టర్మ్ ఇన్సూరెన్స్ ఎంపికలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? -

టర్మ్ ఇన్సూరెన్స్ ఎంపికలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

share

పరిచయం:

బీమా పాలసీలన్నింటిలో టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాధమికమైనది మరియు ముక్యమైనది.తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ అందించే పాలసీ టర్మ్ పాలసీ. అందుచేత ఈ పాలసీని ప్యూర్ టర్మ్ పాలసీ అంటారు.టర్మ్ పాలసీ అనేది మనం లేని సమయంలో మన కుటుంబానికి అండగా ఉండటం కోసం ఏర్పాటు చేసుకున్న ముందు జాగ్రత్త చర్యగా చెప్పవచ్చ.అలాంటిది మనం లేని సమయంలో మన కుటుంభ సభ్యులు శ్రమ పడకుండా ఉండాలంటే మనం పాలసీని ఎంచుకొనే ముందే జాగ్రత్త వహించాలి.

టర్మ్ ఇన్సూరెన్స్ ఎంపికలో  ముఖ్యంగా 3  అంశాలను  పరిగణలోకి తీసుకొని ఎంచుకోవాల్సి ఉంటుంది. వాటిని ఈ క్రింద వివరించడం జరిగింది. ఒక్కొక్కటిగా తెల్సుకుందాం.

1 బీమా సంస్థ ఎంపిక 

2 పాలసీ ప్లాన్  ఎంపిక

3 వ్యక్తిగత అంశాల ఎంపికలు 

వీటిని ఒక్కొక్కటిగా తెల్సుకుందాం. ముందుగా ఒక బీమా సంస్థను ఎంచుకొనే ముందు  ఆ సంస్థలో ఎం చూడాలో చూద్దాం? ఒక బీమా సంస్థ ఎంపికలో ఆ సంస్థ  యొక్క క్రెడిబిలిటీని పరిగణలోకి తీసుకోని ఈ క్రింది వాటిని పరిశీలించాలి.

1) క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో (CSR ) : అనగా బీమా సంస్థ ఎన్ని క్లెయిమ్స్ ని పరిష్కరించిందో చెప్పే నివేదిక. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఎక్కువగా ఉంటె సంస్థ విశ్వసనీయత అంత మెరుగ్గా ఉంటుందని అర్ధం. 90% శాతం లేదా అంతకన్నా ఎక్కువ సెటిల్మెంట్  రేషియో ఉన్న సంస్థను ఎంకుకోవటం మంచిది. సగటున 3 సంవత్సరాలు మరియు గడచిన 30  రోజుల సెటిల్మెంట్ నిష్పత్తిని పరిగణలోకి తీసుకుంటే రెండు 97% కంటే ఎక్కువ ఉంటె అది మంచి సంస్థగా చెప్పవచ్చు ఈ నివేదికలు ప్రతి సంవత్సరం భారత బీమా ప్రాధికార సంస్థ (IRDAI) ప్రతి సంవత్సరం ప్రచురించే నివేదికలోలో చూడవచ్చు.irdai అనేది అన్ని బీమా సంస్థలకు బాస్ వంటిది. దీనికి భారత ప్రభుత్వ మద్దతు ఉండి అన్ని బీమా సంస్థలను నియంత్రిస్తుంది.

2) క్లెయిమ్ రిజెక్షన్ రేషియో : ఇది ఎంత తక్కువగా ఉంటె బీమా సంస్థ యొక్క విశ్వసనీయత అంత మెరుగ్గా ఉంటుందని అర్ధం. ఏదేని కారణం చేత క్లెయిమ్స్ నిరాకరించిన బడిన క్లెయిమ్స్ మొత్తాన్ని క్లెయిమ్స్ రిజెక్షన్ రేషియో అంటారు. ఇది 1% కన్నా తక్కువ ఉన్న సంస్థను ఎంచుకోవటం ఉత్తమం.

3) అమౌంట్ సెటిల్మెంట్ రేషియో : బీమా సంస్థలు ఎంత అమౌంట్ ని సెటిల్ చేశాయో కూడా పరిగణలోకి తీసుకోవాలి.చిన్న క్లెయిమ్స్ సెటిల్ చేసి పెద్ద క్లెయిమ్స్ రిజెక్ట్ చేస్తే ఆ సంస్థ ఎంపిక చేసుకోకపోవటం మంచిది కాదు, కావున అమౌంట్ సెటిల్మెంట్ రేషియో కూడా పరిగణలోకి తీసుకోవాలి.

4) కంప్లయెంట్స్ రేషియో : ఒక బీమా సంస్థకు ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయంటే ఆ సంస్థ  పనితీరు బాగా లేదు అన్నమాట. వీటిని మనం IRDAI నివేదికలో చూసుకోవచ్చు.కంప్లైంట్స్ రేషియో ఎక్కువగా ఉన్న బీమా సంస్థను ఎంసీకోవద్దు.

5) సాల్వెన్సీ రేషియో : మంచి సాల్వెన్సీ రేషియో అనేది బీమా సంస్థ యొక్క ఆర్ధిక సామర్ధ్యాన్ని, పాలసీదారుల అవసరాలు తీర్చడంలో సంస్థ పనితీరును సూచిస్తుంది. కనీసం 1.5 సాల్వెన్సీ రేషియో ఉన్న బీమా కంపెనీ నుండి పాలసీ తీసుకోవటం మంచిది.టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కనీసం 20 నుండి 30 సంవత్సరాలు కాల పరిమితికి సంభంధించినది కావున అత్యధిక ఆర్ధిక సామర్ధ్యం కలిగి ఉన్న బీమా సంస్థను ఎంచుకోవటం మంచిది.

2-పాలసీకి సంబంధించిన ఎంపిక  : ఒక మంచి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో ప్లాన్ లో ఈ ప్రయోజనాలు తప్పకుండ ఉండాలి.

1 మరణ ప్రయోజనం :

ఏదేని దురదృష్ట సంఘటన జరిగి పాలసీదారుడు అకాల మరణం చెందినట్లయితె వారిపై ఆధారపడిన వారి కుటుంబానికి ఏక మొత్తంలో ఆర్ధిక పరిహారాన్ని అందించి వారి కుటుంబానికి అండగా ఉంటుంది.ఇదే  జీవిత బీమా ప్రధాన లక్ష్యం గా చెప్పవచ్చు. జీవన మనుగడలో ఎటునుండి ఎటువంటి ప్రమాదం సంభవించునో ఉహించలేం గతంలో కరోనా మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాలు సంపాదిచే వ్యక్తిని కోల్పోయి రోడ్డున పడ్డాయి.కావున ఇటువంటి పరిస్థుల నుండి మన కుటుంభాన్ని కాపాడుకోవటం కోసం తప్పనిసరి జీవిత బీమా కలిగి ఉండాలి.

2 టర్మినల్ ఇల్ నెస్ :

పాలసీదారుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ఆరు నెలల్లో మరణం సంభవించవచ్చు అని నిర్ధారణ అయినపుడు మరణ ప్రయోజనాన్ని ముందుగానే చెల్లించబడుతుంది. చెల్లించబడుతుంది. పాలసీ కాలంలో ఒకటే టర్మినల్ ఇల్ నెస్ బెనిఫిట్ చెల్లించ బడుతుంది. అలాగే టర్మినల్ ఇల్ నెస్ నిర్ధారణ అయినాక జీవిత బీమా కవరేజ్ మరియు రైడర్ ప్రీమియంలు అన్ని మాఫీ చెయ్యబడతాయి. టర్మినల్ ఇల్ నెస్ బెనిఫిట్ అనేది పాలసీ కవరేజ్ లో భాగంగా చెల్లించబడే ప్రయోజనం మాత్రమే.

3 క్రిటికల్ ఇల్ నెస్ :

జీవిత బీమా మరణ ప్రయోజనంతో పాటు అనుకోకుండా వచ్చే ప్రాణాంతక వ్యాధులకు పాలసీదారునికి ఆర్ధిక పరిహారాన్నిఅందించి వారి కుటుంబాన్ని ఆదుకుంటుంది.కాన్సర్ ,గుండె జబ్బులు,బ్రెయిన్ స్ట్రోక్ కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి తీవ్రమైన జబ్బులకు కుటుంభం చిన్నాభిన్నం అయ్యే పరిస్థితి ఉంటుంది అందుచేత జీవిత బీమా కలిగివున్నట్లు అయితే ఇటువంటి విపత్కర సమయంలో జీవిత బీమా ఆర్ధిక సహకారం అందించి వారి కుటుంబానికి భరోసా నిస్తుంది. ఈ వ్యాధుల సంఖ్య 10 నుండి 64 వ్యాధులను కవర్ చేస్తుంది, ఇది మనం ఎంచుకొనే పాలసీని బట్టి ఉంటుంది.

4 యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబులిటీ రైడర్ :

ఏదేని ప్రమాదంలో మరణించినట్లయితే జీవిత బీమా కవర్ తో పాటు ఈ రైడర్ అదనంగా వారి కుటుంబానికి అదనపు ప్రయోజనం చేకూరుస్తుంది. దీనికి అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది  రోజు ప్రయాణాలు లేదా రిస్క్ తో కూడిన జీవన శైలి ఉన్న వ్యక్తులకు ఉపయోగ పడుతుంది.అలాగే ఈ రైడర్ లో మరణ ప్రయోజనంతొ పాటు ప్రమాదంలో  శాశ్వత అంగవైకల్యం లేదా పాక్షిక అంగ వైకల్యం ఏర్పడితే కూడా పాలసీలో పేర్కొన్న విధంగా ఆర్ధిక ప్రయోజనంతో పాటు ప్రీమియం మినహాయింపుతో పాటు జీవితబీమా కవర్ చెల్లించబడుతుంది.

5 ప్రీమియం మినహాయింపు రైడర్  :

పాలసీదారుడికి ఏదేని ప్రమాదం,లేదా  తీవ్ర అనారోగ్యం సంభవించి పని చెయ్యని పరిస్థితిలో ఉంటే ప్రీమియం మాఫీ చేసి పాలసీ ఇచ్చిన హామీ మేరకు లైఫ్ కవర్ తో పాటు పాలసీ ప్రయోజనాలు అన్ని అందించబడుతాయి. ఇవి కొన్ని బీమా సంస్థలు ఉచితంగా మరికొన్ని అదనపు ప్రీమియంతో అందిస్తాయి.

6 జీవితబీమా కవర్ టాప్-అప్ సౌకర్యం :

పెరుగుతున్న ద్రవోల్బణం ఆధారంగా పాలసీ కవరేజి కూడా పెరిగే పాలసీని ఎంచుకోవటం మంచిది. అలాగే వివిధ జీవిత దశల్లో అనగా వివాహం ,పిల్లలు వంటి బాధ్యతలు పెరుగుతున్న కొద్ది కవర్ పెరిగే  మంచి పాలసీని ఎంచుకోవటం ఉత్తమం.

3 వ్యక్తిగత అంశాల ఎంపికలు :

జీవిత బీమాను ఎంచుకొనే ముందు పాలసీదారుడు తన వ్యక్తిగత అంశాల ఎంపికలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అవి…

1-లైఫ్ కవరేజ్ ఎంత ? జీవిత బీమా కవరేజ్ అనేది ఈ క్రింది అంశాలను పరిగణలోకి తీసుకొని ఎంత ఉండాలో నిర్ణయించుకొవచ్చు.అవి :

మీ కుటుంభం అవసరాలు : కుటుంభ రోజు వారి అవసరాలు ఒక్కో కుటుంబానికి ఒక్కో విధంగా ఉంటాయి. మీ కుటుంబానికి పెద్ద దిక్కు మీరే కనుక, మీ కుటుంభం  మొత్తం ఆదాయం మరియు మొత్తం ఖర్చులను అంచనా వేయండి, మీరు లేని సమయంలో మీ కుటుంభం అవసరాలు తీర్చటానికి ఎంత మేరకు అవసరం పడుతాయో అంచనా వేసి అంత మేరకు లైఫ్ కవర్ తీసుకోండి.

HLV సూత్రం : దీన్నే మానవ జీవిత విలువ సూత్రం అంటాం . ఒక వ్యక్తి సంవత్సర ఆదాయం నుండి సంవత్సర ఖర్చులు తీసివేయ్యగా వచ్చిన మిగులును ఆధారం చేసుకొని ఆ మిగులు మొత్తానికి 100 రేట్లు జీవిత బీమా చెయ్యాలని ఈ HLV సూత్రం చెపుతుంది.

రుణాలు మరియు అప్పులు : మీరు మీ కుటుంభం అవసరాలకు లేదా వ్యాపార అవసరాలకు ఎంత మేరకు అప్పులు తీసుకున్నారో వాటిని పరిగణలోకి తీసుకొని బీమా చేయండి.ఎందుకంటే మీరు లేని సమయంలో ఆ అప్పులు రుణాల భారం  మీ కుటుంబంపై పడే అవకాశం ఉంది.

మెడికల్ ఎమర్జెన్సీ : మీరు ఊహించని ఏదేని అనారోగ్య పరిస్థితి వస్తే వైద్యం పరంగా దాన్ని ఎదుర్కోవటమే కాకుండా  మీ కుటుంభ రక్షణకు ఎంత మేరకు అవసరమో అంత వరకే  అంచనా వేసి దాని  ప్రకారం బీమా  కవరేజ్ ఎంపిక చెయ్యండి.

జీవిత దశలు : యుక్త వయస్సు ,యవ్వనం ,వృద్యాప్యం లాంటి వివిధ  జీవిత దశలలో ఎంత మేరకు ఆర్ధిక అవసరాలు ఉంటాయో  వాటిని అంచనా వేసి అంత మేరకు పాలసీ కవర్ తీసుకోవాలి.

2 కవరేజ్ కాలం :

లైఫ్ కవర్ అనేది ఎన్ని సంవత్సరాలకు అనేది పాలసీదారునికి పాలసీదారునికి మధ్య మారుతూ ఉంటుంది.తన వ్యక్తిగత కుటుంభ బాధ్యతలు ముగిసే వరకు లేదా తాను పదవి విరమణ చేసే సమయం వరకు ఎంపిక చేసుకోవచ్చు.మరికొందరు తమ 60 ఏటా వరకు బీమా కవరేజ్ ఎంచుకుంటారు. ఈ మధ్య కాలంలో ‘FIRE’ అనే కాన్సెప్ట్ వెలుగులోకి వచ్చింది అనగా FINANCECIAL INDEPENDENCE RETAIRE EARLY అనగా తాము నెరవేర్చాలని  ఆర్ధిక బాధ్యతలను ముందుగానే నెరవేర్చుకోవడం అన్నమాట. అయితే లైఫ్ కవరేజ్ అనేది తమ ఆర్ధిక బాధ్యతలు ఎప్పటికల్లా నెరవేరతాయో అప్పటివరకు ఎంచుకోవాలి.

3 ప్రీమియం చెల్లింపులు :

ప్రీమియం చెల్లింపులు పాలసీదారుని సౌలభ్యం మేరకు   సింగిల్ ప్రీమియం ,లిమిటెడ్ ప్రీమియం ,రెగ్యూలర్ ప్రీమియం చెల్లింపులు చేసుకొనే సౌలభ్యం ఉంది. ఈ చెల్లింపులు నెల , త్రైమాసికం అర్ధవార్షికం, వార్షికంగా చెల్లించవచ్చు.

4 డెత్ బెనిఫిట్ చెల్లింపులు :

పాలసీదారుని అకాల మరణాంతరం కుటుంభ సభ్యలు పొందే హామీ ప్రయోజనం 4 విధాలుగా చెల్లించబడే సౌకర్యం ఉంది. ఏక మొత్తంలో లేదా మంత్లీ ఇన్కమ్ గా లేదా కొంత మొత్తం ఏక కాలంలో చెల్లించి మిగిలింది నెలనెలా ఆదాయం పొందే విధంగా మరియు ప్రతి సంవత్సరం 10% పెరుగుతూ చెల్లించబడెలా లైఫ్ కవర్ మొత్తం పొందవచ్చు.

5 M.W.P ఆక్ట్ :

M.W.P ఆక్ట్ అనగా మ్యారీడ్ విమెన్ ప్రాపర్టీ ఆక్ట్  ద్వారా  వివాహిత మహిళలకి ఒక రక్షన చట్టం దీని ద్వారా  జీవిత బీమా కలిగిన పాలసీదారుడు  అకాల మరణం చెందితే బీమా సంస్థల నుండి వచ్చే పరిహారాన్ని అప్పుపు ,రుణాలకు చెందకుండా  నేరుగా తన జీవిత భాగస్వామికి చెందుతుంది. MWP ఆక్ట్ కి చట్టపరమైన రక్షణ ఉంది. ఈ ఆప్షన్ ని ఎంచుకొనే ముందు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు పున : పరిశీలించుకోవాలి. బీమా పాలసీల్లో ఎ నామిని మార్చినట్టు దీన్ని మార్చలేము.

6-రెండో పాలసీ అయితే :

ఇదివరకే ఒక పాలసీ ఉండి ఇప్పుడు రెండో పాలసీ తీసుకున్నట్లయితే పాత పాలసీ వివరాలు తప్పకుండ ఈ బీమా సంస్థకు  తెలియజేయాలి. ఒకవేళ తెలియజెయకుండా పాలసీ తీసుకున్నట్లయితే భవిషత్తులో క్లెయిమ్ సమయంలో  రెండు బీమా సంస్థలు పూర్తి కవరేజ్ నివ్వకుండా రెండు బీమా సంస్థలు కలిపి చెరో 50% కవరేజ్ ని మాత్రమే  క్లెయిమ్స్ ని ఇస్తాయి.కావున పాలసీదారుడి కుటుంభం 50% పాలసీ కవరేజ్ ని కోల్పోవాల్సి వస్తుంది.

7- ప్రపోజల్ ఫారం : 

టర్మ్ ఇన్సురెన్సు ఎంపికలో అతి ముఖ్యమైనది పాలసీ ప్రపోసల్ ఫారం ని స్వయంగా నింపడం లేదా పాలసీ కొనుగోలుదారుడి సమక్షంలో నింపటం.ఎందుకంటే మనం చెపుతున్న అన్ని విషయాలు కచ్చితంగా ఫ్రాపొసల్ ఫారంలో నింపింది లేనిదీ స్వయం చూడాలి.లేకుంటే భవిషత్తులో క్లెయిమ్స్ కి ఇబ్బంది కావచ్చు

8 ఫ్రీ లుక్  పీరియడ్ :

మనం ఎంచుకున్న పాలసీలో  మన పేరు ,నామిని ఇతర వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తప్పనిసరి సరిచూసుకోవాలి.అలాగే  మీ పాలసీలో మీరు కోరుకున్న ప్రయోజనాలు ఉన్నాయో లేవో సరిచూసుకుపోవాలి.ఒకవేళ తప్పుడు పాలసీ ఇచ్చినట్లయితే 15 నుండి 30 రోజుల్లో పాలసీని రద్దు చేసుకోవచ్చు.  దీన్నే ప్రీ లుక్ పీరియడ్ అంటారు .ఈలా ఫ్రీ లుక్  పీరియడ్ లో పాలసీ రద్దు చేసిన మీరు కట్టిన ప్రీమియంలో ఒక్క రూపాయి నష్టపోరు. టర్మ్ ఇన్సూరెన్స్ ఎంపికలో పాలసీదారులు చేసే సాధారణ తప్పులను గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు టర్మ్ పాలసీ  ఎంపికలో  తప్పకుండ పరిశీలించాల్సిన 3 ముఖ్యమైన విషయాలను గురించి ఇప్పుడు పరిశీలిద్దాం

జీవిత బీమాను  కొనుగోలు చెయటంలో చేయకూడని తప్పులు :

1 తప్పుడు వివరాలు ఇవ్వవద్దు : బీమా సంస్థకు పాలసీ కోసం చెప్పే వివరాలు తప్పుగా చెప్పకూడదు తప్పుడు వివరాలతో కూడిన పాలసీ క్లయిమ్స్ సమయంలో తిరస్కరించ  బడుతుంది

2 జీవన శైలి వివరాలు దాచకూడదు : మధ్యపాణం ,ధుమపాణం లాంటి అలవాట్లను పాలసీ తీసుకునేటప్పుడు తప్పకుండ తెలియ జేయాలి ప్రీమియం తగ్గుదల కోసం వివరాలు దాచవద్దు ఎందుకంటే పాలసీ క్లెయిమ్ కాదు.

3 వైద్య చరిత్ర : వ్యక్తిగత,కుటుంభం వంశపారంపర్యంగా సంక్రమించిన వ్యాధులను లేదా ఏదేని తీవ్రమైన వ్యాధితో లేదా గతంలో ఉన్న వ్యాధులను దాచకూడదు

4  ప్రీమియం చెల్లింపులు మిస్ చెయ్యకూడదు : మీకు మీ కుటుంబానికి రక్షణనిచ్చే జీవిత బీమా ప్రీమియంలు క్రమం తప్పకుండ కట్టనిచో పాలసీ లాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది   జీవిత బీమా పాలసీలన్నింటిలో టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాథమికమైనది . తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణను అందిస్తుంది. అందుకే దీన్ని “ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్” అంటారు. పాలసీ వ్యవధిలో బీమా దారుడు దురదుష్ట కారణంగా  అకాల మరణం చెందినట్లయితే మరణ ప్రయోజనాలను  అందించి వారి కుటుంబానికి అండగా ఉంటుంది. అయితే పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం ఈ పాలసీలో ఎటువంటి ప్రయోజనాలను పొందడు అయితే కొన్ని రైడర్లు ఎంచుకోవడం వల్ల క్రిటికల్ ఇల్నెస్ యాక్సిడెంట్ డిజబులిటీ లాంటి ప్రయోజనాలను పొందవచ్చు జీవిత బీమాను ఎంచుకొనే ముందు పాలసీదారులు ఈ తప్పులు  చేయకూడదు  :

ముగింపు : 

జీవిత బీమా అనేది పాలసీదారుడు మరణించినప్పుడు పాలసీ ప్రాణం పోసుకుంటుంది. అనగా జీవిత బీమా పాలసీదారుని కుటుంభనికి తన ప్రతిరూపంగా చెప్పవచ్చు. అందుచేత తాను లేనప్పుడు తన కుటుంభం ఇబ్బంది పడకుండా ఉండాలంటే మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఎంపిక చేసుకోవాలి.

 

 

share

Leave a Comment