పరిచయం :
వ్యక్తి యొక్క సంపూర్ణ ఆర్ధిక ప్రణాళికలో భాగంగా జీవిత బీమా కలిగి ఉండటం తప్పనిసరి. జీవిత బీమా అనేది పాలసీదారునికి ,పాలసీదారును కుటుంబానికి రక్షణ వ్యవస్థ లాగా పని చేస్తుంది. ఇందులో పాలసీదారుడు తమ అవసరాలకు తగ్గ పాలసీని ఎంచుకొని క్రమం తప్పకుండ ప్రీమియం చెల్లించడం జరుగుతుంది. అందుకు ప్రతిఫలంగా బీమా సంస్థ పాలసీ నింబంధల మేరకు ఇచ్చిన హామీని తప్పకుండ నెరవేరుస్తుంది. ఇది బీమా సంస్థకు – పాలసీదారునికి మధ్య జరిగే ఒక చట్టపరమైన ఒప్పందం.అందుకు భారతీయ బీమా ప్రాధికార సంస్థ IRDAI పాలసీదారుల ప్రయోజనాలను. హక్కులను కాపాడుతూ బీమా సంస్థలను ఎప్పటికప్పుడు నియంత్రిస్తుంది.
ఇన్ని ప్రయోజనాలు కలిగిన జీవిత బీమా కొనుగోలు ముందు ఎవరికి ఎటువంటి ప్రయోజనాలున్న పాలసీ అవసరమో తేల్సుకోని పాలసీ కొనుగోలు చెయ్యాలి. అందుచేత జీవిత బీమా యొక్క సంపూర్ణ ప్రయోజనాలను ఈ క్రింద వివరించడం జరిగింది అవి :
1 మరణ ప్రయోజనం :
ఏదేని దురదృష్ట సంఘటన జరిగి పాలసీదారుడు అకాల మరణం చెందినట్లయితె వారిపై ఆధారపడిన వారి కుటుంబానికి ఏక మొత్తంలో ఆర్ధిక పరిహారాన్ని అందించి వారి కుటుంబానికి అండగా ఉంటుంది. ఇదే జీవిత బీమా ప్రధాన లక్ష్యం గా చెప్పవచ్చు. జీవన మనుగడలో ఎప్పుడు ఏ సమయంలో ఎటువంటి ప్రమాదం సంభవించునో ఉహించలేం. గతంలో కరోనా మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాలు సంపాదిచే ఇంటి పెద్దను కోల్పోయి రోడ్డున పడ్డాయి. కావున ఇటువంటి పరిస్థుల నుండి మన కుటుంభాన్ని కాపాడుకోవటం కోసం తప్పనిసరి జీవిత బీమా కలిగి ఉండాలి.
2 టర్మినల్ ఇల్ నెస్ ప్రయోజనం :
పాలసీదారుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ఆరు నెలల్లో మరణం సంభవించవచ్చు అని నిర్ధారణ అయినపుడు మరణ ప్రయోజనాన్ని ముందుగానే చెల్లించబడుతుంది. ఇది వారి కుటుంభనికి గొప్ప స్వాంతనగా చెప్పవచ్చు. మరియు తన ఆరోగ్యం బాగుకోసం ఆ డబ్బులు ఉపయోగించుకోవచ్చు లేదా తాను జీవించి ఉన్నప్పుడే తన కుటుంభ అవసరాలు ఈ డబ్బుల ద్వారా తీర్చవచ్చు. పాలసీ కాలంలో ఒకటే టర్మినల్ ఇల్ నెస్ బెనిఫిట్ చెల్లించ బడుతుంది. అలాగే టర్మినల్ ఇల్ నెస్ నిర్ధారణ అయినాక కొన్ని జీవిత బీమా సంస్థలు కవరేజ్ మరియు రైడర్ ప్రీమియంలు అన్ని మాఫీ చెయ్యవచ్చు. టర్మినల్ ఇల్ నెస్ బెనిఫిట్ అనేది పాలసీ కవరేజ్ లో భాగంగా చెల్లించబడే ప్రయోజనం మాత్రమే.
3 క్రిటికల్ ఇల్ నెస్ ప్రయోజనం :
జీవిత బీమా మరణ ప్రయోజనంతో పాటు అనుకోకుండా వచ్చే ప్రాణాంతక వ్యాధులకు పాలసీదారునికి ఆర్ధిక పరిహారాన్నిఅందించి వారి కుటుంబాన్ని ఆదుకుంటుంది. కాన్సర్ ,గుండె జబ్బులు,బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి తీవ్రమైన జబ్బులకు కుటుంభం చిన్నాభిన్నం అయ్యే పరిస్థితి ఉంటుంది. అందుచేత జీవిత బీమా కలిగివున్నట్లయితే ఇటువంటి విపత్కర సమయంలో జీవిత బీమా ఆర్ధిక సహకారం అందించి వారి కుటుంబానికి భరోసా నిస్తుంది. ఈ వ్యాధుల సంఖ్య 10 నుండి 64 వ్యాధులను కవర్ చేస్తుంది, ఇది మనం ఎంచుకొనే పాలసీని బట్టి ఉంటుంది.
4 యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ (A.D.B) :
పాలసీదారుడు ఏదేని ప్రమాదంలో మరణించినట్లయితే జీవిత బీమా కవర్ తో పాటు ఈ రైడర్ ద్వారా అదనంగా వారి కుటుంబానికి అదనపు మరణ ప్రయోజనం చేకూరుస్తుంది. దీనికి అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు లైఫ్ కవరేజ్ కోటి రూపాయలు అనుకుంటే ఈ A.D.B ర రైడర్ ద్వారా గరిష్టంగా ఇంకో కోటి అనగా మొత్తం రెండు కోట్ల రూపాయలు ఈ పాలసీ ద్వారా పాలసీదారుని కుటుంబానికి ఏక మొత్తంలో అందించడం జరుగుతుంది. రోజు ప్రయాణాలు లేదా రిస్క్ తో కూడిన జీవన శైలి ఉన్న వ్యక్తులకు ఈ రైడర్ ఉపయోగ పడుతుంది.
5 ఆక్సిడెంటల్ డిసబులిటీ బెనిఫిట్ :
ఈ రైడర్ ని ఎంచుకోవటం వలన ఏదేని ప్రమాద కారణంగా శాశ్వత అంగ వైకల్యం ,శాశ్వత పాక్షిక అంగవైకల్యం ,తాత్కాలిక మొత్తం వైకల్యం ఏర్పడిన సందర్భంలో పాలసీ బేస్ కవరేజికి సమానంగా అంటే ఉదాహరణకు లైఫ్ కవరేజ్ కోటి రూపాయలు అనుకుంటే ఈ డెసెబిలిటీ రైడర్ ద్వారా గరిష్టంగా ఇంకో కోటి వరకు ఈ పాలసీ ద్వారా పాలసీదారునికి నేరుగా ఏక మొత్తంలో అందించడం జరుగుతుంది.
6 ప్రీమియం మినహాయింపు ప్రయోజనం :
పాలసీదారుడు కనుక పైన పేర్కొన్న టర్మినల్ ఇల్ నెస్, క్రిటికల్ ఇల్ నెస్, పూర్తిగా లేదా శాశ్వతంగా వికలాంగుడిగా మారితే తన జీవిత బీమా కోసం భవిషత్తులో చెల్లించాల్సిన అన్ని ప్రీమియంలు మాఫీ చెయ్యబడతాయి. ఈ ప్రయోజనంలో లైఫ్ కవర్ కోసం చెల్లించే ప్రీమియంలతో పాటు ఇతర అన్ని రైడర్ ప్రీమియంలు కూడా మాఫీ చెయ్యబడతాయి. అయితే కొన్ని పాలసీలు క్రిటికల్ ఇల్ నెస్ కి ప్రీమియం మాఫీ చేస్తే కొన్ని టర్మినల్ ఇల్ నెస్ కి ప్రీమియం మాఫీ చేస్తాయి మరికొన్ని పాలసీలు శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే ప్రీమియం మాఫీ చేస్తాయి. మరియు మరికొన్ని బీమా సంస్థలు పైన పేర్కొన్న అన్ని పరిస్థితుల్లో ప్రీమియం ప్రీమియం మాఫీ చేసే పాలసీలు కూడా ఉన్నాయి. ఇవి బీమా సంస్థకు బీమా సంస్థకు మారవచ్చు.
7 హాస్పికేర్ రైడర్ ప్రయోజనం :
ఈ రైడర్ ద్వారా మీరు తీవ్ర అనారోగ్యం లేదా గాయం కారణంగా కనీసం 24 గంటలు ఆసుపత్రిలో ఉంటే, రైడర్ ద్వారా కొంత ఆర్ధిక ప్రయోజనం చెల్లిస్తుంది. అనగా పాలసీలో పేర్కొన్నప్రకారం అంత మొత్తం పాలసీదారునికి నేరుగా డబ్బు చెల్లిస్తుంది. ఈ రైడర్ ఎంచుకున్నట్లయితే వైద్యపరంగా అవసరమైన శస్త్రచికిత్స కోసం ఖర్చు పెట్టిన వైద్య ఖర్చులను ఈ పాలసీ ద్వారా పాలసీదారునికి చెల్లింపులు చెయ్యబడుతుంది. ఇది 3000 నుండి 30000 వెల వరకు ఎంపిక చేసుకోవచ్చు. మనం ఎంచుకునే పాలసీ ఆధారంగా ప్రీమియంకు 50 రేట్లు మొత్తాన్ని ఈ రైడర్ ప్రయోజనం ద్వారా పొందవచ్చు.అందుకోసం కనీసం 90 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. (కానీ ఏదేని ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో చేరితే అందుకు ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ ఉండదు), అలాగే కొన్ని నిర్దిష్ట ఆరోగ్య సమస్యలకు 2 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ కూడా ఉండవచ్చు గమనించగలరు.
8 మెచూరిటీ ప్రయోజనం :
జీవిత బీమా లైఫ్ కవర్ తో పాటు ప్రీమియం రూపంలో కట్టిన ప్రతి రూపాయికి అదనపు ప్రయోజనాలను మెచూరిటీ రూపంలో అందిస్తుంది. ఈ విధంగా సంపాదిస్తున్నపుడు కూడబెట్టిన డబ్బు భవిషత్తులో వృద్ధి చెంది ఏకకాలంలో పెద్ద మొత్తంలో పాలసీదారుని చేతికి వస్తుంది. యూలిప్స్ వంటి పెట్టుబడి పాలసీల్లో లైఫ్ కవర్ తో పాటు మార్కెట్ పరిస్థితులకు తగ్గ మంచి లాభాలు కూడా పొందవచ్చు.
9 గ్యారెంటెడ్ రిటర్న్స్ :
జీవిత బీమా సంస్థలో పెట్టిన ప్రతి పెట్టుబడికి పాలసీ సంస్థ ఇచ్చిన హామీ మేరకు కచ్చితమైన విశ్వసనీయమైన గ్యారెంటెడ్ రిటర్న్స్ అందుతాయి. ఒకవైపు జీవిత బీమా కవరేజ్, దాంతో పాటు పొదుపు ,పెట్టుబడి ప్రయోజనాలు పొందవచ్చు. అయితే కొన్ని పాలసీలు ముందుగా హామీ ఇచ్చిన మేరకు కచ్చితమైన గ్యారెంటీ చెల్లింపులు అందించే పాలసీలు కూడా కలవు. ఈ ప్రణాళిలలో 100 % హామీతో కూడిన రాబడులు అందించడం జరుగుతుంది . డబ్బులను సురక్షితంగా పోదుపు చేయాలనుకునే వారికి ఈ పాలసీ సరిగ్గా సరిపోతుంది. మార్కెట్ అనిచ్చితులకు సంభంధం లేకుండా 100 % గ్యారెంటీ హామీతో కూడిన ఆర్ధిక పెట్టుబడీగా వీటిని చెప్పవచ్చు.
10 సంపద సృష్టి :
జీవిత బీమా లైఫ్ కవరేజ్ తో పాటు, సంపద సృష్టికి సంబంధించిన ఎన్నో ప్రణాళికలు కలిగి ఉంటాయి. పాలసీ కోసం కట్టిన ప్రీమియంలలో కొంత భాగాన్ని జీవిత బీమా కోసం కేటాయించి మిగతా ప్రీమియంలు అధిక లాభాలు వచ్చే పెట్టుబడి సాధనాల్లో పెట్టి సంపద సృష్టికి దోహద పడుతాయి. ఈ విధముగా ఒకవైపు లైఫ్ కవర్ మరొకవైపు సంపద సృష్టికి జీవిత బీమా తోడ్పడుతుంది.
11 లోన్ సౌకర్యం :
జీవిత బీమా సంస్థ పాలసీదారుల ఊహించని ఖర్చులు లేదా ఆర్ధిక అత్యవసరాల కోసం రుణ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఆపదలో అప్పటికపుడు డబ్బు సమకూర్చుకోవటం కోసం పడే ఇబ్బందులను గుర్తించి బీమా సంస్థలు ఈ వెసులుబాటును కల్పించడం జరిగింది. అందుకోసం మనీ బ్యాక్ పాలసీల్లాంటివి ఉపయోగపడుతాయి. జీవిత బీమాతో పాటు పెట్టుబడి, ఆర్ధిక అత్యవసరాల కోసం ఈ పాలసీ ఎంపిక ఉత్తమైనది.
12 పదవి విరమణ ప్రణాళికలు :
పాలసీదారుడు పదవి విరమణ అనంతరం స్థిరమైన మరియు విశ్వసనీయమైన నెలవారి చెల్లింపులు ఈ పాలసీ ద్వారా అందించబడుతుంది. ఈ పాలసీలో కూడా మరణ ప్రయోజనంతో పాటు నెల నెల పింఛన్ రూపంలో పాలసీదారుడికి అందిస్తూ, తను వృద్ధాప్యంలో ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకు ఈ పాలసీ ఉపయోగపడుతుంది. తద్వారా పదవి విరమణ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించడానికి తోడ్పడుతుంది.
13 పిల్లల భవిషత్ ప్రణాళికలు :
జీవితబీమా పాలసీలో పాలసీదారుడు తమ పిల్లల కోసం ఉన్నత విద్య, వివాహం లాంటి భవిష్యత్ అవసరాల కోసం పొదుపు ప్రణాళికలను కలిగివుంది. పాలసీదారుడు లేదా తల్లిదండ్రులు అకాల మరణం సంభవించినప్పుడు వారి పిల్లల ఉన్నత విద్య మరియు వివాహం లాంటి భవిష్యత్ ప్రణాళికలకు ఈ పాలసీ సహాయపడుతుంది ఈ పాలసీలో మీ పిల్లల కోసం పొదుపు మరియు పెట్టుబడి ప్రణాళికలతో సహాయపడుతుంది. చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రణాళికలో ముఖ్యమైన విషయం ఏంటంటే జీవిత బీమా కవరేజీ పెద్ద మొత్తంలో ఉండటం. దురదృష్టకర సంఘటన వళ్ళ పిల్లల తల్లిదండ్రులు మరణించిన యెడల జీవిత బీమా కవరేజీ అందించి తక్షణ అవసరాలు తీరుస్తుంది.మరియు భవిషత్ ప్రీమియంలకు పాలసీ సంస్థ కడుతూ చివరికి మెచూరిటీ ప్రయోజనాలు అందిస్తుండి
14 జీవితకాలం కవరేజ్
జీవిత బీమా పాలసీల ద్వారా పాలసీదారుని జీవితాంతం లేదా 100 సంవత్సరాలకు లైఫ్ కవరేజీ ని అందించడంతో పాటు లిక్విడిటీ ప్రయోజనాలు ,టర్మినల్ బోనస్ లు లోన్ సౌకర్యం ఇతర అనేక ప్రయోజనాలు జీవితకాలం వరకు అందించే హోల్ లైఫ్ పాలసీలు కలవు . ఈ పాలసీ మెచూరిటీ సమయంలో తమ కుటుంబానికి పెద్ద మొత్తుమలో కార్పస్ ని సమకూర్చడం లాంటి ప్రయోజనాలు ఉన్నాయి.
15 లిక్విడిటీ ప్రయోజనాలు :
పాలసీ టర్మ్ లో ప్రతి 5 సంవత్సరాల కొక్కసారి 20% వరకు పాలసీల కోసం సమకూర్చిన ప్రీమియంల నుండి అత్యవసర సమయంలో పాలసీదారుడు తిరిగి పొందే సౌకర్యం ఉంది. అత్యవసర ఆర్ధిక అవసరాలకు ఈ ప్రయోజనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
16 బోనస్ ప్రయోజనాలు :
జీవిత బీమా పాలసీలలో పొదుపు రూపంలో చెల్లించిన ప్రీమియంలకు గాను కాలక్రమేణా అదనంగా జోడించబడే రివిజనరి బోనస్ లు టెర్మినల్ బోనస్ లు రూపంలో పాలసీదారుడు అదనపు ప్రయోజనాలు పొందవచ్చు.
17 పొదుపులను ప్రోత్సహిస్తుంది :
జీవిత బీమా పాలసీలు ప్రీమియం కోసం పాలసీదారుడు కచ్చితంగా పొదుపు చేస్తాడు. కావున పొదుపును ప్రోస్తహించేలా పాలసీలు తోడ్పడుతాయి. పాలసీదారుడు ఎంచుకున్న ప్రీమియం చెల్లింపు వ్యవధులు నెల వారి, త్రైమాసికం, అర్ధసంవత్సరం , సంవత్సరం వంటి ప్రీమియం చెల్లిపు ఎంపికలు పాలసీదారుడు వెసులుబాటును బట్టి ఐచ్చికంగా ఎంచుకోవచ్చు.
18 మనశ్శాంతిని ఇస్తుంది :
జీవిత బీమా మీ రోజు వారి కార్యక్రమాల్లో మీకు మీ కుటుంబానికి రక్షణ కవచంలా ఉంటుంది. కావున ఏదేని అనుకొని ప్రమాదం వచ్చిన కలత చెందకుండా మీ రోజువారీ కార్యక్రమాల్లో మీరు ప్రశాంతంగా ఉండవచ్చు.
19 టాక్స్ బెనిఫిట్స్ :
జీవిత బీమా కోసం చెల్లించే ప్రీమియంలకు మరియు క్లెయిమ్ సమయంలో వచ్చే లైఫ్ కవర్ ప్రయోజనాలకు పన్ను మినహాయింపు ఉంటుంది. బేస్ ప్లాన్ కోసం చెల్లించే ప్రీమియంలకు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80 (C ) కింద సంవత్సరానికి 1.5 లక్షలు వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే క్రిటికల్ ఇల్ నెస్ కోసం చెల్లించే ప్రీమియంలు సెక్షన్ 80 D కింద పన్ను మినహాయింపు అలాగే మెచూరిటీ సమయంలో వచ్చే ఆదాయంలో సెక్షన్ 10(10D ) కింద పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది.
ఈ విధముగా జీవిత బీమా అనేది వ్యక్తి యొక్క సంపూర్ణ ఆర్ధిక ప్రణాళికలో ఒక భాగంగా చెప్పవచ్చు.పొదుపు ,పెట్టుబడులతో పాటు జీవిత బీమా కవరేజ్ కోసం ప్రతి ఒక్కరికి అవసరాలకు తగ్గ జీవిత బీమా తప్పనిసరి.
ముగింపు :
జీవిత బీమా చెల్లించే పాలసీదారుడు దురదృష్టవశాత్తు మరణిచినట్లయితే లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఉంటె అంత బీమా సంస్థ ఆ వ్యక్తి కుటుంబానికి అందించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది. ఈవిధంగా మరణ ప్రయోజనమే కాకుండా జీవిత బీమాలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాల దృష్ట్యా ప్రతి వ్యక్తికి బీమా తప్పనిసరి అని తెలుస్తుంది? అయితే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన భారత దేశంలో జీవిత బీమా కలిగి ఉన్న వారి సంఖ్య చాలా తక్కువ. మన దేశ వెనుకబాటుతనం, నిరక్షరాస్యత, జీవిత బీమా ఫై అవగాహన లేకపోవటం అందుకు కారణాలు చెప్పవచ్చు.