LIC YUVA TERM POLICY
స్టోరీ
LIC యువ టర్మ్ పాలసీ అనేది యువకుల కోసం కొత్తగా ప్రారంభించబడిన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. పాలసీదారుడు దురదృష్టకర సంఘటన వల్ల మరణించినట్లయితే వారి కుటుంబానికి రక్షణ కల్పించడానికి ఈ పాలసీ రూపొందించబడింది.
LIC యొక్క యువ టర్మ్ ప్లాన్ అనేది నాన్ లింక్డ్ ,నాన్ పార్టిసిపేటింగ్ ,ఇండివిజువల్ ఫ్యూర్ రిస్క్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అనగా ఈ టర్మ్ ప్లాన్ అనేది ఎటువంటి లాభాలు అందించబడని కేవలం జీవిత బీమా రక్షణ కొరకు మాత్రమే ఉద్దేశించబడిన పాలసీ. ఈ ప్లాన్ ద్వారా పాలిసీదారునికి అనుకోని మరణం సంభవించిన సందర్భంలో, అతని కుటుంబానికి ఆర్థిక భద్రత అందించబడుతుంది.
పాలసీ ప్రత్యేకతలు :
1- తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ అందించే టర్మ్ పాలసీ
2- మహిళలకు ప్రత్యేక ప్రీమియం తగ్గింపు రేట్లు
3- పొగ త్రాగే వారికీ తగని వారికి వేరు వేరు ప్రీమియం రేట్లు పొగ త్రాగని వారికి ప్రత్యేక ప్రీమియం తగ్గింపు రేట్లు
4- 1-కోటి నుండి 5-కోట్ల కవరేజ్ పాలసీ తీసుకున్న వారికి 14% నుండి 40% వరకు ప్రీమియం తగ్గింపులు ఉంటాయి.
5- అలాగే 6 నెలలకు ఒకసారి ప్రీమియం చెల్లింపులు ఎంచుకున్నట్లయితే 2% మేర ప్రీమియం డిస్కౌంట్ లు ఉంటాయి.
6-ఈ పాలసీలో లైఫ్ కవర్ స్థిరంగా మరియు కవరేజ్ పెంచుకొనే విధముగా ఎంపిక చేసుకోవచ్చు.
పాలసీ అర్హతలు :
పాలసీ కవరేజీ పరిమితి : 50 లక్షల నుండి అపరిమితం 5 కోట్ల వరకు
వయస్సు అర్హతలు : 18 సం .. నుండి 45 సం.. రాల వరకు
ప్రీమియం చెల్లింపుల కాలం : సింగిల్ పే ,లిమిటెడ్ పే ,(5-10-15 సం..మాత్రమే అందుబాటులో ఉంది
ప్రీమియం చెల్లింపులు : అర్ధ సంవత్సరం ,సంవత్సరం
పాలసీ కాలపరిమితి : మినిమం పాలసీ టర్మ్ : 33 సం ..మాక్సిమం ; 75 సం ..
పాలసీ బెనిఫిట్స్ :
డెత్ బెనిఫిట్ :
పాలసీదారుడు దురదృష్టకరమైన సంఘటనలో అకాల మరణం చెందిన యెడల వారి నామినికి వారు ఎంచుకున్న పాలసీ కవరేజ్ ని బట్టి డెత్ బెనిఫిట్ అందించడం జరుగుతుంది.ఈ విధంగా పాలసీదారుని కుటుంబానికి లేదా నామినికి ఈ పాలసీ రక్షణ కవచంలాగా పనిచేస్తుంది.
లైఫ్ కవర్ కవరేజ్ ఎంపికలు – జీవిత బీమా కొనుగోలు సమయంలో కవరేజ్ అనేది స్థిరంగా లేదా క్రమంగా పెరిగే విధంగా ఎంపిక చెయ్యవచ్చు.ఇది పాలసీ కొనుగోలు సమయంలోనే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది, తరవాత మార్చుకోలేము.
A -స్థిరంగా ఉండే డెత్ కవరేజ్ :
పాలసీదారుడు పాలసీ ఎంచుకొనే ముందే డెత్ బెనిఫిట్ అనేది స్థిరంగా ఉండి పాలసీదారుడు మరణించిన సమయంలో పాలసీ కొనుగోలు సమయంలో ఎంత కవరేజ్ ఉండే అంత బీమా సంస్థ చెల్లిస్తుంది. పాలసీ ఆసాంతం ఇదే కవరేజ్ కొనసాగుతువుంది మధ్యలో మార్పులు చేసుకొనే అవకాశం ఉండదు.
B -పెరుగుతూ ఉండే డెత్ కవరేజ్ :
పాలసీ కొనుగోలు సమయంలో ఈ పాలసీని ఎంచుకున్నట్లయితే పాలసీ 1-5 సంవత్సరాల వరకు బేస్ కవరేజ్ ఉండి ఆ తరవాత 6-15 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం 10% లైఫ్ కవర్ పెరుగుతూ బేస్ కవరేజ్ కి రెండింతలు అవుతుంది. పాలసీదారుడు 16 సంవత్సరం లేదా ఆ తరువాత మరణించినట్లయితే బేస్ కవరేజ్ కి రెండింతలు అవుతుంది. ఇది ఒకసారి ఎంచుకున్న తర్వాత పాలసీ కాలంలో మల్లి మార్చలేము
మెచూరిటీ బెనిఫిట్ :
ఈ పాలసీలో ఎటువంటి మెచూరిటీ ప్రయోజనాలు లెవ్వు. పాలసీ వ్యవధిలో బీమా దారుడు అకాల మరణం చెందినట్లయితే వారి కుటుంబానికి బీమా కవరేజ్ అందిస్తుంది.ఒకేవేళ పాలసీదారుడు మరణించని యెడల ఈ పాలసీ ద్వారా ఎటువంటి ప్రయోజనం పొందాడు. అనగా పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం ఈ పాలసీలో ఎటువంటి ప్రయోజనాలను పొందడు.అందుకే దీన్ని ప్యూర్ టర్మ్ ప్లాన్ అంటారు.
డెత్ బెనిఫిట్ చెల్లింపులు :
పాలసీదారుని అకాల మరణాంతరం నామిని పొందే డెత్ ప్రయోజనం ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో 5-10-15 సంవత్సరాలలో అనగా నెలవారీ ,త్రైమాసికం అర్ధవార్షికం , వార్షికంగా పొందే అవకాశం ఉంది. దీన్ని పాలసీదారుడు తన పాలసీ అమలులో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎంచుకొనే అవకాశం ఉంది. పాలసీదారుడి మరణాంతరం డెత్ బెనెఫిట్ చెల్లింపులు మార్చలేము.
ప్రీమియం చెల్లింపులు :
ప్రీమియం చెల్లింపులు పాలసీదారుని సౌలభ్యం మేరకు సింగిల్ ప్రీమియం – లిమిటెడ్ ప్రీమియం -రెగ్యూలర్ ప్రీమియం చెల్లింపులు చేసుకొనే సౌలభ్యం ఉంది. లిమిటెడ్ ప్రీమియం ,రెగ్యూలర్ ప్రీమియంలు చెల్లించే వారు అర్ధవార్షికం, వార్షికంగా చెల్లించవచ్చు. సింగిల్ ప్రీమియం కనీసం 30000 వేలు ,రెగ్యూలర్ మరియు లిమిటెడ్ ప్రీమియం చెల్లించే వారు కనీస ప్రీమియం 3000 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
గ్రేస్ పీరియడ్ :
జీవిత బీమా కోసం చెల్లించే ప్రీమియంలు రెగ్యులర్ మరియు లిమిటెడ్ ప్రీమియం చెల్లింపులు ఎంచుకున్న వారు 30 రోజుల వరకు ప్రీమియం చెల్లించకున్న పాలసీ ప్రయోజనాలు చెల్లించబడుతాయి.30 రోజుల అనంతరం కూడా ప్రీమియంలు చెల్లించనట్లయితే పాలసీ లాప్స్ అవుతుంది.దీంతో పాలసీ ప్రయోజనాలు కోల్పోతారు.
పాలసీ పునరుద్ధరణ :
ప్రీమియం చెల్లించక లాప్స్ అయినా పాలసీని 5 సంవత్సరాల లోపు తిరిగి పునరుద్ధరణ చెయ్యవచ్చు. చెల్లించని ప్రీమియంలు కాంపౌండింగ్ వడ్డీతో సహా చెల్లించి పూర్తి ఆరోగ్యముగా ఉన్నాననే రుజువులు చూపించాల్సి ఉంటుంది. అండర్ రైటర్ షరతులకు లోబడి వారు అడిగిన సమాచారాన్ని,డాకుమెంట్స్ రిపోర్ట్స్ ఇవ్వల్సి ఉంటుంది.అప్పుడు కార్పొరేషన్ పాలసీలో మార్పులు చేర్పులు చేసి పాలసీని పునరుద్ధరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. పాలసీ తిరస్కరించినప్పుడు రెగ్యులర్ ప్రీమియం చెల్లింపుదారులకు ఎటువంటి చెల్లింపులు చెయ్యబడవు. కానీ లిమిటెడ్ పే చెల్లింపుదారులకు సరెండర్ వాల్యూ చెల్లించి పాలసీని రద్దు చేస్తుంది.అలాగే రైడర్ ప్రయోజనాలు కూడా బేస్ పాలసీ పరిమితులకు లోబడే ఉంటుంది.
పాలసీ సరెండర్ వాల్యూ :
1 సరెండర్ వాల్యూ అనేది రెగ్యులర్ ప్రీమియం చెల్లింపు ప్లాన్ లో ఉండదు.
2 సింగిల్ పే ప్రీమియం చెల్లించిన వారికీ పాలసీ వ్యవధిలో ఎప్పుడైనా మిగిలిన రిస్క్ ప్రీమియం వాల్యూ చెల్లించబడుతుంది.
3 లిమిటెడ్ పే ప్రీమియం చెల్లింపులు చేసినవారు కనీసం 3 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించబడిన షరతులకు లోబడి సరెండర్ వాల్యూ చెల్లించబడుతుంది.
అలాగే పాలసీ లాప్స్ అయినప్పటికీ పునరుద్ధరణ అయ్యే 5 సంవత్సరాల వ్యవధిలో పాలసీదారుని అభ్యర్థన మేరకు మాత్రమే సరెండర్ వాల్యూ చెల్లించ బడుతుంది . అదే పాలసీ లాప్స్ అయి 5 సంవత్సరాల పునరుద్ధరణ వ్యవధి ముగిసిన తర్వాత, పాలసీ ఆటోమేటిక్గా రద్దుచేయబడి సరెండర్ వాల్యూ పాలసీదారునికి చెల్లించబడుతుంది. పాలసీ లాప్స్ అయి పునరుద్ధరన కాలం లోపు పాలసీదారుడు మరణిస్తే మిగిలిన రిస్క్ ప్రీమియం వాల్యూ వారి కుటుంబానికి చెల్లించబడుతుంది.
లోన్ సౌకర్యం : ఈ పాలసీలో ఎటువంటి లోన్ సౌకర్యం లేద. సాధారణముగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు కేవలం జీవిత బీమా రక్షణ కోసం ఏర్పాటు చెయ్యబడ్డ పాలసీలు మాత్రమే. ఇందులో క్యాష్ వేల్యూ కానీ పొదుపు కానీ ఉండవు అందుచేత ఈ పాలసీలో ఎటువంటి లోన్ పొందే సౌకర్యం ఉండదు.
పన్ను ప్రయోజనాలు :
ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సి కింద టర్మ్ ఇన్సూరెన్స్ కోసం కట్టే ప్రీమియంలకు పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే జీవిత బీమాలో భాగంగా చెల్లించే మరణ ప్రయోజనం సెక్షన్ 10(10D) క్రింద ఎటువంటి పన్నులు లేకుండా వారి కుటుంబానికి నేరుగా చెల్లించబడుతుంది.
ఫ్రీ లుక్ పీరియడ్ :
పాలసీ కొనుగోలు చేసాక పాలసీ యొక్క ” నియమాలు మరియు షరతులు ” పట్ల పాలసీదారుడు సంతృప్తి చెందకపొతే పాలసీ డాక్యుమెంట్ ఎలక్ట్రానిక్ లేదా భౌతిక రూపంలో అందిన తేదీ నుండి 30 రోజుల్లోగా పాలసీపై అభ్యంతరాలను కారణాలను తెలియజెస్తు సంస్థకు పాలసీని రద్దు చేసుకోవచ్చు.బీమా స్వంస్థ పాలసీని రద్దు చేస్తూ కవరేజ్ కాలానికి అనుగుణంగా బేస్ ప్రీమియం మరియు వైద్య పరీక్షలు ,స్టాంప్ డ్యూటీ చార్జీలు ఇతర ప్రత్యేక నివేదిక ఖర్చులు మినహాయించుకుని మిగిలిన ప్రీమియాన్ని పాలసీదారునికి చెల్లిస్తుంది.
ఆత్మ హత్య మినహాయింపు :
(i) పాలసీదారుడు కనుక పాలసీ ప్రారంభమైన తేదీ నుండి లేదా పాలసీ పునరుద్ధరణ తేదీ నుండి 12 నెలల లోపు ఆత్మహత్య చేసుకున్నట్లయితె (మానసిక స్థితి బాగున్నా లేదా బాగా లేకపోయినా) పాలసీదారునికి ఎటువంటి జీవిత బీమా హామీని చెల్లించదు.
(ii) పాలసీదారుడు పాలసీ ప్రారంభ తేదీ లేదా పునరుద్ధరణ తేదీ నుండి 12 నెలల లోపు ఆత్మహత్య చేసుకున్నట్లయితే పాలసీ కోసం చెల్లించిన ప్రీమియంలు సింగిల్ పే పాలసీదారులకు 80% ,రెగ్యులర్ పే మరియు లిమిటెడ్ పే పాలసీదారులను 80% ప్రీమియంలు వారి కుటుంబానికి చెల్లించబడుతుంది.
గమనిక : ఈ చెల్లింపు నిబంధనలు లాప్స్ అయిన పాలసీలకు వర్తించవు.అలాగే పైన చెప్పినప్రీమియంలు అనగా టాక్సులు ఇతర ఖర్చులు ,రైడర్ ప్రీమియంలు మినహాయించుకుని అని అర్ధం.
పాలసీలోని ప్రతికూలతలు :
1- బీమా సంస్థ LIC -బ్రాండ్ పరంగా అత్యధిక విలువ ఉన్నప్పటికీ క్లెయిమ్స్ సమయంలో ఇతర బీమా సంస్థల మాదిరిగా చురుకుగా పనిచేయటం లేదని అపవాదు ఉంది.
2-ఈ పాలసీ కేవలం లైప్ కవర్ ను మాత్రమే కలిగి ఉంది. ప్రమాద మరణానానికి అదనపు మరణ ప్రయోజనం మరియు ప్రమాద కారక అంగవైకల్యం రైడర్ మరియు టర్మినల్ ఇల్ నెస్ రైడర్, క్రిటికల్ ఇల్ నెస్ రైడర్, మరియు ప్రీమియం వేవియర్ లాంటి రైడర్ లు అందుబాటులో లేకపోవటం పెద్ద లోపంగా చెప్పవచ్చు.
పాలసీ ఎక్కడ కొనుగోలు చెయ్యాలి :
ఈ పాలసీ ప్రస్తుతం ఆన్లైన్ లో కొనుగోలుకు అందుబాటులో లేదు. లైసెన్స్ పోందిన అజెంట్లు ,కార్పొరేట్ ఏజెంట్స్, బ్రోకర్స్ మరియు బీమా మార్కెటింగ్ సంస్థల నుండి ఈ పాలసీని కొనుగోలు చెయ్యవచ్చు. ఈ పాలసీని కొనుగోలు చెయ్యాల్సి ఉంటుంది. కొనుగోలుకు ముందు లైఫ్ కవర్ , కాల పరిమితి , ప్రీమియం చెల్లింపులు ,మరణ ప్రయోజనం చెల్లింపులు జాగ్రత్తగా ఎంపిక చేసుకొని ప్రపోసల్ ఫారంలో పేరు, చిరునామా, విద్యా అర్హతలు , ఉద్యోగం లేదా వృత్తి ,పుట్టిన తేదీ,జండర్ మొదలైన వివరాలు సరిగ్గా నింపి LIC’s యువ టర్మ్ – పాలసీని ఎంచుకోవాలి
ముగింపు: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా అనే బీమా సంస్థ భారత ప్రభుత్వ అధీనంలో పనిచేస్తూ దశాబ్దాలుగా భారతీయుల మన్ననలను పొందింది. ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల జీవిత బీమా సంస్థలు ఏర్పడిన ఎన్నో ఆకర్షణీయమైన పాలసీలను వివిధ ఫీచర్స్ ను తీసుకచ్చిన LIC పొందిన నమ్మకాన్ని ఇతర బీమా కంపినీలు ఇప్పటికి పొందలేక పోయాయి. LIC భారతీయ పౌరుల వివిధ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వివివిధ పాలసీలను రూపిందించింది. అందులో టర్మ్ ఇన్సురెన్సు పాలసీలు హోల్ లైఫ్ పాలసీలు,(ULIPS) యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు,ఎండోమెంట్ పాలసీలు, మనీ బ్యాక్ పాలసీలు,రిటైర్ మెంట్ /పెన్షన్ పాలసీలు , చైల్డ్ ఎడ్యుకేషన్ పాలసీలు కలవు. పాలసీదారులు వారి వ్యక్తిగత పాలసీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారి అవసరాలకు తగ్గ పాలసీని ఎంచుకొనే అన్ని రకాల పాలసీలు LIC లో కలవు.