో భాగంగా అందరికి కలిపి గ్రూప్ ఇన్సూరెన్సు ను తీసుకోవటం జరుగుతుంది.

6 కార్పొరేట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ : కార్పొరేట్ సంస్థలు లేదా కంపెనీలు తమ ఉద్యోగుల కోసం తమ వ్యాపార ప్రయాణాల్లో భాగంగా ప్రయాణం చేసేవారికి ఈ పాలసీ ఉపయోగపడుతుంది. ఉద్యోగుల వ్యాపార పర్యటనలో భాగంగా ఈ పాలసీ తీసుకోవటం జరుగుతుంది.

7 డొమెస్టిక్ ట్రావెల్ పాలసీ : ఏది మన దేశంలోని వివిధ ప్రదేశాలకు  ప్రాంతాలకు ప్రయాణం చేసే వారి కోసం ఈ పాలసీ పని చేస్తుంది మన దేశంలో ప్రయాణం చేస్తున్నపుడు ఎదురయ్యే ఆర్ధిక నష్టాలనుండి ఈ ట్రావెల్ పాలసీ కవర్ చేస్తుంది.

8 ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్  : విదేశాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎదురయ్యే ఆర్ధిక నష్టాలనుండి ఈ పాలసీ కాపాడుతుంది. విదేశీ ప్రయాణంలో జరిగే దొంగతనాలు, వైద్య అత్యవసరాలు,బ్యాగేజి మిస్సింగ్ రోడ్డు ప్రమాదాలు అన్నింటిని ఈ పాలసీలో కవర్ చెయ్యబడతాయి.

9 స్కెన్ జెన్ 26 యూరప్ దేశాల ట్రావెల్ ఇన్సూరెన్స్ : దీనినే యూరప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటారు. ఇందులో మొత్తమ్ 26 యూరోపియన్ దేశాలు  ఉంటాయి. ఈ దేశాల్లో ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా ప్రయాణ బీమా అవసరం.

10 సింగిల్ ట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ : సింగిల్ ట్రిప్ అనగా ఒకే ప్రయాణం  కోసం ఏర్పడు చేయబడ్డ పాలసీ. ఇందులో ప్రయాణం ఎక్కడ నుండి ఎక్కడికో స్వష్టముగా పేర్కొనబడి ఉంటుంది. ఈ ప్రయాణంలో జరిగే నష్టాలను ఈ పాలసీలో కవర్ చెయ్యడం జరుగుతుంది.

11 మల్టీ ట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ : తరచుగా విదేశీ పర్యటనలు చేసే వారి కోసం ప్రతి సారి ఇన్సూరెన్స్ కొనుగోలు చేయకుండా ఈ పాలసి ఉపయోగ పడుతుంది.ఒక సంవత్సరంలో ఒకటికంటే ఎక్కువ ప్రయాణాలు చేసే వారికి ఈ పాలసీ బాగా ఉపయోగ పడుతుంది.

ట్రావెల్ ఇన్సూరెన్స్ లో కవర్ చేయబడే అంశాలు :

1-విదేశి ప్రయాణాల్లో ఉన్నపుడు అనారోగ్యం పాలవడం లేదా అనుకోని రోడ్డు ప్రమాదాలు ఎదురైనప్పుడు  మానసికంగా కృంగిపోవటమే కాకుండా ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి సమయంలో  ప్రయాణ బీమా మీకు నగదు రహిత వైద్య సదుపాయం కల్పిస్తుంది.మీకు మనశాంతిని ఇస్తుంది.

2- విదేశీ పర్యటనలో ఉన్నపుడు దురదృష్టవశాత్తు మరణిస్తే అతని మృతదేహాన్ని స్వదేశానికి తీసుక రావటానికి అయ్యే విమాన ఖర్చులను ట్రావెల్ ఇన్సూరెన్స్ నే భరిస్తుంది.

3- మీరు ప్రయాణిస్తున్న విమానం ఆలస్యం లేదా రద్దు కావచ్చు.అటువంటి సమయంలో  ప్రయూణ బీమా మీకు  ఆ  ఆర్ధిక నష్టాన్ని పురిస్తుంది.

4-ప్రయాణాల్లో  విలువైన వస్తువులతో కూడిన  బ్యాగేజి దెబ్బతినటం లేదా తప్పిపోవటం జరగవచ్చు. అలాంటి ఆర్ధిక నష్టాలను ట్రావెల్ ఇన్సూరెన్స్  ద్వారా కవర్ చెయ్యవచ్చు.

5- ఏదేని సాహస క్రీడలల్లో పాల్గొన్నట్లయితే  ఏదేని ప్రమాదం జరిగినట్లయితే ఆ ప్రమాదానికి అయ్యే వైద్య ఖర్చును  ప్రయాణ బీమా కవర్ చేస్తుంది.

6- మీరు ప్రయాణం చేయాలనుకుంటున్న విమానం రద్దు లేదా పొడగింపు కారణంగా మీకు వసతి సౌకర్యం ప్రయాణ బీమా కల్పిస్తుంది.

7-  విదేశీ ప్రయాణాల్లో ప్రమాద కారణంగా  మీ ద్వారా  ప్రమాద కారణముగా ఇతరులకు అయ్యే శారీరక గాయాలు, ఆస్తి నష్టం లాంటి చట్టపరమైన సమస్యలనుండి మీ తరుపున వ్యక్తిగత  లయబిలిటీ మరియు బెయిల్ బాండ్ ఇచ్చి మిమ్మల్ని రక్షిస్తుంది.

8-  మీ ప్రయాణాల్లో మీ నగదు కోల్పోవటం లేదా దొంగిలించబడటం జరిగితే ప్రయాణ బీమా మీకు ఎమర్జెన్సీ క్యాష్ ని అందించి అత్యవసర సమయంలో మీకు అండగా ఉంటుంది.

9- మీరు విదేశాల్లో ఏదేని స్పామ్ లకు గురైతే మీకు రక్షణ కల్పిస్తుంది. మిమ్మలి రక్షించడానికి అవసరం అయ్యే అన్ని చర్యలు చేపడుతుంది.

ట్రావెల్ ఇన్సూరెన్స్ లో  కవర్ చెయ్యని అంశాలు :

1- డాక్టర్ సలహాకు విరుద్ధంగా ప్రయాణం చేసి ఏదేని అనారోగ్యనికి గురైతే ట్రావెల్స్ బీమా కవర్ చెయ్యదు

2- మీ ప్రయాణంలో ముందు నుండి  ఉన్న వ్యాధుల కారణంగా అయ్యే  వైద్య  ఖర్చులను కవర్ చెయ్యదు

3- ఆల్కహాల్,డ్రగ్స్ మత్తు పదార్థాల కారణంగా ఎదురయ్యే క్లెయిమ్స్ ని కవర్ చెయ్యదు

4- స్వీయ గాయాలు లేదా ఆత్మహత్య, ఆత్మహత్య ప్రయత్నం లాంటివి చేసినట్లయితే   కవర్ చెయ్యబడవు

5- దొంగతనం, నేరం, చట్టవ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొని  వచ్చే క్లెయిమ్స్ ని కవర్ చెయ్యవు

6- గర్భం,ప్రసవం ,లైంగిక వ్యాధులు ,STD ,మానసిక రుగ్మతల కారణంగా అయ్యే నష్టాలను కవర్ చెయ్యదు

7- కాస్మొటిక్ ప్లాస్టిక్ సర్జరీలు అలాగే  హోమియో,నాచురోపతి,ఆయుర్వేదం వంటి వైద్య ఖర్చులను  కవర్ చెయ్యబడవు

8- ప్రయాణదారునితో కాకుండా ప్రయాణ సామాగ్రి విడిగా వచ్చే బ్యాగేజి నష్టాలను ట్రావెల్ బీమా  ద్వారా కవర్ చేయబడదు.

9- పాలసీలో పేర్కొన్న బౌగోలీక ప్రాంతంకాకుండా వేరే ప్రాంతంలో మిస్ అయి పోయిన బ్యాగేజీలను కవర్ చెయ్యదు.

10- విమాన సంస్థ 6 గంటల ముందే విమాన ఆలస్యం గురించి తెలియజేసిన సందర్భంలో ఆ నష్టాలను కవర్ చెయ్యదు.

11- కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ  కారణముగా  మీ ప్రయాణం ఆలస్యమై జరిగే నష్టాలను కవర్ చెయ్యదు.

12-  వీసా తిరస్కరన కారణంగా ట్రిప్ రద్దయితే అందుకు జరిగిన నష్టాన్ని కవర్ చెయ్యదు

13- వినోద సహస క్రీడలు ఒక్కరోజుకు మించి చేసి ఏదేని ప్రమాదానికి గురైతే వాటి నష్టాలను కవర్ చెయ్యదు.

14- పర్యాటకుడు పర్యటిస్తున్న దేశంలో ఏదేని ఉగ్రవాద చర్యలు,యుద్ధం లేదా  అంతర్యుద్ధం కారణముగా ఏదేని నష్టం జరిగితే ఆ నష్టాలను ఒకేవే చెయ్యదు  లాంటి కారణంగా కవర్ చెయ్యదు.

ప్రయాణ బీమా ప్రీమియంను ప్రభావితం చేయు అంశాలు :

1 ప్రయాణం చేయనుకున్న దేశం : ప్రయాణ బీమా ను ప్రభావితంచేయు అంశాల్లో మనం ప్రయాణిస్తున్న దేశం ప్రభావితం చేస్తుంది. ఏదేని ఎక్కువ రిస్క్ ఉన్న దేశంలో ప్రయాణంచేయనుకుంటే ఎక్కువ ప్రీమియం చెల్లించాలి.

2 ప్రయాణ కాల వ్యవధి : ఎక్కువ రోజులు ప్రయాణం చేయాలనుకుంటే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఎక్కువ రోజుల ప్రయాణం దృష్ట్యా బీమా సంతకు ఎక్కువ రిస్క్ ఉన్నందున ఎక్కువ ప్రీమియం వాసులు చేస్తుంది.

3 ప్రయాణికుల సంఖ్య : ఎంత మంది సభ్యులు ప్రయాణం చేస్తున్నారో వారి సంఖ్యని బట్టి ప్రీమియం ఆధారపడి ఉంటుంది. సహజంగా ఎక్కువ మంది సంఖ్య ఉంటె ఎక్కువ ప్రీమియం వాసులు చేస్తారు.

4 ఆడ్ -ఆన్ – కవర్స్:  వీటిని అదనపు ప్రీమియం చెల్లించి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ  అదనపు కవర్స్ ని బట్టి ప్రీమియం పెరిగే అవకాశం ఉంది.

ట్రావెల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ : ట్రావెల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ లోనే చాలా సులువుగా  చెయ్యవచ్చు.క్లెయిమ్ ప్రాసెస్ కోసం ఎటువంటి పేపర్ వర్క్ అవసరం లేదు. పాలసీలో కవర్ అయ్యే క్లెయిమ్స్ అన్నింటిటి మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. క్లెయిమ్స్ కోసం అవసరమయ్యే అన్ని డాకుమెంట్స్ ని మెయిల్ చేసి పరిహారం పొందవచ్చు. బీమా సంస్థ ఏదేని అదనపు సమాచారం కోరితే తప్పకుండ ఇవ్వాల్సి ఉంటుంది కానీ ప్రతిదీ ఆన్లైన్ మద్యమంలో పంపిస్తే సరిపోతుంది.

ముగింపు :

ప్రయాణ  బీమా వల్ల ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి కావున చిన్న పాటి ప్రీమియం గురించి చింతించకుండా  విదేశీ ప్రయాణం లేదా స్వదేశీ ప్రయాణం చేసిన తప్పకుండ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకొని ప్రయాణం చెయ్యాలి.ఆపదలు లేదా ప్రమాదాలు చెప్పి రావు కనుక ప్రశాంత్మగా ప్రయాణాలు చేయాలంటే ప్రయాణ బీమా తప్పనిసరి.

share

Leave a Comment