Icici pru iprotect super term insurance in telugu -

Icici pru iprotect super term insurance in telugu

share

iprotect super term policy

మీ కుటుంభం కోసం మీరు అహర్నిశలు శ్రమించి మీ కుటుంభం ఆర్ధిక అవసరాలు, పిల్లల చదువులు మరియు మీ వృద్ధ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య అవసరాలు తీరుస్తూ మీ కుటుంబానికి అండగా ఉంటున్నారు. మీ  కుటుంబానికి మీరు ఎంత ముఖ్యమో  మీకు మీ కుటుంబానికి తెల్సు. మీరు ఉన్నంత వరకు మీకు మీ కుటుంబానికి ఎటువంటి లోటు రాదూ ? కానీ మీరు లేని సమయంలో మీ కుటుంభం యొక్క ఆర్ధిక అవసరాలు తీర్చడం ఎలా ? మీరు లేని లోటును భర్తీ చేసేది ఎవరు ? జీవితం అనేది అనుహ్యమైనది ఎప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుతుందో ఊహించలేం అందుకోసం మీరు ఎటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నారు? మీరు మీ కుటుంభ భద్రత కోసం  ఎటువంటి ముందస్తు ప్రణాళికలు కలిగి ఉన్నారు ? అని పరిశీలించినప్పుడు అందుకోసం మనకు ఒక టర్మ్ పాలసీ అవసరం అని మీరు గుర్తించవచ్చు. అందుకోసం ”ఐసీఐసీఐ ప్రూ ఐ ప్రొటెక్ట్ సూపర్” మీకు సరైన పాలసీగా చెప్పవచ్చు.

ఐసీఐసీఐ  బీమా సంస్థ వివరాలు  :

ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ భారతదేశంలో ప్రముఖ జీవిత బీమా సంస్థలలో ఒకటి. దీనిని 2000 వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఇది ICICI బ్యాంక్ (51%) వాటాను మరియు ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్ (49%) వాటాతో కూడిన జాయింట్ వెంచర్ కంపెనీ. ఈ కంపెనీ లో  టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు , ULIPలు, ఎండోమెంట్ ప్లాన్‌లు, మరియు రిటైర్మెంట్ ప్లాన్ల వంటి  అనేక పాలసీలు కలవు. ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ  2016లో BSE మరియు NSEలలో జాబితా చేయబడిన భారతదేశంలో మొట్టమొదటి జీవిత బీమా కంపెనీగా నిలిచింది. ఈ షేర్ మార్కెట్‌లో లిస్టింగ్‌ ద్వారా, పాలసీదారుల బలమైన నమ్మకానికి పునాదిగా చెప్పవచ్చు.

సాధారణంగా టర్మ్ పాలసీ ఎంపికకు ముందు ఆ బీమా సంస్థ యొక్క పనితీరును పరిగణలోకి తీసుకొని పాలసీ ఎంపిక చేసుకోవటం జరుగుతుంది. అందుకోసం ఏం పరిశీలించాలో ఈ క్రింద వివరించడం జరిగింది.

1) క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో (CSR ) : అనగా బీమా సంస్థ ఎన్ని క్లెయిమ్స్ ని పరిష్కరించిందో  చెప్పే నివేదిక. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఎక్కువగా ఉంటె సంస్థ విశ్వసనీయత అంత మెరుగ్గా ఉంటుందని అర్ధం. 95% శాతం లేదా అంతకన్నా ఎక్కువ సెటిల్మెంట్  రేషియో ఉన్న సంస్థను ఎంకుకోవటం మంచిది. ఐసీఐసీఐ ప్రూ లైఫ్ ఇన్సూరెన్స్ గడిచిన 5 సంవత్సరాలుగా  97.57% సగటుతో అత్యుత్తమ బీమా సంస్థగా నిలిచింది.

3) అమౌంట్ సెటిల్మెంట్ రేషియో : బీమా సంస్థలు ఎంత అమౌంట్ ని సెటిల్ చేశాయో కూడా పరిగణలోకి తీసుకోవాలి.చిన్న క్లెయిమ్స్ సెటిల్ చేసి పెద్ద క్లెయిమ్స్ రిజెక్ట్ చేసే సంస్థను ఎంపిక చేసుకోక పోవటం మంచిది. ఐసీఐసీఐ ప్రూ ఇన్సూరెన్స్ సగటున 95.49% తో మంచి సెటిల్మెంట్  రేషియోని కలిగి ఉంది.

4) కంప్లయెంట్స్ రేషియో : బీమా సంస్థకు ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయంటే ఆ సంస్థ  పనితీరు బాలేదు అన్నమాట. ప్రతి 10-వేల క్లెయిమ్స్ లో ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయో తెలియజేసే నివేదికే కంప్లైంట్స్ రేషియో అంటారు. ఐసీఐసీఐ ఐ ప్రూ  లైఫ్ ఇన్సూరెన్స్  14.3%  రేషియోతో తక్కువ కంప్లైంట్స్ ను కలిగి ఉంది.

ఐసీఐసీఐ ప్రూ ఐ ప్రొటెక్ట్ సూపర్ టర్మ్ పాలసీ :

సగటు భారతీయ పౌరులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకించి సెల్ఫ్ ఎంప్లాయిడ్  మరియు  ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్న వారి కోసం  ఈ పాలసీని రూపొందించడం జరిగింది. ఇందులో సంప్రదాయ టర్మ్ పాలసీలో లాగా  ఇతరత్రా ఆదాయ ధ్రువీకరణలు,అర్హతలు వంటి అనేక నిబంధనలు లేకుండా సాధారణ ఆదాయ మార్గాలున్నప్పటికీ  అధిక కవరేజీతో టర్మ్ పాలసీ పొందవచ్చు. ఇతర ఆదాయ మార్గాలైన మ్యూచువల్ ఫండ్స్ ,SIP లు సిబిల్ స్కోర్లు,న్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్‌మెంట్‌లు (e-CAS), సొంత కారు యొక్క IDV వాల్యూ, FD/RD లాంటి డిపాజిట్ విలువలు ఇతర ఆన్లైన్ లావాదేవీలను పరిగణలోకి తీసుకొని కూడా టర్మ్ పాలసీని ఇవ్వటం జరుగుతుంది.

పాలసీ అర్హతలు :

పాలసీ సమాచారం :

పాలసీ కవరేజీ పరిమితి : 50 లక్షల నుండి 1 కోటి వరకు

వయస్సు అర్హతలు : 18 సం .. నుండి 55 సం.. రాల వరకు

ప్రీమియం చెల్లింపుల కాలం : రెగ్యూలర్ పే ,లిమిటెడ్ పే ,5 -7 -10 -15  -60 సంవత్సరాలు

ప్రీమియం చెల్లింపులు : నెలనెల, అర్ధ సంవత్సరం ,సంవత్సరం

కనీస ఆదాయం : సంవత్సరానికి  కనీసం 3 లక్షలు

విద్యా అర్హతలు : కనీస అర్హత ఇంటర్ మీడియట్

పాలసీ కాలపరిమితి : మినిమం పాలసీ టర్మ్ : 20 సం ..మాక్సిమం ; 85 సం ..

పాలసీకి అర్హత గల వ్యక్తులు : స్వయం ఉపాధిగల వ్యక్తులు ,వ్యాపారస్తులు,వృత్తి నిపుణులు

పాలసీకి అర్హత లేని వారు : గృహిణిలు, వ్యవసాయదారులు ,విద్యార్థులుమరియు NRI లు

పాలసీ ప్రయోజనాలు :

లైఫ్ కవర్ :

జీవిత బిమయొక్క ప్రధాన ప్రయోజనమైన లైఫ్ కవరేజ్ 1 కోటి వరకు ఈ పాలసీ ద్వారా కవర్ చెయ్యబడుతువుంది. దురదృష్టకరమైన సంఘటనలో పాలసీదారుడు అకాల మరణం చెందిన యెడల వారి నామినికి వారు ఎంచుకున్న పాలసీ కవరేజ్ ని బట్టి ఏకకాలంలో అందించడం జరుగుతుంది.ఈ విధంగా ఆ కుటుంబానికి ఈ పాలసీ రక్షణ కవచంలాగా పనిచేస్తుంది.

టర్మినల్ ఇల్ నెస్ :

పాలసీదారుడు కనుక  ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్లు  నిర్ధారణ అయినట్లయితే పాలసీ హామీ ఎంత అయితే అంత  మొత్తం ప్రయోజనం ముందుగానే  ఏక మొత్తంలో చెల్లించబడుతుంది. దీనికి ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇద్దరు డాక్టర్స్ సర్టిఫైడ్ చెయ్యాల్సి ఉంటుంది. టర్మినల్ ఇల్ నెస్  బెనిఫిట్స్ చెల్లించాక పాలసీ ప్రయోజనాలు రద్దు చేయబడతాయి.

ప్రీమియం బ్రేక్ ఆప్షన్ :

పాలసీదారుడు తమ లైఫ్ కవర్ కోసం చెల్లించే ప్రీమియంలు మరియు రైడర్ చెల్లింపులు  12 నెలలు లేదా ఒక సంవత్సరం వరకు  ఆలస్యం గా చెల్లించిన పాలసీ ప్రయోజనాలు కొనసాగించబడుతాయి. ఇ లా తన పాలసీ కాలంలో ప్రతి 5 సంవత్సరాల కొకసారి ప్రీమియం బ్రేక్ ఆప్షన్ ని పొందవచ్చు.ఆ సంవత్సర ప్రీమియంలు వచ్చే సంవత్సరం ప్రీమియంతో కలిపి కట్టాల్సి ఉంటుంది.

జీరో కాస్ట్ ఆప్షన్స్ :

జీరో కాస్ట్ ఆప్షన్ లో లైఫ్ కవరేజ్ కోసం కట్టిన ప్రీమియం లన్నింటినీ తిరిగి స్పెషల్ ఎక్సిట్  బెనిఫిట్ ద్వారా తిరిగి పొందవచ్చు. ఇందుకోసం పాలసీ గడువు ముగియడానికీ ముందే పాలసీ నుండి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఆ తర్వాత లైఫ్ కవర్ తో  పాటు అన్ని ప్రయోజనాలను  కోల్పోవటం జరుగుతుంది. ఒకవేల పాలసీ కొనసాగించాలని మీరు నిర్ణయించుకుంటే మీ పాలసీ కాలం వరకు లైఫ్ కవర్ ప్రయోజనాలు కొనసాగించబడుతాయి.

డెత్ బెనిఫిట్ చెల్లింపులు :

పాలసీదారుని అకాల మరణాంతరం కుటుంభ సభ్యలు పొందే హామీ ప్రయోజనం మూడు విధాలుగా చెల్లించబడే సౌకర్యం ఉంది. ఏక మొత్తంలో లేదా మంత్లీ ఇన్కమ్ గా లేదా కొంత మొత్తం ఏక కాలంలో చెల్లించి మిగిలింది నెలనెలా ఆదాయం పొందే విధంగా లైఫ్ కవర్ మొత్తం పొందవచ్చు.

మెచూరిటీ బెనిఫిట్ :

ఈ పాలసీలో ఎటువంటి మెచూరిటీ ప్రయోజనాలు లెవ్వు.  పాలసీ వ్యవధిలో బీమా దారుడు అకాల మరణం చెందినట్లయితే వారి కుటుంబానికి బీమా కవరేజ్  అందిస్తుంది.ఒకేవేళ పాలసీదారుడు మరణించని యెడల ఈ పాలసీ ద్వారా ఎటువంటి ప్రయోజనం పొందాడు. అనగా పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం ఈ పాలసీలో ఎటువంటి ప్రయోజనాలను పొందడు.అందుకే దీన్ని ప్యూర్ టర్మ్ ప్లాన్ అంటారు.

టాక్స్ బెనిఫిట్స్ :

టర్మ్ పాలసీ  కోసం చెల్లించే ప్రీమియంలకు మరియు క్లెయిమ్ సమయంలో వచ్చే లైఫ్ కవర్ ప్రయోజనాలకు పన్ను మినహాయింపు ఉంటుంది. బేస్ ప్లాన్ కోసం చెల్లించే ప్రీమియంలకు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80 (C ) కింద సంవత్సరానికి 1.5 లక్షలు వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే క్రిటికల్ ఇల్ నెస్ కోసం చెల్లించే ప్రీమియంలు సెక్షన్ 80 D కింద పన్ను మినహాయింపు  అలాగే మెచూరిటీ సమయంలో వచ్చే ఆదాయంలో సెక్షన్ 10(10D ) కింద  పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది.

ఆక్సిడెంటల్ డెత్ రైడర్ :

ఈ ఆప్షన్ ని ఐసీఐసీఐ ప్రూ- నాన్ -లింక్డ్  ఆక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ అని మరియు ”లైఫ్ అష్షుర్డ్ ” అని కూడా పిలుస్తారు. పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో ఈ రైడర్ ద్వారా బేస్ కవరేజీకి సమానంగా అదనంగా లైఫ్ కవర్ బెనిఫిట్ అందించబడుతుంది.ఉదాహరణకు లైఫ్ కవరేజ్ కోటి రూపాయలు అనుకుంటే ఈ A.D.B ర రైడర్ ద్వారా ఇంకో కోటి అనగా మొత్తం రెండు కోట్ల రూపాయలు ఈ పాలసీ ద్వారా పాలసీదారుని కుటుంబానికి ఏక మొత్తంలో అందించడం జరుగుతుంది.

ఆక్సిడెంటల్ డిసబులిటీ :

ఈ రైడర్ ని ఎంచుకోవటం వలన ఏదేని ప్రమాద కారణంగా  శాశ్వత అంగ వైకల్యం ,శాశ్వత పాక్షిక అంగవైకల్యం ,తాత్కాలిక మొత్తం వైకల్యం ఏర్పడిన సందర్భంలో పాలసీ బేస్ కవరేజికి సమానంగా అంటే ఉదాహరణకు లైఫ్ కవరేజ్ కోటి రూపాయలు అనుకుంటే ఈ డెసెబిలిటీ  రైడర్ ద్వారా ఇంకో కోటి అనగా మొత్తం రెండు కోట్ల రూపాయలు ఈ పాలసీ ద్వారా పాలసీదారునికి  నేరుగా ఏక మొత్తంలో అందించడం జరుగుతుంది. అనంతరం  పాలసీ మొత్తం రద్దు చేయబడుతుందఈ పాలసీలో ప్రీమియం వేవియర్,క్రిటికల్ ఇల్ నెస్ , లాంటి రైడర్ లు లేకపోవటం ఈ పాలసీలోని లోపంగా చెప్పవచ్చు.

ఫ్రీ లుక్ పీరియడ్ :

అనగా పాలసీ డాక్యుమెంట్ జారీ అయి పాలసీదారుడు పొందిన తర్వాత ఆ తేదీ నుండి 30 రోజుల వరకు ఆ పాలసీని రద్దు చేసుకొనే హక్కు పాలసీదారునికి కలదు.దీనినే ఫ్రీ లుక్ పీరియడ్ అంటారు. పాలసీదారుడు పాలసీ యొక్క నియమ నిబంధనలు పరిశీలించి తనకు నచ్చాక పోయినట్లయితే పాలసీని రద్దు చేసుకోవచ్చు. అలాగే తప్పుడు పాలసీని అంటగట్టిన ఏజెంట్స్ లేదా ఇతర సంస్థల నుండి పాలసీ రద్దు కోసం ఈ ఫ్రీ లుక్ పీరియడ్ ఎంతగానో ఉపాయపగపడుతుంది.

గ్రేస్ పీరియడ్ :

జీవిత బీమా  ప్రీమియంలు సంవత్సరం,అర్ధ సంవత్సరం వారీగా చెల్లించే వారు 30 రోజుల గ్రేస్ పీరియడ్ వరకు ప్రీమియం చెల్లించకున్న పాలసీ ప్రయోజనాలు చెల్లించబడుతాయి.30 రోజుల అనంతరం కూడా ప్రీమియంలు చెల్లించనట్లయితే పాలసీ లాప్స్ అవుతుంది.దీంతో పాలసీ ప్రయోజనాలు కోల్పోతారు.

పాలసీ రద్దు : 

పాలసీ జారీ చేసిన అనంతరం పాలసీ కోసం పాలసీదారుడు ఇచ్చిన సమాచారం తప్పని బీమా సంస్థ కనిపెట్టినట్లయితే ఆ పాలసీని రద్దు చేసే అధికారం బీమా సంస్థకు కలదు. పాలసీ కొనుగోలు సమయంలో వ్యక్తిగత సమాచారం కానీ తప్పుడు డాక్యుమెంట్ కానీ ఇవ్వాల్సిన సమాచారం ఇవ్వకపోవటం లేక కావాలనే దాచిపెట్టడం ,అనారోగ్య సమస్యను దాచి పెట్టడం లాంటివి చేసినట్లయితే భారతీయ బీమా చట్టం -1938 లోని సెక్షన్ 45 ప్రకారం పాలసీ రద్దు లేదా మార్పులు చెయ్యబడతాయి.

లోన్ సౌకర్యం : ఈ పాలసీలో ఎటువంటి లోన్ సౌకర్యం లేదు.సాధారణముగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు కేవలం జీవిత బీమా రక్షణ కోసం ఏర్పాటు చెయ్యబడ్డ పాలసీలు మాత్రమే. ఇందులో కాష్ వేల్యూ కానీ పొదుపు కానీ ఉండవు అందుచేత ఈ పాలసీలో  ఎటువంటి లోన్ పొందే సౌకర్యం ఉండదు.

గమనిక : పాలసీ జారీ చేసేముందు తప్పనిసరి మెడికల్  టెస్ట్ ల చెయ్యడం జరుగుతుంది. ఈ మెడికల్ టెస్ట్ ల అనంతరం పాలసీ జారీ చెయ్యబడుతుంది

ముగింపు : టర్మ్ పాలసీ జారీ కోసం ఎదురయ్యే అనేక నిబంధనలకు షరతులకు పరిష్కారంగా ఈ పాలసీని సులువుగా పొందవచ్చు.ITR’S  వంటి ఆదాయ ద్రువీకరణలు లేకపోయినప్పటికీ టర్మ్ పాలసీ తీసుకోవానుకొనే వ్యాపారస్తులకు ఈ పాలసీ ఎంతో ఉపయోగపడుతుంది.

 

share

Leave a Comment