LIC Yuva credit life term policy
స్టోరీ
LIC యువ క్రెడిట్ లైఫ్ టర్మ్ పాలసీ అనేది యువకుల కోసం కొత్తగా ప్రారంభించబడిన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది ప్రత్యేకించి గృహ రుణాలు లేదా ఇతర రుణాలు తీసుకున్న యువకులను దృష్టిలో పెట్టుకొని వారి మరణాంతరం బాకీ ఉన్న రుణాలు లేదా అప్పుల నుండి వారి కుటుంబానికి రక్షణ కల్పించడానికి ఈ పాలసీ రూపొందించబడింది.
LIC యొక్క యువ క్రెడిట్ లైఫ్ టర్మ్ ప్లాన్ అనేది నాన్ లింక్డ్ ,నాన్ పార్టిసిపేటింగ్ ,ఇండివిజువల్ ఫ్యూర్ రిస్క్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అనగా ఈ టర్మ్ ప్లాన్ అనేది ఎటువంటి లాభాలు అందించబడని కేవలం జీవిత బీమా రక్షణ కొరకు మాత్రమే ఉద్దేశించబడిన పాలసీ. ఈ ప్లాన్ ద్వారా పాలిసీదారునికి అనుకోని మరణం సంభవించిన సందర్భంలో, అతని కుటుంబానికి ఆర్థిక భద్రత అందించబడుతుంది.
పాలసీ ప్రత్యేకతలు :
1- తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ అందించే టర్మ్ పాలసీ
2- మహిళలకు ప్రత్యేక ప్రీమియం తగ్గింపు రేట్లు
3- పొగ త్రాగే వారికీ తగని వారికి వేరు వేరు ప్రీమియం రేట్లు పొగ త్రాగని వారికి ప్రత్యేక ప్రీమియం తగ్గింపు రేట్లు
4- కోటి అంతకన్నా ఎక్కువ కవరేజ్ పాలసీ తీసుకున్న వారికి 14% నుండి 37% వరకు ప్రీమియం తగ్గింపులు ఉంటాయి
5-పాలసీదారుని లోన్ చెల్లింపులకు అనుగుణంగా ఈ పాలసీలో లైఫ్ కవర్ తగ్గుతూ ఉండే లక్షణం కలదు.
పాలసీ అర్హతలు :
పాలసీ కవరేజీ పరిమితి : 50 లక్షల నుండి అపరిమితం 5 కోట్ల వరకు
వయస్సు అర్హతలు : 18 సం .. నుండి 45 సం.. రాల వరకు
ప్రీమియం చెల్లింపుల కాలం : సింగిల్ పే ,లిమిటెడ్ పే ,(5-10-15 సం..మాత్రమే అందుబాటులో ఉంది
ప్రీమియం చెల్లింపులు : అర్ధ సంవత్సరం ,సంవత్సరం
పాలసీ కాలపరిమితి : మినిమం పాలసీ టర్మ్ : 23 సం ..మాక్సిమం ; 75 సం ..
పాలసీ బెనిఫిట్స్ :
డెత్ బెనిఫిట్ :
పాలసీదారుడు దురదృష్టకరమైన సంఘటనలో అకాల మరణం చెందిన యెడల వారి నామినికి వారు ఎంచుకున్న పాలసీ కవరేజ్ ని బట్టి డెత్ బెనిఫిట్ అందించడం జరుగుతుంది.ఈ విధంగా పాలసీదారుని కుటుంబానికి లేదా నామినికి ఈ పాలసీ రక్షణ కవచంలాగా పనిచేస్తుంది.
మెచూరిటీ బెనిఫిట్స్ :
ఈ పాలసీలో ఎటువంటి మెచూరిటీ బెనిఫిట్స్ లెవ్వు. కాని పాలసీదారుడు కనుక తన అవసరాల కోసం ఎక్కడన్నా లోన్ తీసుకొనే దాన్ని ముందస్తుగానే పూర్తి చేసుకున్నట్లయితే అతనికి రెండు ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి అవి :
1 తన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని రద్దు చేసుకొని అప్పటివరకు లైఫ్ కవర్ కోసం ఎంతవరకు ప్రీమియం చెల్లించాడో దాన్ని మినహాయించి మిగతా (UNEXPIRED RISK PREMIUM VALUE ) తిరిగి చెల్లించబడుతుంది.
2 పాలసీని అలాగే కొనసాగించుకొని పాలసీ కాలంలో ఏదేని ప్రమాద కారణముగా పాలసీదారుడు మరణించినట్లయితే వారి కుటుంబానికి పాలసీ కవరేజ్ చెల్లించబడుతుంది.
డెత్ బెనిఫిట్ చెల్లింపులు : పాలసీదారుడు ఏదేని దురదృష్టకర సంఘటనలో మరణించినట్లయితే పాలసీదారుడు తీసుకున్న జీవిత బీమా అనేది ఏకకాలంలో LUMSUM గా చెల్లించబడటం జరుగుతుంది
ప్రీమియం చెల్లింపులు :
ఈ పాలసీలో కేవలం రెండు ప్రీమియం చెల్లింపు ఎంపికలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి అవి సింగిల్ పే, లిమిటెడ్ పే.లిమిటెడ్ పే చెల్లింపులు ఎంచుకున్న పాలసీదారులు ఆ ప్రీమియంలను సంవత్సరం మరియి అర్ధ సంవత్సరం వారీగా చెల్లించవచ్చు.
గ్రేస్ పీరియడ్ :
జీవిత బీమా ప్రీమియంలు సంవత్సరం,అర్ధ సంవత్సరం వారీగా చెల్లించే వారు 30 రోజుల గ్రేస్ పీరియడ్ వరకు ప్రీమియం చెల్లించకున్న పాలసీ ప్రయోజనాలు చెల్లించబడుతాయి.30 రోజుల అనంతరం కూడా ప్రీమియంలు చెల్లించనట్లయితే పాలసీ లాప్స్ అవుతుంది.దీంతో పాలసీ ప్రయోజనాలు కోల్పోతారు.
లోన్ సౌకర్యం : ఈ పాలసీలో ఎటువంటి లోన్ సౌకర్యం లేదు. సాధారణముగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు కేవలం జీవిత బీమా రక్షణ కోసం ఏర్పాటు చెయ్యబడ్డ పాలసీలు మాత్రమే. ఇందులో కాష్ వేల్యూ కానీ పొదుపు కానీ ఉండవు అందుచేత ఈ పాలసీలో ఎటువంటి లోన్ పొందే సౌకర్యం ఉండదు.
పాలసీ సరెండర్ :
1- సింగిల్ పే ప్రీమియం చెల్లించిన వారికీ పాలసీ వ్యవధిలో ఎప్పుడైనా సరెండర్ వాల్యూ చెల్లించబడుతుంది.
2- లిమిటెడ్ పే ప్రీమియం చెల్లింపులు చేసినవారు క్రింది షరతులకు లోబడి సరెండర్ వాల్యూ చెల్లించబడుతుంది.
A – లిమిటెడ్ పే లో ప్రీమియం చెల్లింపు వ్యవధి 5 సంవత్సరాలు లోపు అయితే కనీసం 2 సంవత్సరాల ప్రీమియం చెల్లించాలి
B – మరియు ప్రీమియం చెల్లింపు వ్యవధి 10 లేదా 15 సం.. అయితే కనీసం 3 సంవత్సరాల ప్రీమియం చెల్లించాలి.
అలాగే పాలసీ లాప్స్ అయినప్పటికీ పునరుద్ధరణ అయ్యే 5 సంవత్సరాల వ్యవధిలో పాలసీదారుని అభ్యర్థన మేరకు మాత్రమే సరెండర్ వాల్యూ చెల్లించ బడుతుంది . అదే పాలసీ లాప్స్ అయి 5 సంవత్సరాల పునరుద్ధరణ వ్యవధి ముగిసిన తర్వాత, పాలసీ ఆటోమేటిక్‌గా రద్దుచేయబడి సరెండర్ వాల్యూ పాలసీదారునికి చెల్లించబడుతుంది. అలాగే లాప్స్ అయిన పాలసీలో 5 సంవత్సరాల పునరుద్ధరణ కాలంలో పాలసీదారుడు మరణించినట్లయితే సరెండర్ వాల్యూ వారి కుటుంబానికి చెల్లించ బడుతుంది.
పాలసీ పునరుద్ధరణ :
లిమిటెడ్ పే ప్రీమియం చెల్లింపుదారులు లాప్స్ అయిన పాలసీని 5 సంవత్సరాల లోపు తిరిగి పునరుద్ధరణ చెయ్యవచ్చు. చెల్లించని ప్రీమియంలు కాంపౌండింగ్ వడ్డీతో సహా చెల్లించి పూర్తి ఆరోగ్యముగా ఉన్నాననే రుజువులు చూపించాల్సి ఉంటుంది. అండర్ రైటర్ షరతులకు లోబడి వారు అడిగిన సమాచారాన్ని,డాకుమెంట్స్ రిపోర్ట్స్ ఇవ్వల్సి ఉంటుంది.అప్పుడు కార్పొరేషన్ పాలసీలో మార్పులు చేర్పులు చేసి పాలసీని పునరుద్ధరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. 5 సంవత్సరాల లోపు పాలసీని పునరుద్ధరణ చేయక పోయినట్లయితే పాలసీ ఆటోమేటిక్ గా రద్దు చేయబడి సరెండర్ వాల్యూ చెల్లించబడుతుంది.
పాలసీ రద్దు :
పాలసీ జారీ చేసిన అనంతరం పాలసీ కోసం పాలసీదారుడు ఇచ్చిన సమాచారం తప్పని బీమా సంస్థ కనిపెట్టినట్లయితే ఆ పాలసీని రద్దు చేసే అధికారం బీమా సంస్థకు కలదు. పాలసీ కొనుగోలు సమయంలో వ్యక్తిగత సమాచారం కానీ తప్పుడు డాక్యుమెంట్ కానీ ఇవ్వాల్సిన సమాచారం ఇవ్వకపోవటం లేక కావాలనే దాచిపెట్టడం ,అనారోగ్య సమస్యను దాచి పెట్టడం లాంటివి చేసినట్లయితే భారతీయ బీమా చట్టం -1938 లోని సెక్షన్ 45 ప్రకారం పాలసీ రద్దు లేదా మార్పులు చెయ్యబడతాయి.
పన్ను ప్రయోజనాలు :
ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సి కింద టర్మ్ ఇన్సూరెన్స్ కోసం కట్టే ప్రీమియంలకు పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే జీవిత బీమాలో భాగంగా చెల్లించే మరణ ప్రయోజనం సెక్షన్ 10(10D) క్రింద ఎటువంటి పన్నులు లేకుండా వారి కుటుంబానికి నేరుగా చెల్లించబడుతుంది.
ఫ్రీ లుక్ పీరియడ్ :
పాలసీ కొనుగోలు చేసాక పాలసీ యొక్క ” నియమాలు మరియు షరతులు ” పట్ల పాలసీదారుడు సంతృప్తి చెందకపొతే పాలసీ డాక్యుమెంట్ ఎలక్ట్రానిక్ లేదా భౌతిక రూపంలో అందిన తేదీ నుండి 30 రోజుల్లోగా పాలసీపై అభ్యంతరాలను కారణాలను తెలియజెస్తు సంస్థకు పాలసీని రద్దు చేసుకోవచ్చు.బీమా స్వంస్థ పాలసీని రద్దు చేస్తూ కవరేజ్ కాలానికి అనుగుణంగా బేస్ ప్రీమియం మరియు రైడర్ ప్రీమియంలు మరియు వైద్య పరీక్షలు ,స్టాంప్ డ్యూటీ చార్జీలు ఇతర ప్రత్యేక నివేదిక ఖర్చులు మినహాయించుకుని మిగిలిన ప్రీమియాన్ని పాలసీదారునికి చెల్లిస్తుంది.
ఆత్మ హత్య మినహాయింపు :
(i) పాలసీదారుడు కనుక పాలసీ ప్రారంభమైన తేదీ నుండి లేదా పాలసీ పునరుద్ధరణ తేదీ నుండి 12 నెలల లోపు ఆత్మహత్య చేసుకున్నట్లయితె (మానసిక స్థితి బాగున్నా లేదా బాగా లేకపోయినా) పాలసీదారునికి ఎటువంటి జీవిత బీమా హామీని చెల్లించదు.
(ii) పాలసీదారుడు పాలసీ ప్రారంభ తేదీ లేదా పునరుద్ధరణ తేదీ నుండి 12 నెలల లోపు ఆత్మహత్య చేసుకున్నట్లయితే పాలసీ కోసం చెల్లించిన ప్రీమియంలు సింగిల్ పే పాలసీదారులకు 80% మరియు లిమిటెడ్ పే పాలసీదారులను 80% ప్రీమియంలు వారి కుటుంబానికి చెల్లించబడుతుంది.
గమనిక : ఈ చెల్లింపు నిబంధనలు లాప్స్ అయిన పాలసీలకు వర్తించవు.అలాగే పైన చెప్పినప్రీమియంలు అనగా టాక్సులు ఇతర ఖర్చులు మినహాయించుకుని అని అర్ధం.
పాలసీలోని ప్రతికూలతలు :
1-బీమా సంస్థ LIC -బ్రాండ్ పరంగా అత్యధిక విలువ ఉన్నప్పటికీ క్లెయిమ్స్ సమయంలో ఇతర బీమా సంస్థల మాదిరిగా చురుకుగా పనిచేయటం లేదని అపవాదు ఉంది.
2-ఈ పాలసీ కేవలం లైప్ కవర్ మాత్రమే కలిగి ఉంది. అదనపు ప్రమాద బీమా, ప్రమాద కారక అంగవైకల్యం రైడర్ మరియు టర్మినల్ ఇల్ నెస్ రైడర్, క్రిటికల్ ఇల్ నెస్ రైడర్, మరియు ప్రీమియం వేవియర్ లాంటి రైడర్ లు అందుబాటులో లేకపోవటం లోపంగా చెప్పవచ్చు.
3-ప్రీమియం చెల్లింపులలో రెగ్యులర్ ప్రీమియం చెల్లింపులు లేకపోవటం ఈ పాలసీలో పెద్ద లోపంగా చెప్పవచ్చు.
పాలసీ ఎక్కడ కొనుగోలు చెయ్యాలి :
ఈ పాలసీ ప్రస్తుతం ఆన్లైన్ లో కొనుగోలుకు అందుబాటులో లేదు. లైసెన్స్ పోందిన అజెంట్లు ,కార్పొరేట్ ఏజెంట్స్, బ్రోకర్స్ మరియు బీమా మార్కెటింగ్ సంస్థల నుండి ఈ పాలసీని కొనుగోలు చెయ్యవచ్చు. కొనుగోలుకు ముందు లైఫ్ కవర్ , కాల పరిమితి , ప్రీమియం చెల్లింపులు ,మరణ ప్రయోజనం చెల్లింపులు జాగ్రత్తగా ఎంపిక చేసుకొని ప్రపోసల్ ఫారంలో పేరు, చిరునామా, విద్యా అర్హతలు , ఉద్యోగం లేదా వృత్తి ,పుట్టిన తేదీ,జండర్ మొదలైన వివరాలు సరిగ్గా నింపి LIC’s యువ క్రెడిట్ లైఫ్ టర్మ్ – పాలసీని ఎంచుకోవాలి
ముగింపు: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా అనే బీమా సంస్థ భారత ప్రభుత్వ అధీనంలో పనిచేస్తూ దశాబ్దాలుగా భారతీయుల మన్ననలను పొందింది. ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల నూతన జీవిత బీమా సంస్థలు ఏర్పడిన ఎన్నో ఆకర్షణీయమైన పాలసీలను వివిధ ఫీచర్స్ ను తీసుకచ్చిన LIC పొందిన నమ్మకాన్ని ఇతర బీమా కంపినీలు ఇప్పటికి పొందలేక పోయాయి. LIC భారతీయ పౌరుల వివిధ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వివివిధ పాలసీలను రూపిందించింది. అందులో టర్మ్ ఇన్సురెన్సు పాలసీలు హోల్ లైఫ్ పాలసీలు,(ULIPS) యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు,ఎండోమెంట్ పాలసీలు, మనీ బ్యాక్ పాలసీలు,రిటైర్ మెంట్ /పెన్షన్ పాలసీలు , చైల్డ్ ఎడ్యుకేషన్ పాలసీలు కలవు. పాలసీదారులు వారి వ్యక్తిగత పాలసీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారి అవసరాలకు తగ్గ పాలసీని ఎంచుకొనే అన్ని రకాల పాలసీలు LIC లో కలవు.