మంచి ఆరోగ్య బీమా ఎంచుకునే ముందు పరిశీలించాల్సిన అంశాలు? -

మంచి ఆరోగ్య బీమా ఎంచుకునే ముందు పరిశీలించాల్సిన అంశాలు?

share

పరిచయం:

రాము -మహేష్ అనే వ్యక్తులు కిడ్నీ స్టోన్స్ ఆపరేషన్ చేసుకొని అబ్సర్వేషన్ రూంలో పరిచయం చేసుకొని తమకు కిడ్నీ స్టోన్స్ ఎందుకు వచ్చింధో ఒకరికొకరు చెప్పుకుంటున్నారు? దేవుడి దయతో రూపాయి ఖర్చులేకుండా ఆరోగ్య బీమాతో కిడ్నీ సమస్య నుండి బయటపడ్డాను అని  అని రాము చెప్పగా? అదేంటి రాము నాకు ఆరోగ్య బీమా ఉన్నాకూడా 20 వేలు రూపాయలు ఆసుపత్రీ వాళ్ళు  కట్టమంటున్నారు అని మహేష్ వాపోయాడు? అవునా అని ఇద్దరు ఒకరి పాలసీ డాక్యుమెంట్ ఒకరు చూసుకొని అందులో ఉన్న తేడాను తెల్సుకొని మహేష్ చేసిన తప్పు ఏంటో అర్ధం చేసుకున్నాడు

ఈ రాము-మహేష్ ఇద్దరి స్టోరీలో ఇద్దరికి ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ రాముది ఎటువంటి కో పేమెంట్ లేని పాలసీ అయితే మహేష్ ది 20% కో పేమెంట్ తో కూడిన పాలసీ అందుచేత, మహేష్ వైద్య ఖర్చులలో 20% తన జేబులో నుండి కట్టాల్సి వచ్చింది. ఈ విధముగా చాలా మంది తెల్సో తెలియకో ఆరోగ్య బీమా ఉన్న సరైన పాలసీ ఎంచులోక ఆర్ధికంగా నష్టపోతున్నారు.అందుచేత ఆరోగ్య బీమా ఎంచుకొనే ముందు ఏమేం పరిశీలించాలో ఇక్కడ వివరించడం జరిగింది.

ఆరోగ్య బీమా ఎంచుకునే ముందు చాలా మంది చేసే తప్పేంటంటే స్నేహితులు చెప్పారనో,లేదా పలనా బీమా సంస్థ  మంచిదని ఆ కంపిని పాలసీని ఎంచుకొని ఆ తర్వాత క్లెయిమ్ చేసే సమయంలో తప్పు చేశామని గ్రహిస్తున్నారు. అందుకే ఆరోగ్య బీమా ఎంచుకొనే ముందు 2 విషయాలను పరిగణలోకి తీసుకోని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.అవి 1 ఆరోగ్య బీమా సంస్థ , 2 అదే బీమా సంస్థలో ఒక మంచి ప్లాన్. అంటే బీమా సంస్థ వేరు,  ప్లాన్ వేరు అని అర్ధం.ఒక మంచి బీమా సంస్థలో  ఒక మంచి ప్లాన్ ఉండకపోవచ్చు,ఒక మంచి ప్లాన్ అయ్యుండి మంచి బీమా కంపెనీ అయ్యుండక పోవచ్చు. అందుచేత మనం ఎంచుకొనే బీమా సంస్థ మరియు ప్లాన్ రకం రెండు నాణానికి ఉండే బొమ్మ బొడూసు లాగా అన్నమాట? అందుకే ఒక మంచి బీమా సంస్థలో ఉంచేందాల్సి లక్షణాలు ఏంటి అలాగే ఒక మంచి ప్లాన్ లో ఉండాల్సిన లక్షణాలు ఏంటో వివరంగా తెల్సుకుందాం.

ఒక మంచి ఆరోగ్య బీమా సంస్థ లేదా కంపెనీని ఎంచుకునే ముందు పరిశీలించాల్సిన అంశాలు..?

ఒక హెల్త్ పాలసీ ఫీచర్స్ పాలసీ డాక్యుమెంట్  పేపర్ ఫై అద్భుతంగా వ్రాసి పెట్టుకున్నప్పటికీ ఆచరణలో దాని అసలు పనితీరును అంచనా వెయ్యలేం. అందుకోసం  ఒక మంచి పాలసీ ఎంపికలో పాలసీ ఫీచర్స్ తో పాటు కంపనీ పనితీరును కూడా అంచనా వెయ్యాలంటే వీటిని పరిగణలోకి తీసుకోవాలి.అవి-

1- బీమా సంస్థ ట్రాక్ రికార్డ్ : అనగా బీమా సంస్థ  ఎప్పుడు ఏర్పాటు చెయ్యబడింది,ఎన్ని పాలసీలు అమ్ముతుంది అమ్మకంలో ఎటువంటి పురోగతి ఉంది ప్రీమియం రూపంలో ఎంత వాసులు చేస్తుంది. ఎంత ఖర్చు పెడుతుంది.ఎంత మిగిలి ఉంది లాంటి విషయాలను పరిషించాల్సి ఉంటుంది. అప్పుడే వచ్చిన కొత్త బీమా సంస్థ కన్నా కనీసం 10 సంవత్సరాలు అనుభవం ఉన్న సంస్థను ఎంచుకోవటం ఉత్తమం.

2- నెట్ వర్క్ హాస్పిటల్స్ :  బీమా సంస్థ ఎన్ని ఆసుపత్రులలో తన పాలసీ చెల్లుబాటు అవుతుందో ఆ ఆసుపత్రుల సంఖ్యనే నెట్వర్క్ హాస్పిటల్స్ అంటారు. ఇది సంస్థ యొక్క పనితీరును తెలియజేస్తుంది.ఎన్ని ఆసుపత్రులతో భాగస్వామ్యం ఉంటె అంత మంచిది. సుమారుగా 10000 వేల ఆసుపత్రులతో అనుసంధానం అయినా బీమా సంస్థను ఎంచుకోవటం మంచిది. ఒకవేల బీమా సంస్థతో భాగస్వామ్యం లేని ఆసుపత్రిలో వైద్యం చేసుకుంటే తక్షణం నగదు చెల్లించి తర్వాత రీయింబర్సు మెంట్ ద్వారా వైద్య బిల్లులను తిరిగి పాలసీదారుడు పొందవచ్చు. ఇది వ్యయ ప్రయాసలతో కూడుకున్నది అందుకోసం కనీసం 10000 – వేలకు మించిన నెట్ వర్క్ ఆసుపత్రులు ఉన్న సంస్థను ఎంచుకోవటం ఉత్తమం.

3- క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో : అనగా బీమా సంస్థకు ఒక సంవత్సర కాలంలో పాలసీదారుల నుండి ఎన్ని  క్లెయిమ్స్ వచ్చినవి ఎన్ని పరిష్కరించింనవో  తెలియజేసే నివేదికె క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటారు. బీమా సంస్థకు ఒక సంవత్సర కాలంలో వేల సంఖ్యలో క్లెయిమ్స్ వస్తుంటాయి.అందులో] 90% నికి పైగా క్లెయిమ్స్ సెటిల్ చేస్తున్న  బీమా సంస్థను ఎంచుకోవటం ఉత్తమం .IRDAI ప్రతి సంవత్సరం ప్రతి బీమా సంస్థ యొక్క  పనితీరును మరియు క్లెయిమ్స్ సంఖ్యను  తన నివేదికలో ప్రకటిస్తుంది.

4- సాల్వెన్సీ రేషియో : ఇది బీమా సంస్థ యొక్క ఆర్ధిక సామర్ధ్యాన్ని తెలియ జేస్తుంది. సాల్వెన్సీ రేషియో ఎక్కువ ఉంటె ఆ బీమా సంస్థకు వచ్చిన ప్రతి క్లెయిమ్ ను ఇవ్వటానికి వెనక్కు తగ్గదు. IRDAI  రూల్స్ ప్రకారం ప్రతి సంస్థ కచ్చితంగా 1.5 శాతం సాల్వెన్సీ రేషియో కలిగి  ఉండాలని ఆదేశించింది . అందుచేత  కనీసం 1.5 సాల్వెన్సీ రేషియో ఉన్న సంస్థను ఎన్నుకోవటం ఉత్తమం.

5-విస్తృత ప్రణాళికలు గల సంస్థ: బీమా సంస్థలో అనేక  రకాల ఇతర ఆరోగ్య బీమా ప్రణాళికలు కూడా ఉండాలి అవి  కాన్సర్ ,గుండె సంబంధిత పాలసీలు, సీనియర్ సిటిజెన్ పాలసీలు ,మెటర్నరీ  పాలసీలు లాంటి అనేక విస్తృత ప్రణాళికలు కలిగి ఉన్న బీమా సంస్థ ఎన్నుకోవటం ఉత్తమం. అలాగే ముందుగా ఉన్నటువంటి జబ్బులను కూడా కవర్ చేసే వివిధ రకాల పాలసీలను కలిగి ఉన్న బీమా సంస్థను ఎంచుకోవటం ఇంకా మంచిది.

6- సంస్థ ప్రతిస్పందన తీరు : బీమా సంస్థ పనితీరు ,చురుకుదనం పాలసీదారులతో ఎప్పటికప్పుడు ప్రతిస్పందించడం , పాలసీదారుల సమస్యలను  పరిష్కరించడం,  క్లెయిమ్స్ ను వెంటనే అప్రూవల్స్ ఇవ్వటం, లాంటివి సంస్థ పనితీరు సామర్ధ్యాన్ని తెలియజేస్తాయి. దీని కోసం IRDAI నివేదికలు పాలసీదార్ల  రివ్యూ లు,  సోషల్ మీడియా అనుభవాలు పరిగణలోకి తీసుకోవాలి.

ఇప్పటివరకు మనం ఒక మంచి  బీమా సంస్థకు ఉండాల్సిన లక్షణాలు ,పరిశీలించాల్సిన అంశాలు గురించి పైన వివరంగా మాట్లాడుకున్నాం.ఇప్పుడు ఆరోగ్య బీమా ప్లాన్ ను ఎంచుకునే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో పరిశీలిద్దాం?

ఆరోగ్య బీమా ప్లాన్ లో పరిశీలించాల్సి అంశాలు :

1)  నో  కో-పేమెంట్ : అనగా పాలసీదారుడు వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినపుడు  హాస్పిటల్ బిల్లులో కొంత శాతం  పాలసీదారుడు కూడా  కట్టాల్సిన  పాలసీ రకం. ఇది 5% నుండి 20% వరకు పాలసీదారుడు ఎంచుకోవచ్చు. ఉదాహరణకు పాలసీదారుడు 10% కో -పేమెంట్ పాలసీని ఎంచుకున్నాడు అనుకుంటే హాస్పిటల్ బిల్లు లక్ష రూపాయలు అయినచో అందులో 10% అంటే పది వేల రూపాయలు పాలసీదారుడు స్వయంగా తన జేబులోంచి తిసికట్టాల్సి వస్తుంది. ఈ విధముగా కో పేమెంట్ ఎంచుకున్నట్లయితె  ప్రీమియం కొంత తగ్గుతుందని ఎంచుకున్నప్పటికీ ఈ కో-పేమెంట్ ఆప్షన్ కాకుండా 100% క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ ఎంచుకోవటం ఉత్తమం.

2) నో  రూమ్ రెంట్ లిమిట్ ; కొన్ని తక్కువ ప్రీమియంతో ఆరోగ్య బీమా అందించే బీమా సంస్థలు రూమ్ రెంట్ ఫై పరిమితి విధిస్తాయి. ఇవీ 3 నుంచి  5 వేలుగా పరిమితి విధించవచ్చు, లేదా మీ పాలసీ మొత్తం కవరేజీలో 1% నుండి 5% వరకు పరిమితి విధించవచ్చు. ఉదా…5 లక్షల బీమా కవరేజిలో 1% అంటే 5వేలు అన్నమాట.మీరు కనుక 5వేలకు మించిన గదిలో ఉండాల్సి వస్తే ఆ అదనపు చార్జీలను పాలసీదారుడే స్వంతంగా కట్టాల్సివస్తుంది.అంతే కాకుండా ఈ రూంరెంట్ కోసం అయినా చార్జీలు హాస్పిటల్ మొత్తం బిల్లులపై ప్రభావంపడి అంత మేరకు కూడా కట్టాల్సి వస్తుంది. కావున రూమ్ రెంట్ ఫై పరిమితి లేని పాలసీని ఎంచుకోవటం ఉత్తమం.

3) నో డిసీజ్ వైస్ సబ్ లిమిట్స్ ; కొన్ని పాలసీలు ఒక్కో వ్యాధిపై కొంత మేరకు మాత్రమే బీమా కవర్ ని పరిమితం చేస్తాయి. ఆ పరిమితి దాటితే ఆ తర్వాత వాటిని పాలసీ కవర్ చెయ్యదు. ఉదాహరణకు హార్ట్ డిసిజెస్ కు 2 లక్షలు అని కిడ్నీ సమస్యకు 1 లక్ష రూపాయలు మాత్రమే ఆరోగ్య బీమా నుండు చెల్లిస్తాం అని క్యాపింగ్ విదిస్తుంది.  కావున ఇటువంటి  సబ్ లిమిట్స్ లేని పాలసీని ఎంచుకోవటం ఉత్తమం.

4) లో వెయిటింగ్ పీరియడ్ ; ప్రతి బీమా సంస్థ నిర్దిష్ట వ్యాధులకు కొంత కాల పరిమితి విదిస్తుంది ఈ వెయిటింగ్ పీరియడ్ లోపు ఏదేని క్లెయిమ్ చేస్తే బీమా సంస్థ దాన్ని తిరస్కరించవచ్చు.కావున ఈ వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉండే పాలసీలను తీసుకోవటం మంచిది.ఇప్పుడు దాదాపుగా అన్ని బీమా సంస్థలు అదనపు రైడర్స్ ద్వారా పూర్వం నుండే ఉన్న వ్యాధులను పాలసీ కొనుగోలు చేసిన మొదటి రోజు నుండే కవర్ చెయ్యడం జరుగుంతుంది.

5) క్యాష్ లెస్ హాస్పిటల్ నెట్వర్క్ ; ప్రస్తుతం IRDAI అన్ని బీమా సంస్థలకు  నెట్వర్క్ ఆసుపత్రులతో సంభంధం లేకుండా  క్యాష్ లెస్ క్లెయిమ్ సేవలు అందించాలని నిబంధన విధించడం జరిగింది. ఇప్పుడు” క్యాష్ లెస్  ఏని  వేర్ ” ప్రొగ్రమ్ లో భాగంగా ఏ హాస్పిటల్ లోనైనా ఆరోగ్య బీమా ద్వారా వైద్యం చేసుకోవచ్చు.

6) ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజెషన్ : కొన్ని వ్యాధులు ఉన్న పళంగా రాకపోవచ్చు హాస్పిటల్లో చేరే ముందే కొన్ని ఆరోగ్య పరీక్షలు చేసి వ్యాధిని గుర్తించవచ్చు ఈ ఖర్చులను, అలాగే  హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినా తర్వాత వ్యాధి తగ్గుదల కోసం మెడిసిన్ అవసరం రావచ్చు మరియు వ్యాధి తగ్గిందో లేదో అని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చెయ్యచ్చు,అందుకోసం అయినా ఖర్చులన్నిటిని కవర్ చేసే పాలసీ ఎంచుకుంటే మంచిది. సాధారణముగా ఆరోగ్య బీమా ద్వారా  ప్రీ హాస్పిటల్ ఖర్చులను  60 రోజుల వరకు, పోస్ట్ హాస్పిటల్ ఖర్చులను  180 వరకు కవర్ చేస్తారు.

7) డే కేర్ చికిత్సలు ; ఆరోగ్య బీమాలో డే కేర్ చికిత్సలు అనగా ఉదయం ఆసుపత్రిలో చేరి సాయంత్రం లోపు వైద్యం పూర్తయి డిశ్చార్జ్ అయ్యే వైద్య చికిస్థలనే డే కేర్ చికిత్సలు అంటారు.రోగ్య బీమాలో క్లెయిమ్స్ రావాలంటే ఒకప్పుడు 24 గంటలు తప్పనిసరి ఆసుపత్రిలో ఉండాలనే నిబంధన ఉండేది కానీ, ఈ డే కేర్ ట్రెయిట్మెంట్స్ లో భాగంగా అన్ని భీమా సంస్థలు ఆరోగ్య బీమా పరిధిలోకి తీసుకరావటం జరిగింది. 24 గంటల లోపు అయ్యే చికిత్సలలో .డయాలసిస్ ,కీమో థెరపీ ,రేడియో థెరపీ ,అపెండెక్టమీ , స్టోన్స్ రిమూవల్స్ వంటి చికిత్సలు 24 గంటల లోపలే ఉంటాయి. కావున డే కేర్ చికిత్సలు కవర్ చేసే పాలసీలను ఎంచుకోవటం ఉత్తమం.

8) ప్రత్యాన్మయ చికిత్సలు ; మన దేశంలో అల్లోపతీ కాకుండా ఆయుర్వేదం, యునాని, సిద్ధ ,హోమియోపతి యోగ లాంటి ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి  కొందరు అల్లోపతి మందుల సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా వీటిని ఎంచుకోవటం జరుగుతుంది. కావున వీటిటన్నింటిని కవర్ చేసే పాలసీని ఎంచుకోవటం మంచిది. గతంలో అల్లోపతి చికిత్స విధానాలకు మాత్రమే ఆరోగ్య బీమాలో కవర్ అయ్యేది, కాని నేడు అన్ని ఆరోగ్య బీమ సంస్థలు ఆయుర్వేద ,యోగ,యునాని సిద్ధ, హోమియోపతి లాంటి చికిస్థలను కూడా బీమా సంస్థలు  కవర్ చేస్తున్నాయి. .

9) ఉచిత ఆరోగ్య పరీక్షలు : ప్రతి సంవత్సరం పాలసీదారుడి ఆరోగ్యం ఫై శ్రద్ధ వహించి కొన్ని బీమా సంస్థలు ఉచితంగా ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తున్నాయి .తద్వారా వ్యాధిని ముందుగానే గుర్తించి నయం చేసే విధముగా తగు జాగ్రత్తలు తీసుకొనే అవకాశం ఉంది.

10) రిస్టోరేషన్ బెనిఫిట్స్: ఆరోగ్య బీమాలో పునరుద్ధరణ ప్రయోజనం (Auto Restoration ) అనేది గొప్ప ఫీచర్ అని చెప్పవచ్చు. దీని ద్వారా మీరు ఎంత కవర్ ఎంచుకుంటారో అంతవరకు క్లెయిమ్ చేసిన మళ్లి తిరిగి ఈ పునరుద్ధరణ ప్రయోజనం ద్వారా మీ కవరేజ్ రీఛార్జ్ అయ్యి మల్లి మీ పాలసీ కవరేజ్ మేరకు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ ఉంటె మీ బీమా పాలసీ మీ కవరేజ్ ఎన్నటికీ అయిపోదు అన్నమాట. ఆరోగ్య బీమాలో తక్కువ కవరేజ్ ఎంచుకున్న వాళ్ళకి మరియు ఫ్యామిలీ ఫ్లోటర్ ఎంచుకున్న వాళ్ళకి ఈ రిస్టోరేషన్ బెనిఫిట్ ఎంతో ఉపయోగపడుతుంది.

ఉదాహరణకు-   మీకు 5 లక్షల కవరేజ్ తో ఆరోగ్య బీమా ఉంది అనుకుందాం మీకు అనుకోకుండా ఒక ప్రమాదం జరిగి ఆసుపత్రి పాలై 3 లక్షల వరకు చికిత్స కొరకు ఖర్చయ్యింది అనుకుందాం. అందుకోసం మీ బీమా పాలసీలో 5 లక్షలలో కవరేజ్ లో 3 లక్షలు క్లెయిమ్ అయితే ఇప్పుడు మీ పాలసీ ప్రకారం కేవలం 2 లక్షల వరకు మాత్రమే తర్వాత చికిత్సలకు క్లెయిమ్ ఇవ్వబడుతుంది కానీ అందులో పునరుద్ధరణ ప్రయోజనం ఉన్నట్లయితే వెంటనే క్లెయిమ్ చేసిన 3 లక్షలు రీఫిల్ చేయబడి 5 లక్షలు అవుతుంది. ఈ రీఫిల్ నే పునరుద్ధరణ ప్రయోజనం అంటామ్ ఒకవేళ మీ పాలసీలో ఈ ఫీచర్ లేకపోతె అదే సంవత్సరంలో మల్లి ఎదేని క్లెయిమ్ వస్తే మన జేబులో నుండి పెట్టాల్సి వస్తుంది. కావున పాలసీ కొనుగోలుకు ముందే ఈ రిస్టోరేషన్ బెనిఫిట్ ఉన్న పాలసీని ఎంచుకోవాల్సి ఉంటుంది.

11) నో క్లెయిమ్ బోనస్ : ఈ ఫీచర్ ద్వారా మీరు ఎంచుకున్న హెల్త్ కవర్ అనేది మొదటి సంవత్సరం 50% రెండవ సంవత్సరం 50% మొత్తంగా 100% కవరేజ్ అనేది రెండు సంవత్సరాల వరకు పెరుగుతూ ఉంటుంది.ఇది సాధారణముగా అన్ని బీమా సంస్థలు ఈ నో క్లెయిమ్ బోనస్లు  అందిస్తున్నాయి.

ఉదాహరణకు:- 10-లక్షల హెల్త్ పాలసీ తీసుకున్న పాలసీదారునికి రెండు నుండి 5 సంవత్సర తర్వాత మల్లి  10 లక్షల అదనపు  కవరేజ్ ని నో క్లెయిమ్ బోనస్  ద్వారా పొందడం జరుగుతుంది. ప్రతి బీమా సంస్థ నో క్లెయిమ్ బోనస్ అందిస్తుంది బోనస్ పెరుగుదల అనేది  ప్రతి పాలసీ పాలసీకి మారుతుంటుంది.

12) రైడర్స్ : ఆరోగ్యబీమా పాలసీలో వివిధ రైడర్స్ ఉన్నాయి వాటిని ఆప్ట్ చేసుకున్నట్లయితే ప్రీమియం పెరిగే అవకాశం ఉంది.ఆరోగ్య బీమాలో మెటర్నిటీ రైడర్,క్రిటికల్ ఇల్ నెస్ రైడర్,వ్యక్తిగత ప్రమాద బీమా రైడర్ ,హాస్పిటల్ క్యాష్ రైడర్, రూమ్ రెంట్ మాడిఫికేషన్ రైడర్ , PED వెయిటింగ్ పీరియడ్ మాడిఫికేషన్ రైడర్ ,OPD రైడర్, నాన్ – మెడికల్ కవరేజ్ రైడర్ లాంటి రైడర్లు ఉన్నాయి.పాలసీదారుని అవసరాలను బట్టి ఎంచుకోవాల్సి ఉంటుంది. బేస్ ప్రీమియానికి కొంత అదనంగా ప్రీమియం చెల్లించి వీటిని ఎంచుకోవాల్సి ఉంటుంది.

ముగింపు : ఇన్ని ప్రయోజనాల దృష్ఠా ఆరోగ్య బీమా ఎంచుకునే ముందు జాగ్రత్త వహించాలి.ప్రతి ఒక్కరికి సరిపోయా పాలసీ అంటూ ఏమి లేదు? ఒక్కొక్కరి వ్యక్తిగత అవసరాలు ఒక్కో విధంగా ఉంటాయి.అందుకే ఎవరి అవసరాలకు తగ్గట్టు వారి పాలసీని ఎంచుకోవటం ఉత్తమం.

share

Leave a Comment