TATA AIA సంపూర్ణ రక్షా ప్రామిస్ టర్మ్ పాలసీ గురించి వివరించండి ? -

TATA AIA సంపూర్ణ రక్షా ప్రామిస్ టర్మ్ పాలసీ గురించి వివరించండి ?

share

TATA AIA- ‘Samporna Raksha Promise Term Policy’

మనిషి జీవితం ఉహించలేనిది ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. మనం లేని పరిస్థితుల్లో మన కుటుంభ ఆర్ధిక అవసరాలు తీర్చడం కోసం జీవిత బీమా అందుకు తోడ్పడుతుంది. అందుకోసం టాటా AIA లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ  ”సంపూర్ణ రక్ష ప్రామిస్‌” అను టర్మ్ పాలసీని తీసుకరావటం జరిగింది.ఈ ”సంపూర్ణ రక్షా ప్రామిస్” అనే పాలసీ నాన్ -లింక్డ్ ,నాన్ -పార్టిసిపేటింగ్ , ప్యూర్ రిస్క్ టర్మ్ పాలసీ.టాటా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 2001 లో ప్రారంభమైంది ఈ కంపెనీ TATA SON – మరియు AIA గ్రూప్ జాయింట్ వెంచర్ కంపనీ.

TATA – AIA బీమా సంస్థ వివరాలు  :

TATA -AIA  అనేది  జనరల్  ఇన్సూరెన్స్ కంపనీ టాటా సన్స్ (51%) మరియు AIA గ్రూప్ (49%) ల మధ్య గల జాయింట్ వెంచర్ గల సంస్థ. టాటా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 2001 లో ప్రారంభమైంది. ఈ ఇన్సూరెన్స్ కంపనీలో అనేక జీవిత బీమా మరియు పొదుపు ప్రణాళికలు కలవు.అందులో ఒక టర్మ్ పాలసీనే  ” SAMPOORNA RAKSHA PROMISE – TERM PLAN  ” అంటారు. సాధారణంగా టర్మ్ పాలసీ ఎంపికకు ముందు ఆ బీమా సంస్థ యొక్క పనితీరును పరిగణలోకి తీసుకొని పాలసీ ఎంపిక చేసుకోవటం జరుగుతుంది. అందుకోసం ఏం పరిశీలించాలో ఈ క్రింద వివరించడం జరిగింది.

1) క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో (CSR ) : అనగా బీమా సంస్థ ఎన్ని క్లెయిమ్స్ ని పరిష్కరించిందో  చెప్పే నివేదిక. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఎక్కువగా ఉంటె సంస్థ విశ్వసనీయత అంత మెరుగ్గా ఉంటుందని అర్ధం. 95% శాతం లేదా అంతకన్నా ఎక్కువ సెటిల్మెంట్  రేషియో ఉన్న సంస్థను ఎంకుకోవటం మంచిది. TATA -AIA లైఫ్ ఇన్సూరెన్స్ గడిచిన 5 సంవత్సరాలుగా  98.75% సగటుతో అత్యుత్తమ బీమా సంస్థగా నిలిచింది.

3) అమౌంట్ సెటిల్మెంట్ రేషియో : బీమా సంస్థలు ఎంత అమౌంట్ ని సెటిల్ చేశాయో కూడా పరిగణలోకి తీసుకోవాలి.చిన్న క్లెయిమ్స్ సెటిల్ చేసి పెద్ద క్లెయిమ్స్ రిజెక్ట్ చేసే సంస్థను ఎంపిక చేసుకోక పోవటం మంచిది. TATA -AIA లైఫ్ ఇన్సూరెన్స్ సగటున 94.49% తో మంచి సెటిల్మెంట్  రేషియోని కలిగి ఉంది.

4) కంప్లయెంట్స్ రేషియో : బీమా సంస్థకు ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయంటే ఆ సంస్థ  పనితీరు బాలేదు అన్నమాట. ప్రతి 10-వేల క్లెయిమ్స్ లో ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయో తెలియజేసే నివేదికే కంప్లైంట్స్ రేషియో అంటారు. TATA -AIA లైఫ్ ఇన్సూరెన్స్  14.3%  రేషియోతో తక్కువ కంప్లైంట్స్ ను కలిగి ఉంది.

అర్హతలు :……………………………………………………

 TATA -AIA  సంపూర్ణ  రక్షా ప్రామిస్ పాలసీ  వివరాలు :

ఈ పాలసీని ” SAMPOORNA RAKSHA PROMISE   ” టర్మ్ పాలసీ అని పిలుస్తారు. ఈ టర్మ్ పాలసీ నాన్ – లింక్డ్ , నాన్ – పార్టిసిపేటివ్ ఇండివిజువల్ ప్యూర్ రిస్క్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ పాలసి వివిధ ఆప్షన్స్ లు మరియు రైడర్స్ తో కూడిన అనేక  ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. వీటిలో పాలసీదారులు యొక్క వ్యక్తిగత అవసరాలను బట్టి  వివిధ  ఆప్షన్స్ ని ఎంపిక చేసుకోవచ్చు. వాటిని ఈ క్రింద వివరించడం జరిగింది అవి

Death Benefit 

ఈ ప్రయోజనం క్రింద పాలసీదారుడికి హామీ ఇచ్చిన లైఫ్ కవర్ మేరకు మరణ ప్రయోజనం చెల్లించబడుతుంది. టర్మినల్ ఇల్ నెస్  నిర్ధారణ అయినా సమయంలో అంతకు మునుపే చెల్లించిన కవరేజ్ పోను మిగతా మరణ ప్రయోజనం చెల్లించ బడుతుంది.డెత్ బెనిఫిట్ చెల్లించిన అనంతరం పాలసీ టర్మినేట్ చెయ్యబడుతుంది.

Early pay-out on Terminal illness

పాలసీదారుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ఆరు నెలల్లో మరణం సంభవించవచ్చు అని నిర్ధారణ అయినపుడు పాలసీ కవరేజ్ లో 50% వరకు నిర్దిష్ట మొత్తం చెల్లించబడుతుంది. అలాగే టర్మినల్ ఇల్ నెస్ నిర్ధారణ అయినాక జీవిత బీమా కవరేజ్ ప్రీమియంలు అన్ని మాఫీ చెయ్యబడతాయి.

Flexi Pay premium Benefit :

పాలసీదారుడు తమ లైఫ్ కవర్ కోసం చెల్లించే ప్రీమియంలు మరియు రైడర్ చెల్లింపులు  12 నెలలు లేదా ఒక సంవత్సరం వరకు  ఆలస్యం గా చెల్లించిన పాలసీ ప్రయోజనాలు కొనసాగించబడుతాయి.ఆ సంవత్సర ప్రీమియంలు వచ్చే సంవత్సరం ప్రీమియంతో కలిపి కట్టాల్సి ఉంటుంది.అందుకోసం ఎటువంటి అదనపు ప్రీమియంలు చెల్లించ వలసిన అవసరం లేదు.ఈ ప్రయోజనం పాలసీ లాప్స్ కాకుండా కాపాడుతుంది.

Flexible payout option :

పాలసీదారుడు నామిని పొందే మరణ ప్రయోజనం వివిధ రకాలుగా పొందవచ్చు. లంప్ సమ్ (ఒకే చెల్లింపు), దశలవారీగా చెల్లింపు, లేదా లంప్ సమ్ మరియు దశల వారీగా  చెల్లింపబడే ఎంపిక చేసుకోవచ్చు. ఈ ఎంపికను పాలసీ కొనుగోలు సమయంలో ఎంపిక చేయాలి.దీనిని “పే అవుట్ ప్లాన్ ” అని పిలుస్తారు.

cover enhancement option

పాలసీ కవరేజ్ ని దశల వారిగా పెంచుకొనే అవకాశం ఈ పాలసీలో ఈ క్రింది రెండు విధాలుగా పెంచుకోవచ్చు.

1- life stage : వివాహం అనంతరం బేస్ కవరేజ్ కి 50% అదనంగా కవరేజ్ పెంచుకొనే అవకాశం ఉంది.అలాగే దత్తత లేదా పుట్టుక కారరంగా జన్మించిన మొదటి బిడ్డ పేరుమీద 25%  మరియు రెండవ దత్తత లేదా పుట్టిన బిడ్డ అనంతరం 25% మేరకు కవరేజ్ ని పేంచుకోనే అవకాశం ఉంది. అలాగే హోమ్ లోన్ తీసుకున్న పాలసీదారులను 100% మేరకు కవరేజ్ ని పెంచుకొనే అవకాశం ఈ పాలసీ ద్వారా పొందవచ్చు.

2- Top – UP : ఆప్షన్ ద్వారా, పాలసీదారుడు  ప్రతి పాలసీ సంవత్సరం జీవితబీమా  కవరేజీని 5 శాతం నుండి 20 శాతం మేరకు  పెంచుకోవచ్చు.దీని కోసం అదనంగా  ప్రీమియం చెల్లించాలి.ఈ పెరుగుదల అండర్ రైటర్ ఆమోదంపై ఆధారపడుతుంది.ఈ ఆప్షన్‌ను పాలసీ కొనుగోలు సమయంలో మాత్రమే ఎంపిక చేసుకోవాలి మరియు ప్రీమియం చెల్లింపు కాలం కనీసం 5 సంవత్సరాలు ఉండాలి.

table ……………………

Renewability option at Maturity:

పాలసీ కవరేజ్ కాలం ముగిసిన తర్వాత  తన ఆర్ధిక బాధ్యతలు ఇంకను నెరవేరని సందర్భంలో లేదా తనకు ఇంకను జీవిత బీమా రక్షణ అవసరం అని భావించిన యెడల తన పాలసీ గడువును పొడిగించుకోవచ్చు. ఈ ఆప్షన్ గరిష్ఠంగా 5 సార్లు పెంచుకొనే అవకాశం ఉంది..పొడిగించిన గడువు కవరేజ్ కోసం అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది, ఇది బీమా సంస్థ యొక్క అండర్ రైటర్ ఆమోదంపై ఆధారపడి ఉంటుంది.

Instant Payout on Claim Intimation:

పాలసీదారుడి మరణ సమాచారం బీమా సంస్థకు తెలియజేయగానే తక్షణం బేస్ కవరేజ్ లో 3 లక్షల వరకు  వారి కుటుంబానికి 24 గంటలలోపు చెల్లించబడుతుంది.మిగతావి పూర్తి డాకుమెంట్స్ అందించాక చెల్లిస్తుంది.ఈ ప్రయోజనం పొందాలంటే పాలసీ కనీసం మూడు  సంవత్సరాలు  పూర్తి చేసుకోవాలి.

PAID ADD-ONS

TATA – AIA సంపూర్ణ  రక్షా ప్రామిస్ టర్మ్ పాలసీ ద్వారా పైన పేర్కొన్న అన్ని ప్రయోజనాలు పాలసీలో ఇన్-బిల్డ్ ప్రయోజనాలుగా చెప్పవచ్చు. ఇవి పాలసీదారుని అవసరాలు తీర్చలేవు అనుకున్నప్పుడు అదనంగా ప్రీమియం చెల్లించి ఈ రైడర్ లను ఎంచుకోవటం ద్వారా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. వాటిని ఈ క్రింద వివరించడం జరిగింది అవి :

1 Extra payout on accidental death

ఈ రైడర్ ఎంపిక ద్వారా పాలసీదారుడు ప్రమాద కారణంగా మరణించిన యెడల బీమా సంస్థ హామీ మేరకు క్లెయిమ్ మొత్తం 100% ఏక మొత్తంలో చెల్లించబడుతుంది. దీనికి అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది  రోజు ప్రయాణాలు లేదా రిస్క్ తో కూడిన జీవన శైలి ఉన్న వ్యక్తులకు ఉపయోగ పడుతుంది ఇది జీవిత బీమా కవరేజ్ కి అదనంగా చెల్లించబడుతుంది.

2 Extra payout on disability

ఏదేని ప్రమాద కారణంగా  శాశ్వత అంగవైకల్యం లేదా పాక్షిక అంగ వైకల్యం ఏర్పడితే పాలసీలో పేర్కొన్న విధంగా ఆర్ధిక ప్రయోజనంతో పాటు ప్రీమియం మినహాయింపు ఉంటుంది . ఈ ప్రయోజనం పాలసీ పూర్తి అయ్యేవరకు లేదా 85 సంవత్సరాల వరకు మాత్రమే ఏది ముందు అయితే అంతవరకు ప్రయోజనం పొందవచ్చు.దీనికి అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది  రోజు ప్రయాణాలు లేదా రిస్క్ తో కూడిన జీవన శైలి ఉన్న వ్యక్తులకు ఉపయోగ పడుతుంది. అంగవైకల్యం కారణంగా కుటుంబానికి భారం కాకుండా ఈ రైడర్ ద్వారా పొందే ఆర్ధిక ప్రయోజనం వారికి అండగా ఉంటుంది.

3 Critical Illness cover

గుండె జబ్బులు ,కాన్సర్ శరీర అవయవాలు దెబ్బతినటం లాంటి ప్రాణాంతకర వ్యాధుల నుండి ఈ రైడర్ ద్వారా ఆర్ధిక ప్రయోజనం పొందవచ్చు. ఈ రైడర్ ద్వారా ప్రయోజనం పొందాలంటే 90 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.అలాగే క్రిటిసిల ఇల్ నెస్ నిర్ధారణ అయిన తర్వాత 14 రోజుల సర్వైవల్ పీరియడ్ ఉండాలి అంటే కనీసం 14 రోజులు తరువాత క్లెయిమ్ చెయ్యవచ్చు. రైడర్ ద్వారా 40 రకాల వ్యాధులను కవర్ చేస్తాయి.ఈ రైడర్ ను ఎంచుకొనే ముందు మీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక నాన్-యాక్సిలరేటెడ్ పేఅవుట్ రైడర్. అనగా, క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్‌గా చెల్లించే మొత్తం అనేది మీ బేస్ పాలసీ కవర్‌ లోంచి తీసేయరు. దీనివల్ల మీ బేస్ లైఫ్ కవర్ యధాతధంగా కొనసాగుతుంది. కాని ఇది పాలసీ కొనుగోలు చేసిన మొదటి 5 సంవత్సరాలు మాత్రమే కొనసాగుతుంది.అనంతరం అండర్ రైటర్ పాలసీకి లోబడి పునరుద్ధరించబడుతుంది.

ఉదాహరణకు:
మీ బేస్ పాలసీ కవర్ ₹50 లక్షలు, CI రైడర్ కవర్ ₹20 లక్షలు అనుకుంటే—మీకు క్రిటికల్ ఇల్నెస్ వచ్చిందనుకోండి, CI బెనిఫిట్‌గా ₹20 లక్షలు చెల్లిస్తారు. అయినా, మీ బేస్ పాలసీ ₹50 లక్షలు అలాగే ఉంటుంది, మరియు మీకు భవిషత్తులో ప్రాణాపాయం సంభవిస్తే మీ కుటుంబానికి 50 లక్షల క్లెయిమ్ చెల్లించబడుతుంది.

4 Waiver- of- premium cover

పాలసీదారుడికి ఏదేని ప్రమాదం,లేదా అనారోగ్యం సంభవించి పని చెయ్యని పరిస్థితిలో ఉంటే ప్రీమియం మాఫీ చేసి పాలసీ ఇచ్చిన హామీ మేరకు లైఫ్ కవర్ తో పాటు పాలసీ ప్రయోజనాలు అన్ని అందించబడుతాయి. ఈ ప్రయోజనం  అదనపు ప్రీమియంతో పొందవచ్చు.

TATA AIA హాస్పికేర్ రైడర్ :

ఈ రైడర్ ద్వారా  మీరు  తీవ్ర అనారోగ్యం లేదా గాయం కారణంగా కనీసం 24 గంటలు ఆసుపత్రిలో ఉంటే, రైడర్ ద్వారా  కొంత ఆర్ధిక ప్రయోజనం చెల్లిస్తుంది.  అనగా పాలసీలో పేర్కొన్న విధముగా అంత  మొత్తంగా పాలసీదారునికి నేరుగా డబ్బు చెల్లిస్తుంది. అందుకోసం కనీసం  90 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ( ప్రమాదవశాత్తు  ఆసుపత్రిలో చేరితే అందుకు ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ ఉండదు), అలాగే కొన్ని  నిర్దిష్ట ఆరోగ్య సమస్యలకు 2 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంటుంది.

ముగింపు :

share

Leave a Comment