జీవిత బీమా అనేది పాలసీదారుని మరణ అనంతరం వారి కుటుంబానికి చెల్లించబడే ఆర్ధిక పరమైన ప్రయోజనం.అందుకోసం పాలసీదారుడు బ్రతికి ఉన్నప్పుడే ఉత్తమమైన పాలసీతో పాటే ఉత్తమమైన బీమా సంస్థను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.అందుకోసం ”ఐసీఐసీఐ ప్రూ ఐ ప్రొటెక్ట్ స్మార్ట్ టర్మ్ పాలసీ” పాలసీదారుల అవసరాలు తీర్చడం కోసం వివిధ రైడర్ లతో పాటు తక్కువ బడ్జెట్ లో ఈ పాలసీ అందుబాటులో ఉంది.
ఐసీఐసీఐ బీమా సంస్థ వివరాలు :
ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ భారతదేశంలో ప్రముఖ జీవిత బీమా సంస్థలలో ఒకటి. దీనిని 2000 వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఇది ICICI బ్యాంక్ (51%) వాటాను మరియు ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్ (49%) వాటాతో కూడిన జాయింట్ వెంచర్ కంపెనీ. ఈ కంపెనీ లో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు , ULIPలు, ఎండోమెంట్ ప్లాన్‌లు, మరియు రిటైర్మెంట్ ప్లాన్ల వంటి అనేక పాలసీలు కలవు. ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 2016లో BSE మరియు NSEలలో జాబితా చేయబడిన భారతదేశంలో మొట్టమొదటి జీవిత బీమా కంపెనీగా నిలిచింది. ఈ షేర్ మార్కెట్‌లో లిస్టింగ్ ద్వారా, పాలసీదారుల బలమైన నమ్మకానికి పునాదిగా చెప్పవచ్చు.
సాధారణంగా టర్మ్ పాలసీ ఎంపికకు ముందు ఆ బీమా సంస్థ యొక్క పనితీరును పరిగణలోకి తీసుకొని పాలసీ ఎంపిక చేసుకోవటం జరుగుతుంది. అందుకోసం ఏం పరిశీలించాలో ఈ క్రింద వివరించడం జరిగింది.
1) క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో (CSR ) : అనగా బీమా సంస్థ ఎన్ని క్లెయిమ్స్ ని పరిష్కరించిందో చెప్పే నివేదిక. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఎక్కువగా ఉంటె సంస్థ విశ్వసనీయత అంత మెరుగ్గా ఉంటుందని అర్ధం. 95% శాతం లేదా అంతకన్నా ఎక్కువ సెటిల్మెంట్ రేషియో ఉన్న సంస్థను ఎంకుకోవటం మంచిది. ఐసీఐసీఐ ప్రూ లైఫ్ ఇన్సూరెన్స్ గడిచిన 5 సంవత్సరాలుగా 97.57% సగటుతో అత్యుత్తమ బీమా సంస్థగా నిలిచింది.
3) అమౌంట్ సెటిల్మెంట్ రేషియో : బీమా సంస్థలు ఎంత అమౌంట్ ని సెటిల్ చేశాయో కూడా పరిగణలోకి తీసుకోవాలి.చిన్న క్లెయిమ్స్ సెటిల్ చేసి పెద్ద క్లెయిమ్స్ రిజెక్ట్ చేసే సంస్థను ఎంపిక చేసుకోక పోవటం మంచిది. ఐసీఐసీఐ ప్రూ ఇన్సూరెన్స్ సగటున 95.49% తో మంచి సెటిల్మెంట్ రేషియోని కలిగి ఉంది.
4) కంప్లయెంట్స్ రేషియో : బీమా సంస్థకు ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయంటే ఆ సంస్థ పనితీరు బాలేదు అన్నమాట. ప్రతి 10-వేల క్లెయిమ్స్ లో ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయో తెలియజేసే నివేదికే కంప్లైంట్స్ రేషియో అంటారు. ఐసీఐసీఐ ఐ ప్రూ లైఫ్ ఇన్సూరెన్స్ 14.3% రేషియోతో తక్కువ కంప్లైంట్స్ ను కలిగి ఉంది.
ఐసీఐసీఐ ఐ ప్రొటెక్ట్ స్మార్ట్ పాలసీ వివరాలు :
ఈ పాలసీని ”I PROTECT SMART ” టర్మ్ పాలసీ అని పిలుస్తారు. ఈ టర్మ్ పాలసీ నాన్ – లింక్డ్ , నాన్ – పార్టిసిపేటివ్ ఇండివిజువల్ ప్యూర్ రిస్క్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ పాలసీ 99 సంవత్సరాల వరకు కూడా కవరేజ్ ని ఎంచుకోవచ్చు. ఈ పాలసీలో 4 రకాల వేరియంట్స్ కలవు. వీటిలో పాలసీదారులు యొక్క అవసరాలను బట్టి వివిధ ఆప్షన్స్ ని ఎంపిక చేసుకొనే అవకాశం కలదు.
1-Life Option :
మరణ ప్రయోజనం,
టెర్మినల్ ఇల్ నెస్
శాశ్వత అంగ వైకల్యంపై ప్రీమియం మినహాయింపు
ఈ లైఫ్ కవర్ ఆప్షన్ లో లైఫ్ కవరేజ్ తో పాటు టర్మినల్ ఇల్ నెస్ బెనిఫిట్స్ ప్రయోజనం కలదు. పాలసీలో బేసిక్ పాలసీగా దీన్ని చెప్పవచ్చు. పాలసీ ప్రకారం మరణం సంభవించిన పాలసీదారునికి డెత్ బెనిఫిట్స్ చెల్లించ బడుతుంది.అలాగే ఏదేని వ్యాధి కారణంగా 6 నెలల్లోపాలసీదారునికి మరణం సంభవించు వ్యాధి నిర్ధారణ అయితే డెత్ బెనిఫిట్ ముందుగానే చెల్లిచ బడుతుంది. అనంతరం పాలసీ రద్దు చేయబడుతుంది.అలాగే ఈ పాలసీలో ఏదేని ప్రమాద కారణంగా అంగ వైకల్యం ఏర్పడితే లైఫ్ కవర్ కోసం కట్టే ప్రీమియంలు మాఫీ చెయ్యబడతాయి.పాలసీ మనుగడలో ఉండి లైఫ్ కవర్ కంటిన్యూ అవుతుంది.
2-Life Plus Option :
డెత్ బెనిఫిట్
టెర్మినల్ ఇల్నెస్ ప్రయోజనం
శాశ్వత అంగ వైకల్యంపై ప్రీమియం మినహాయింపు
ప్రమాద కారణంగా అదనపు మరణ ప్రయోజనం (ADB)
లైఫ్ కవరేజ్ తో పాటు ప్రమాద కారణముగా పాలసీదారుడు కనుక మరణించినట్లయితే యాక్సిడెంటల్ డెత్ రైడర్ ద్వారా అదనంగా కవరేజ్ చెల్లించ బడుతుంది. ఈ ప్రమాద కారణంగా పొందే మరణ ప్రయోజనం ఏక మొత్తంలో చెల్లించ బడుతుంది.తక్కువ అదనపు ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ ఈ రైడర్ ద్వారా పొందవచ్చు.టర్మినల్ ఇల్ నెస్ మరియు ప్రమాద కారణంగా అంగవైకల్యం ఏర్పడితే ప్రీమియం వేవియర్ ప్రయోజనం లాంటి బెనిఫిట్స్ కలవు.
3-Life and Health Option :
మరణ ప్రయోజనం
యాక్సిలరేటెడ్ క్రిటికల్ ఇల్నెస్
టెర్మినల్ ఇల్నెస్ ప్రయోజనం
శాశ్వత వైకల్యం పై ప్రీమియం మినహాయింపు
లైఫ్ కవర్ తో పాటు టర్మినల్ ఇల్ నెస్ మరియు క్రిటికల్ ఇల్ నెస్ ప్రయోజనాలు ఈ ఆప్షన్ లో కలవు. ఈ క్రిటికల్ ఇల్ నెస్ ప్రయోజనం ద్వారా 34 వ్యాధులకు సంబంధించిన ఏ అనారోగ్య సమస్య వచ్చిన ఆసుపత్రి ఖర్చులతో సంభంధం లేకుండా ఒకేసారి చెల్లించి వారి కుటుంబానికి భారం కాకూండా ఈ పాలసీ కాపాడుతుంది. ఈ రైడర్ ద్వారా పొందే ఆర్ధిక ప్రయోజనం లైఫ్ కవరేజ్ లో నుండి చెల్లించబడుతుంది. అంతేకానీ ఇది అదనంగా చెల్లించే ప్రయోజనం కాదు.ఈ రైడర్ ద్వారా చెల్లించిన మేరకు లైఫ్ కవరేజ్ తగ్గించబడుతుంది.యాంజియో ప్లాస్టికి ఈ రైడర్ ద్వారా గరిష్టంగా 5 లక్షలు మాత్రమే చెల్లించే క్యాపింగ్ ఉంది. అలాగే ఈ పాలసీలో టర్మినల్ ఇల్ నెస్ మరియు ప్రమాద కారణంగా అంగవైకల్యం ఏర్పడితే ప్రీమియం వేవియర్ బెనిఫిట్స్ కూడా కలవు.
4-All in one :
డెత్ బెనిఫిట్
టెర్మినల్ ఇల్నెస్
శాశ్వత వైకల్యంఫై ప్రీమియం మినహాయింపు
ప్రమాద కారణముగా అదనపు మరణ ప్రయోజనం (ADB)
యాక్సిలరేటెడ్ క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్
లైఫ్ కవర్ ,టర్మినల్ బెనిఫిట్స్ , యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్స్ , క్రిటికల్ ఇల్ నెస్ , వేవియర్ ప్రీమియం లాంటి అన్ని ప్రయోజనాలు ఈ ఆప్షనల్ పాలసీలో కలవు అందుకే ఈ పాలసీని అల్ ఇన్ వన్ పాలసీగా చెప్పవచ్చు.
పాలసీ అర్హతలు :
పాలసీ కవరేజీ పరిమితి : 50 లక్షల నుండి అపరిమితం
యాక్సిడెంటల్ డెత్ కవరేజ్ : 1 లక్ష నుండి బేస్ లైఫ్ కవరేజ్ వరకు
క్రిటికల్ ఇల్ నెస్ కవరేజ్ : 1 లక్ష నుండి బేస్ లైఫ్ కవరేజ్ వరకు
వయస్సు అర్హతలు : 18 సం .. నుండి 65 సం.. రాల వరకు
ప్రీమియం చెల్లింపుల కాలం : రెగ్యూలర్ పే ,( లిమిటెడ్ పే ,5 -7 -10 -15 -60 సంవత్సరాలు )
ప్రీమియం చెల్లింపులు : నెలనెల, అర్ధ సంవత్సరం ,సంవత్సరం
కనీస ఆదాయం : సంవత్సరానికి కనీసం 3 లక్షలు
విద్యా అర్హతలు : కనీస అర్హత ఇంటర్ మీడియట్
పాలసీ ప్రయోజనాలు :
డెత్ బెనిఫిట్ :
టర్మ్ ఇన్సూరెన్స్‌లో ప్రధానమైనది మరణ ప్రయోజనం. పాలసీదారుడు పాలసీ కాలంలో ఏదేని దురదృష్ట కారణముగా మరణించినట్లయితే , వారి కుటుంబానికి లేదా నామినికి నేరుగా బీమా కంపెనీ జీవిత బీమా చెల్లిస్తుంది. ఇది పాలసీదారుడు పాలసీ కొనుగోలులో ఎంచుకున్న మొత్తం చేస్లలిస్తుంది. సహజ మరణం అయినను లేదా ప్రమాదం వల్ల మరణం సంభవించిన హామీ మొత్తాన్ని చెల్లిస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కుటుంభ పెద్ద అకాల మరణ సమయంలో వారి కుటుంబానికి అండగా నిలుస్తుంది.
యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్:
ఈ రైడర్ అనేది పాలసీదారుడు ప్రమాదం కారణంగా మరణించినప్పుడు, బేస్ కవర్‌కు అదనంగా ఒక చెల్లించే ఆర్ధిక ప్రయోజనం. ఈ రైడర్ కోసం అదనంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.ఈ రైడర్ లైఫ్ ప్లస్, మరియు ఆల్-ఇన్-వన్ వేరియంట్లతో అందుబాటులో అందుబాటులో ఉంది. ప్రమాదం జరిగిన 180 రోజుల్లో పాలసీదారుడు మరణించిన ఈ ప్రయోజనం చెల్లించబడుతుంది. ఈ రైడర్ ద్వారా గరిష్టంగా ₹2 కోట్ల వరకూ కవరేజ్ ని ఎంచుకోవచ్చు.
టర్మినల్ ఇల్ నెస్ :
పాలసీదారుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ఆరు నెలల్లో మరణం సంభవించవచ్చు అని నిర్ధారణ అయినపుడు లైఫ్ కవరేజ్ ఎంత ఉంటె అంత ముందుగానే చెల్లించబడుతుంది. టర్మినల్ ఇల్ నెస్ బెనిఫిట్ అనేది పాలసీ కవరేజ్ లో భాగంగా చెల్లించబడే ప్రయోజనం మాత్రమే. ఇది అన్ని వేరియంట్స్ లో డిఫాల్ట్ గా అందుబాటులో ఉంది.
క్రిటికల్ ఇల్ నెస్ :
గుండె జబ్బులు ,కాన్సర్ శరీర అవయవాలు దెబ్బతినటం లాంటి తీవ్రమైన లేదా ప్రాణాంతకర వ్యాధుల నుండి ఈ రైడర్ ద్వారా ఆర్ధిక ప్రయోజనం పొందవచ్చు. ఈ రైడర్ ద్వారా 34 రకాల వ్యాధులను కవర్ చేస్తాయి. పాలసీ అమలులో ఉండి మీరు క్రిటికల్ ఇల్ నెస్ కు గురైతే హామీ మేరకు ఒకేసారి చెల్లిస్తుంది. అనంతరం ఈ రైడర్ ప్రయోజనం ముగుస్తుంది ఈ బెనిఫిట్ అనేది అదనంగా పొందే ప్రయోజనం కాదు. డెత్ బెనిఫిట్ లో నుండే ముందుగానే పొందే ప్రయోజనంగా చెప్పవచ్చు. 1 కోటి వరకు క్రిటికల్ ఇల్ నెస్ కవరేజ్ ని ఎంచుకొనే వీలుంది.
డెత్ బెనిఫిట్ పే అవుట్ ఆప్షన్ :
పాలసీదారుని అకాల మరణాంతరం కుటుంభ సభ్యలు పొందే హామీ ప్రయోజనం 4 విధాలుగా చెల్లించబడే సౌకర్యం ఉంది. ఏక మొత్తంలో లేదా మంత్లీ ఇన్కమ్ గా లేదా కొంత మొత్తం ఏక కాలంలో చెల్లించి మిగిలింది నెలనెలా ఆదాయం పొందే విధంగా మరియు ప్రతి సంవత్సరం 10% పెరుగుతూ చెల్లించబడెలా లైఫ్ కవర్ మొత్తం పొందవచ్చు.
లైఫ్ స్టేజ్ ప్రొటెక్షన్ :
జీవిత అవసరాలు ,బాధ్యతలకు తగ్గ పాలసీ కవరేజ్ ని పెంచుకొనే సౌకర్యం ఈ పాలసీలో కలదు. వివాహం అనంతర జీవిత భాగస్వామి ఆధారపడి ఉండటం చేత కవరేజ్ పెంచుకొనే అవకాశం ఉంటుంది.ఇది గరిష్టంగా పాలసీ కవరేజ్ లో 50% మేరకు,అలాగే పిల్లలు పుట్టిన అనంతరం ప్రతి పిల్లవాడికి 25% మేరకు కవరేజ్ ని ఇద్దరి పిల్లల వరకు 50% మేరకు పెంచుకొనే అవకాశం ఉంది.పెరిగిన కవరేజ్ కి తగ్గ ప్రీమియంను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.ఈ విధంగా లైఫ్ కవరేజ్ పెంచుకోవాడానికి ఎటువంటి ఆరోగ్య పరీక్షలు అవసరం లేదు.
స్మార్ట్ ఎగ్జిట్ బెనిఫిట్ :
పాలసీ కోసం చెల్లించిన ప్రీమియంలన్నింటినీ ఈ ఎంపిక ద్వారా తిరిగి పొందవచ్చు.అందుకోసం పాలసీ అమల్లో ఉంటూనే 25 సంవత్సరాల పాలసీ కవరేజ్ పూర్తి చేసుకోవాలి. ఇందులో కేవలం జీవిత బీమా కవరేజ్ కోసం చెల్లించిన ప్రీమియంలు మాత్రమే తిరిగి పొందవచ్చు కానీ రైడర్ కోసం చెల్లించిన ప్రీమియంలు పొందలేము. ఈ బెనిఫిట్ ద్వారా ప్రీమియంలు తిరిగి పొందక పాలసీ రద్దు చెయ్యబడుతుంది.ఈ బెనిఫిట్ పాలసీ చివరి 5 సంవత్సరాలలో పొందే అవకాశం లేదు.ఇందుకోసం 60 లక్షలు కవరేజ్ లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి.అలాగే లైఫ్ స్టేజ్ బెనిఫిట్ ద్వారా పెరిగిన ప్రీమియంలు ల కూడా చెల్లించబడుతాయి.
ప్రీమియం చెల్లింపులు : పాలసీదారుని యొక్క అవసరాలు ఆర్ధిక వెసులుబాటుతో ప్రీమియం చెల్లింపులు ఈ క్రింది విధముగా చెల్లించే సదుపాయం కలదు
- రెగ్యులర్ పే: పాలసీ కాలంలో ప్రతి సంవత్సరం లేదా నెలవారీగా ప్రీమియంలు చెల్లించవచ్చు.
- పరిమిత చెల్లింపు: పరిమిత కాలం లోపు ప్రీమియంలన్నీ చెల్లించి భవిషత్లో ధీమాగా ఉండవచ్చు
- సింగిల్ పే: ఒకేసారి ప్రీమియంలన్నింటిని చెల్లించే సదుపాయం కూడా ఉంది.
ఈ విధానాలు మీ ఆర్థిక లక్ష్యాలు, ఆదాయ ప్రవాహం ఆధారంగా మీకు సరిపోయేలా ఎంపిక చేసుకోవచ్చు.
టాక్స్ బెనిఫిట్స్ :
టర్మ్ పాలసీ కోసం చెల్లించే ప్రీమియంలకు మరియు క్లెయిమ్ సమయంలో వచ్చే లైఫ్ కవర్ ప్రయోజనాలకు పన్ను మినహాయింపు ఉంటుంది. బేస్ ప్లాన్ కోసం చెల్లించే ప్రీమియంలకు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80 (C ) కింద సంవత్సరానికి 1.5 లక్షలు వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే క్రిటికల్ ఇల్ నెస్ కోసం చెల్లించే ప్రీమియంలు సెక్షన్ 80 D కింద పన్ను మినహాయింపు అలాగే మెచూరిటీ సమయంలో వచ్చే ఆదాయంలో సెక్షన్ 10(10D ) కింద పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది.
ప్రీమియం మిమహాయింపు:
శాశ్వత అంగవైకల్యం ఏర్పడినట్లయితే లైఫ్ కవరేజ్ కోసమే కట్టే ప్రీమియంలు అన్ని మాఫీ చెయ్యబడతాయి.ఈ ప్రయోజనం అన్ని వేరియంట్స్ లో కలదు. భవిషత్ ప్రీమియంలు అన్ని మాఫీ చెయ్యబడ్డ లైఫ్ కవరేజ్ కంటిన్యూ చెయ్యబడుతుంది. ప్రీమియం మాఫీ చెయ్యబడాలంటే అంగ వైకల్యం కనీసం 180 రోజులు వరకు ఉండాలి అలాగే బీమా కంపెనీ ద్వారా నియమించబడిన వైద్యుడిచే శాశ్వతమగా అంగ వైకల్యం ఉన్నట్లుగా ద్రువీకరించబడాలి.
ముగింపు :
మహిళల ఆయుర్ధాయం ఎక్కువ కావున ప్రతేకించి మహిళలకు మరియు ధూమపానం చెయ్యని వారికీ తక్కువ ప్రీమియంతో పాలసీలు అందుబాటులో ఉన్నాయి. పాలసీలో ఎన్నో రైడర్లు ఉన్నప్పటికీ అంగవైకల్యం ఏర్పడితే ప్రీమియం వేవియర్ తప్ప పాలసీదారునికి ఎటువంటి ఆర్ధిక ప్రయోజనం లేకపోవటం ఈ పాలసీలో ఉన్న లోపంగా చెప్పవచ్చు.అలాగే క్రిటికల్ ఇల్ నెస్ ఏర్పడితే ఎటువంటి ఆర్ధిక ప్రయోజనం లేదు అలాగే ప్రీమియం మాఫీ కూడా లేదు