పరిచయం :
హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నశంకర్ అనే టెకీ తన కుటుంబంతో వరంగల్ లో ఉన్న పర్యాటక ప్రదేశాలైన రామప్ప,లక్నవరం లాంటి ప్రాంతాలను తన కుటుంబంతో సహా తన స్వంత కార్లో ప్రయాణం ప్రారంభించారు. తాము ప్రయాణిస్తున్న కారు రామప్పకు కొన్ని కిలో మీటర్ల దూరంలో తన కారు ఒక్కసారిగా ఆగిపోయించి,ఆ తర్వాత కారును మళ్ళి మళ్ళి స్టార్ట్ చేసే ప్రయత్నం చేసిన స్టార్ట్ అవటం లేదు, అటుగా వెళ్తున్న వాహనదారులను ఇక్కడ మెకానిక్ షెడ్ ఎక్కడుంది అని అడగగా దగ్గరలో ఏమి లేవు అని చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఎం చెయ్యాలిరా దేవుడా అని బాధపడుతున్న శంకర్ కి ఒక్కసారిగా తన కార్ ఇన్సూరెన్స్ లో రోడ్ సైడ్ ఆసిస్ స్టెన్సు అనే ఆడ్ ఆన్ ఉన్నట్లుగా గుర్తుచేసుకొని తన కార్ లో ఉన్న పాలసీ డాక్యుమెంట్ లో ఒక్క సారి క్రాస్ చెక్ చేసుకొని ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ ద్వారా కార్ ఆగిపోవటం మరియు స్టార్ట్ చేసే క్రమంలో వస్తున్న సమస్యను తెలియజెయటం జరిగింది. కాల్ చేసిన అనంతరం 40 నిమిషాల్లో తన కారు ఆగిన లొకేషన్ కి ఒక మెకానిక్ మరియు టోవింగ్ సర్వీస్ తో సహా వచ్చి 10 నిమిషాల్లోనే తన కార్ ని బాగుచేయటం జరిగింది. కుటుంభముతో సహా రోడ్డు మీద ఆగిపోయిన శంకర్ కి ఒక్కసారిగా ఎంతో ఊరట లభించింది.
పైన పేర్కొన్న శంకర్ అనే టెకీ కథలో వాహన బీమా యొక్క ప్రయోజనం ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
వాహన బీమా అర్ధం :
బైకు ,కారు ,లారీ వంటి వాహనాలకు దాని యజమాని తీసుకొనే పాలసీని మోటార్ ఇన్సూరెన్స్ లేదా వాహన బీమా అంటారు. ఈ ఇన్సూ రెన్స్ వాహనాన్నే కాకుండా వాహన యజమాన్నీ కాపాడుతుంది రోడ్డు ప్రమాదాలు ,దొంగతనాలు ,అగ్ని ప్రమాదాలు పకృతి విపత్తులు వంటి ప్రమాదాల నష్టాల నుండి లక్షల్లో విలువ చేసే మీ వాహనాన్ని మరియు మిమ్మల్ని కాపాడుతుంది . మోటార్ వెహికల్ చట్టం 1988 ప్రకారం మన దేశంలో ఎటువంటి వాహనం అయినా రోడ్డు మీద తిరగాలంటే కనీసం థర్డ్ పార్టీ ఇన్సురెన్సు తప్పనిసరి.
IRDAI ప్రకారం మోటార్ ఇన్సురెన్సు పాలసీలకు సంబంధించి రెండు రకాల పాలసీలున్నాయి అవి ..
థర్డ్ పార్టీ ఇన్సురెన్సు పాలసీ
సమగ్ర బీమా ( కాంప్రహెన్సివ్ పాలసీ)
1-థర్డ్ పార్టీ ఇన్సురెన్సు :
అనగా మీ వాహనం వల్ల వేరే వాహనానికి లేదా వ్యక్తికి ప్రమాదంలో ఆస్తినష్టం, ప్రాణ నష్టం, వాహనం డ్యామేజీ అయితే ఈ పాలసీ ద్వారా ఆ నష్టాన్ని బీమా సంస్థ భరిస్తుంది .ఈ పాలసీ కలిగి ఉన్న సొంత వాహన యజమానికి తన వాహనం డ్యామేజికి గాని, తన ప్రాణ నష్టానికి గాని ఎటువంటి బీమా కవర్ ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా పొందలేరు. కేవలం మీ వాహనం వాళ్ళ ఇతరులకు అనగా థర్డ్ పార్టీకి కలిగిన నష్టాన్నే భరిస్తుంది. మోటార్ వెహికల్ చట్టం 1988 ప్రకారం ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి.
ఈ వాహన ప్రమాద సమయంలో ఫస్ట్ పార్టీ, సెంకండ్ పార్టీ, థర్డ్ పార్టీ అనే సంకిష్టమైన పదాలు వాడటం జరుగుతుంది. వాటిని గురించి ముందుగా తెల్సుకుందాం.
ఫస్ట్ పార్టీ : ఏదేని వాహనం కలిగి ఉన్న వ్యక్తి ఏదేని వాహన బీమా తీసుకున్నట్లయితే అతనిని ఫస్ట్ పార్టీ అంటారు. మీకు బైక్ కానీ కార్ కానీ ఉండి వాటి కోసం ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే మిమ్మల్ని ఫస్ట్ పార్టీ అంటారు.
సెకండ్ పార్టీ : మీ బైక్ లేదా కార్ కి ఏదేని బీమా కంపినీ నుండి పాలసీ తీసుకున్నట్లయితే ఆ కంపినీని సెకండ్ పార్టీ అంటారు. ఉదాహరణకు TATA AIG అనే బీమా సంస్థ నుండి మీ వాహనానికి బీమా చేసినట్లయితే ఆ ”TATA AIG” బీమా కంపెనీని సెకండ్ పార్టీ అంటారు.
థర్డ్ పార్టీ : మీ వాహనం ద్వారా ఇతర వాహనానికి లేదా వ్యక్తికి లేదా ఏదేని వస్తువుకి లేదా ప్రాపర్టీ కి నష్టం జరిగినట్లయితే ఆ వ్యక్తిని లేదా వాహనాన్ని లేదా ప్రాపర్టీ ని థర్డ్ పార్టీ అంటారు. ఉదాహరణకు మీరు రోడ్ మీద కారు నడుపుతున్నప్పుడు ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నఒక వ్యక్తిని గుద్దినట్లయితే ఆ వ్యక్తి థర్డ్ పార్టీగా చెప్పవచ్చు.
2-కాంప్రహెన్సివ్ లేదా సమగ్ర బీమా :
అనగా ఏదేని ప్రమాదంలో మీ వాహనం వళ్ళ ఆస్థి నష్టం, ప్రాణ నష్టం, వాహన డ్యామేజికి మీకు మీ వళ్ళ జరిగిన ఇతర వాహన నష్టాలకు ఈ సమగ్ర బీమా పాలసీ కవర్ చేస్తుంది .ఈ పాలసీలో వాహన ప్రమాదాలే కాకుండా వాహన దొంగ తనాలు ,అగ్ని ప్రమాదాలు ,పకృతి విపత్తులు వంటి అనేక నష్టాలనుండి పాలసీ కవర్ చేస్తుంది
IRDAI భరత్ దేశంలోని వివిధ వాహనాలను 3 భాగాలుగా విభజించడం జరిగింది. మన రోడ్లపై తిరుగుతున్న ప్రతి వాహనం ఈ మూడు భాగాలలో ఏదో ఒక విభాగం పరిధిలోకి వస్తుంది అవి…
కార్ ఇన్సూరెన్స్
బైక్ ఇన్సూరెన్స్
కమర్షియల్ ఇన్సూరెన్స్
1 కార్ ఇన్సూరెన్స్ : ఇది వ్యక్తిగత లేదా ప్రైవేట్ అవసరాల కోసం ఉపయోగించే మీ సొంత కారుకు తీసుకొనే పాలసీ. రోడ్డు మీద తీరిగె ప్రతి ప్రైవేట్ కార్లు ఈ పాలసీ పరిధిలోకి వస్తాయి.ఏదేని రోడ్డు ప్రమాదాలు, అగ్నిపర్వతాలు, పకృతి విపత్తులు, దొంగతనాలు వంటి నష్టాలనుండి ఈ కార్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. మీరు రోడ్ మీద వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఏదేని ప్రమాదం సంభవిస్తే ఈ కాంప్రహెన్సివ్ పాలసీ ఉన్నట్లయితే మీ సొంత వాహనానికి మరియు ఇతర వాహనాలకు జరిగిన నష్టాలను కూడా ఈ పాలసీలో కవర్ చెయ్యబడతాయి. అందుకే సమగ్ర బీమాను ఎంచుకోవాలని చెపుతుంటాం.
2 బైక్ ఇన్సూరెన్స్ : ఈ పాలసీ ద్వారా మీ స్కూటర్,బైక్ లేదా మీ టూ వీలర్ వాహనాలను కవర్ చేస్తుంది.కంప్రహెన్సివ్ పాలసీ ఉన్నట్లయితే ప్రమాదాలు విపత్తులు అగ్ని ప్రమాదాలు దొంగ తనాల నుండి మీ వాహన నష్టాన్ని కవర్ చేస్తుంది.
3 కమర్షియల్ వెహికల్ ఇన్సురెన్సు : వ్యక్తిగత అవసరాల కోసం కాకుండా వ్యాపార వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే వాహనాల కోసం తీసుకొనే పాలసీనే కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్ అంటారు. ప్రయాణికుల కోసం ,సరుకుల రవాణా కోసం ఉపయోగించే ఈ వాహనాలకు బీమా తప్పని సరిగా తీసుకోవాలి ఎందుకంటే కమర్షియల్ వాహనాలు తరచు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.
మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయు ప్రమాదాలు :
1 ప్రమాదవశాత్తు జరిగే రోడ్డు ప్రమాదాలు
2 వరదలు, భూకంపాలు, తుపానులు, కొండ చర్యలు విరిగి పడే ప్రమాదాలను వాహన బీమా కవర్ చేస్తుంది
3 అగ్ని ప్రమాదాల కారణంగా వాహనానికి జరిగిన నష్టాలను
4 ఉగ్రవాద చర్యల కారణంగా వాహనానికి ఏదేని జరిగిన నష్టం సంభవిస్తే
5 అల్లర్లు ,సమ్మెలు కారణంగా మీ వాహనానికి జరిగిన నష్టాలను
6 మీ వాహనం దొంగతనానికి గురైన వాహన బీమాలో కవర్ చెయ్యబడుతుంది.
మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చెయ్యని ప్రమాదాలు :
1 ఆల్కహాల్ ,మత్తు పదార్ధాలు ,డ్రగ్స్ తీసుకొని ఏదేని వాహన ప్రమాదం జరిగితే అది మోటార్ బీమా కవర్ చెయ్యదు
2 సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహన నడిపి ప్రమాదానికి గురైతే కవర్ చేయబడదు
3 చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొని వాహనానికి ఏదేని ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ వర్తించదు
4 పాలసీలో పేర్కొన్న బౌగోలీక ప్రాంతంలో కాకుండా వేరే చోట్ల ప్రమాదం సంభవిస్తే అందుకు బీమా సంస్థ బాధ్యత వహించదు
వాహన బీమా ప్రీమియంపై ప్రభావం చూపే అంశాలు :
వాహన మోడల్ : మోటార్ ప్రీమియం మీ వాహన తయారీపై ఆధారపడి ఉంటుంది. దాంతో పాటు వాహన మోడల్, క్యూబిక్ సామర్ధ్యం, వేరియంట్ ఫై ఆధారపడి ఉంటుంది
వాహన వయస్సు : సాధారణముగా కొత్త వాహనానికి ఎక్కువ ప్రీమియం పాత వాహనానికి తక్కువ ప్రీమియం చెల్లించ బడుతుంది.ఎందుకంటే కొత్త వాహనాలు కండిషన్ ఉండటం చేత
వాహన ఇంజన్ : వాహన ఇంజన్ పెట్రోల్ లేదా డిసీల్ తోపాటు వాహనం IDV( IDV అనగా మీ వాహన మార్కెట్ విలువ) ప్రీమియంను ప్రభావితం చేస్తుంది
యాడ్ -ఆన్ లు : వాహన బీమా ప్రయోజనాలతో పాటు అదనపు ప్రయోజనాల కోసం రైడర్ లను ఎంచుకుంటే ప్రీమియం పెరగవచ్చు
నో క్లెయిమ్ బోనస్ లు : పాలసీ సంవత్సరంలో వాహనానికి ఎటువంటి క్లెయిమ్స్ చేయని యెడల నో క్లెయిమ్ అంటామ్. ఈ నో క్లెయిమ్ బోనస్ అనే ప్రయోజనం వల్ల మరుసటి సంవత్సరం రెనివల్ సమయంలో ప్రీమియం తగ్గించవచ్చు .
వాహనం స్థానం : కారు ఉన్న ప్రదేశంపై ప్రీమియం ఆధారపడి ఉంటుంది గ్రామీణ పట్టన ప్రాంతాల్లో ప్రీమియం తక్కువగాను మెట్రో నగరాల్లో ట్రాఫిక్ రద్దీ దృష్ఠ ప్రమాదాలకు అవకాశాలు ఎక్కువ కావున ప్రీమియం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది
సరైన మోటార్ పాలసీని ఎంచుకొనే విధానం –
మోటార్ ఇన్సూరెన్స్ చెక్ లిస్ట్ : వాహనం నడిపే మీకు మరియు మీ వాహనానికి రక్షణ కల్పించే సరైన మోటార్ బీమాను ఎంచుకోవటం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ క్రింద వివరించడం జరిగింది.
కవరేజ్ : వాహన బీమాలో మొదటిది మరియు ముక్యమైనది.మీ వాహన బీమా ఎంచుకొనే ముందు మీ వాహన IDV విలువకు సమానంగా పాలసీ కవరేజీ ఎంచుకోవాలి.
వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజ్ : మనం ఎంచుకొనే వాహన బీమాలో వ్యక్తిగత ప్రమాద బీమా ఉందొ లేదో నిర్ధారించుకోని తప్పనిసరి వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజ్ ఎంచుకోవాలి.
ఆడ్ – ఆన్ లు : వాహన బీమా ఎంపికలో మన అవసరాలకు తగ్గ అన్ని ప్రయోజనాలు ఉన్నాయో లేవో పరిశీలించి, లేని యెడల అదనపు ప్రీమియంతో మన అవసరాల సరిపడ ఆడ్ ఆన్ లు పాలసీలో జత చేసుకోవటం ద్వారా ఏదేని ప్రమాద నష్టాలను తక్కువ ప్రీమియంతో కవర్ చేయవచ్చు.
క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో : మనం ఎంచుకోబోయే బీమా సంస్థ క్లెయిమ్స్ ని ఎంత త్వరగా పరిష్కరించ బడుతుందో తెలియజేసే నివేదిక ఇది. పాలసీ తీసుకొనే ముందు మంచి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉన్న బీమా సంస్థను ఎన్నుకోవటం ముఖ్యం.
నో క్లెయిమ్ బోనస్ : మీరు ఎంచుకొనే వాహన బీమాలో నో క్లెయిమ్ బోనస్ ఫీచర్ ఉందొ లేదో తెల్సుకోవటమే కాకుండా ఒకవేళ మన పాలసీని వేరే బీమా సంస్థకు మారితే నో క్లెయిమ్ బోనస్ బదిలీ అవుతుందా లేదా కూడా పరిశీలించాలి.
రోడ్ సైడ్ సర్వీసులు : ప్రమాదం జరిగిన వెంటనే పాలసీదారుడి అత్యవసర సేవల కోసం 24/7 కష్టమర్ సర్వీసులు, మరియు వాహనం రోడ్డుపై ఆగినపుడు పాలసీదారుల పికప్ అండ్ డ్రాప్ కోసం రోడ్ సైడ్ అసిస్టెంట్ సేవలు అలాగే క్యాష్ లెస్ గ్యారేజీలు వంటి సర్వీసులు ఉన్నాయో లేదో పరిశీలించాలి.
జీరో డిప్రిసియేషన్ : వాహన విలువ ప్రతి సంవత్సరం తగ్గుతూ ఉంటుంది కావున, వాహనానికి ఏదేని ప్రమాదం సంభవించినచొ ఈ మార్కెట్ విలువ ప్రకారం మాత్రమే బీమా కవర్ చెయ్యబడుతుంది. అందుచేత ఈ జీరో డిప్రెసియేషన్ గల పాలసీ తీసుకున్నట్లయితే వాహన విలువ ఏ మాత్రం తగ్గకుండా బీమా కవర్ పూర్తిగా కవర్ చెయ్యబడుతుంది.
పాలసీ నిభంధనలను పరిశీలించడం : చివరగా పాలసీ కొని సంతకం పెట్టె ముందు మన పాలసీకి సంబంధించిన షరతులను ,నియమ నిబంధనలు పరిశీలించాలి.
మోటార్ బీమా ఎలా క్లెయిమ్ చెయ్యాలి :
మోటార్ బీమా క్లెయిమ్ అనేది వాహనాన్ని బట్టి వాహన ప్రమాదాన్నిబట్టి ఉంటుంది. ముందుగా పాలసీదారుడు వాహన నష్టానికి సంబంధించిన ఒక ఎస్టిమేషన్ ను బీమా కంపెనీకి అందించాలి. ఆ తర్వాత బీమా కంపనీ ఇంజనీరింగ్ అర్హతగల ఇండిపెండెంట్ ఆటో మొబైల్ సెర్వెయర్ తో ప్రమాద కారణాన్ని ప్రమాద తీవ్రతను అంచనా వేసి బీమా సంస్థకు నివేదిక అందిస్తాడు. ఆ నివేదిక ననుసరించి బీమా కంపెనీ పాలసీదారునికి నష్ట నివారణ చర్యలు తీసుకుంటుంది.
మోటార్ ఇన్సూరెన్స్ బీమా కోసం ఈ డాకుమెంట్స్ తప్పనిసరి :
1- పూర్తిగా నింపిన క్లెయిమ్ ఫారం
2-డ్రైవింగ్ లైసెన్స్
3-R.C book వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
4- వాహన రీపెర్ కోసం అయినా బిల్లులు
5- FIR కాఫీ
ఒకవేళ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం అయితే బీమా దారుడు బీమా కంపెనీకి నోటీసు ఇచ్చిన అనంతరం క్లెయిమ్ పరిష్కారం కోసం ”మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ట్రిబ్యునల్” కి పంపబడుతుంది. అప్పుడు బీమా దారుడు ఈ క్రింది డాక్యూమెంట్స్ సమర్పించవల్సి ఉంటుంది.
1 పోలీస్ రిపోర్ట్
2 డ్రైవింగ్ లైసెన్స్
3 మెడికల్ సర్టిఫికెట్
4 మరణం సంభవించినచో డెత్ సర్టిఫికెట్ సమర్పించాలి.
ముగింపు :
మన దేశంలో ఎన్నో ప్రమాదాల కారణముగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.అందుచేత భారత ప్రభుత్వం రోడ్డు మీద తిరిగే ప్రతి వాహనానికి తప్పనిసరి కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండాలని చట్టం చెయ్యటం జరిగింది.అలాగే వాహనదారులు ఈ బీమా ద్వారా అతి తక్కువ ప్రీమియం చెల్లించి మీకు,మీ వాహనానికి,ఇతరులకు నష్టాలను బీమా సంస్థక బదిలీ చేసి బారి నష్టాల నుండి బయటపడచ్చు. అందుకోసం వాహనం కలిగి ఉన్న ప్రతి ఒక్కరు వాహన బీమా కలిగి ఉండాలి.