CARE SUPREME HEALTH INSURANCE POLICY
కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (Care Health Insurance Company Limited) భారతదేశంలోని ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థలలో ఒకటి. ఇది 2012లో (Religare Health Insurance) పేరుతో ప్రారంభమై, 2020లో “కేర్ హెల్త్ ఇన్సూరెన్స్”గా పేరు మార్చబడింది. ఇది స్టాండ్ అలొన్ హెల్త్ ఇన్సరెన్సు కంపెనీ. ఈ కంపెనీలో ఇండివిజువల్,ఫ్యామిలీ ఫ్లోటర్,సీనియర్ సిటిజెన్,క్రిటికల్ ఇల్ నెస్ లాంటి అనేక రకాల పాలసీలు కలవు. ఇప్పడు మనం కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపేనీలో ”CARE SUPREME ” ప్లాన్ గురించి తెల్సుకుందాం.దాని కన్నా ముందు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క పనితీరును పరిశీలిద్దాం ?
సాధారణంగా ఒక హెల్త్ పాలసీని ఎంచుకునే ముందు రెండు విషయాలను పరిశీలించాలి. అవి 1,హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ 2, ఆ కంపెనీలోని ప్లాన్. ముందుగా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపనీ పనితీరును పరీక్షించడానికి ఏం చూడాలో ఈ క్రింద వివరించడం జరిగింది అవి:
CLAIM SETTLEMENT RATIO
ప్రతి సంవత్సరం బీమా సంస్థకు వచ్చిన క్లెయిమ్స్ లో ఎన్నిక్లెయిమ్స్ పరిష్కరించిందో ఎన్ని క్లెయిమ్స్ తిరస్కరించింధో తెలియజేసే నివేదికె క్లెయిమ్ సెటిల్ మెంట్ రేషియో అంటారు. 100% క్లెయిమ్స్ లో కనీసం 90% క్లెయిమ్స్ ని పరిష్కరించే కంపెనీని మంచి కంపెనీగా చెప్పవచ్చు. కేర్ కంపెనీ 98% CSR ని కలిగి ఉంది మంచి కంపెనీగా పేరు తెచ్చుకుంది.
SOLVENCY RATIO
ఇది బీమా సంస్థ యొక్క ఆర్ధిక సామర్ధ్యాన్ని పరిపుష్టిని తెలియ జేస్తుంది ఎక్కువ సాల్వెన్సీ రేషియో ఉంటె సంస్థ పాలసీదార్ల అవసరాలు తీర్చడంలో వెనక్కు తగ్గదు .IRDAI పాలసీ సంస్థలను కచ్చితంగా 1.5 శాతం సాల్వెన్సీ రేషియో ఉండాలని ఆదేశిస్తుంది . కేర్ కంపెనీ సొల్వెన్సీ రేషియో 1.8 రేషియో ని కలిగి ఆర్ధికంగా పటిష్టంగా ఉంది.
COMPLAINTS VOLUME
ప్రతి 10 వేల క్లెయిమ్స్ లో ఎన్ని ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయో తెలియజెసే నివేదికే కంప్లైంట్ వాల్యూమ్ అంటారు. ఇది ఎంత తక్కువగా ఉంటె అంత మంచి కంపెనీగా చెప్పవచ్చు. ప్రస్తుతం కేర్ కంపెనీ 32 కంప్లైన్స్ ను కలిగి ఉంది.
CUSTOMER REVIEWS
హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ పనితీరు,ఆచరణ ,చురుకుదనం మరియు పాలసీదారుల సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రతిస్పందించడం ,సమస్యలను పరిష్కరించడం, క్యాష్ లెస్ క్లెయిమ్స్ కోసం వెంటనే అప్రూవల్స్ ఇవ్వటం లాంటివి సంస్థ పనితీరు సామర్ధ్యాన్ని తెలియజేస్తాయి దీని కోసం IRDAI నివేదికలతో పాటు పాలసీదార్ల రివ్యూ లు, అనుభవాలు మరియు సోషల్ మీడియా రివ్యూస్ ని పరిగణలోకి తీసుకొని కంపెనీని అంచనా వెయ్యవచ్చు.
పాలసీ ప్రత్యేకతలు
CUMULATIVE BONUS
CUMULATIVE BONUS SUPER
కేర్ సుప్రీమ్ పాలసీలో పునరుద్ధరణ ప్రయోజనం (Auto Restoration ) అనేది గొప్ప ఫీచర్ అని చెప్పవచ్చు. దీని ద్వారా మీరు ఎంత కవర్ ఎంచుకుంటారో అంతవరకు క్లెయిమ్ చేసిన మళ్లి తిరిగి ఈ పునరుద్ధరణ ప్రయోజనం ద్వారా మీ కవరేజ్ రీఛార్జ్ అయ్యి మల్లి మీ పాలసీ కవరేజ్ మేరకు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కేర్ సుప్రీమ్ పాలసీ ద్వారా ఆన్ లిమిటెడ్ టైమ్స్ రెస్టోరేషన్ ప్రయోజనం పొందవచ్చు.
RENEWAL DISCOUNT
కేర్ సుప్రీమ్ పాలసీ వెల్నెస్ బెనిఫిట్ ద్వారా పాలసీదారుడు రోజు 10 వేల అడుగులు నడిస్తే ఒక ఆక్టివ్ డే గా పరిగణించి సంవత్సరానికి 270 రోజులు పది వేల అడుగులు పూర్తి చేస్తే వచ్చే సంవత్సరం ప్రీమియంలో 30% డిస్కౌంట్ లభిస్తుంది.అలాగే 240 డేస్ -20% డిస్కౌంట్ 180 డేస్ -15% డిస్కౌంట్ 120 డేస్ -10% డిస్కౌంట్ లభిస్తుంది.
UNLIMTED E-CONSULTATION
కేర్ సుప్రీమ్ పాలసీ కలిగి ఉన్న పాలసీదారుడు ఆన్లైన్ చాటింగ్ లేదా ఫోన్ ద్వారా అపరిమిత డాక్టర్ కన్సల్టేషన్ పొందవచ్చు.జనరల్ ఫిజిషన్ తో పాటు ఇతర స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉంటారు.
NO ROOM RENT LIMIT
పాలసీదారునికి ఏదేని రిస్క్ జరిగి హాస్పిటల్ పాలైతే ట్రీట్మెంట్ కోసం ఎటువంటి రూమ్ నైనా ఎంచుకోవచ్చు. కేర్ సుప్రీమ్ పాలసీ ద్వారా రూమ్ రెంట్ ఎంపికలో ఎటువంటి పరిమితులు లెవ్వు.
NO LIMITS ON ICU CHARGES
పాలసీదారునికి ఏదేని రిస్క్ జరిగి హాస్పిటల్ పాలైనప్పుడు నాణ్యమైన వైద్యం కోసం ICU లో ఉండి వైద్యం తీసుకోవచ్చు.అందుకోసం పాలసీదారుడు కేర్ సుప్రీమ్ పాలసీ ద్వారా ICU చార్జెస్ లో ఎటువంటి పరిమితులు లేకుండా ఈ పాలసీ ద్వారా నాణ్యమైన వైద్యం పొందవచ్చు.
NO SUB-LIMITS
కేర్ సుప్రీమ్ పాలసీ ద్వారా ఎటువంటి వైద్య అత్యవసర పరిస్థితి ఎదురైనా ఎటువంటి వ్యాధికైనా ఎటువంటి పరిమితులు లేకుండా హెల్త్ పాలసీ ద్వారా వైద్యం పొందవచ్చు.
NO CO-PAYMENT
కో – పేమెంట్ ను తెలుగులో సహా చెల్లింపు అంటారు ఆరోగ్య బీమాలో కొ పేమెంట్ అర్ధం ఏంటంటే హాస్పిటల్ బిల్లులో కొంత భాగం పాలసీదారుడు కూడా కట్టాలనే నియమం. కేర్ సుప్రీమ్ పాలసీలో ఎటువంటి కో పేమెంట్ లేదు తద్వారా పాలసీదారుడు తన జేబులో నుండి ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు
PRE-POST HOSPITALIZATION
కేర్ సుప్రీమ్ పాలసీ ద్వారా ప్రీ హాస్పిటాలైజెషన్ 60-రోజులు,పోస్ట్ హాస్పిటలైజేషన్ 180- రోజుల వరకు ఖర్చులను కవర్ చేస్తుంది. కొన్ని వ్యాధులు ఉన్నఫలంగా రాకపోవచ్చు. హాస్పిటల్లో చేరే ముందే కొన్ని ఆరోగ్య పరీక్షలు చేసి వ్యాధిని గుర్తించవచ్చు. ఈ ఖర్చులను మరియు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినా తర్వాత వ్యాధి తగ్గుదల కోసం మెడిసిన్ అవసరం రావచ్చు, కావున ఈ రెండిటిని కవర్ చేసే సదుపాయం ఈ పాలసీలో కలదు.
DAY CARE TREATMENTS
ఆరోగ్య బీమాలో డే కేర్ చికిత్సలు అనగా ఉదయం ఆసుపత్రిలో చేరి సాయంత్రం లోపు వైద్యం పూర్తయి డిశ్చార్జ్ అయ్యే వైద్య చికిస్థలనే డే కేర్ చికిత్సలు అంటారు. ఆరోగ్య బీమాలో క్లెయిమ్స్ రావాలంటే ఒకప్పుడు 24 గంటలు తప్పనిసరి ఆసుపత్రిలో ఉండాలనే నిబంధన ఉండేది కానీ ఈ డే కేర్ ఆప్షన్ ద్వారా అన్ని డేకేర్ ట్రీట్మెంట్స్ కేర్ సుప్రీమ్ పాలసీ ద్వారా కవర్ చెయ్యడం జరుగుతుంది.24 గంటల లోపు అయ్యే చికిత్సలు.డయాలసిస్ ,కీమో థెరపీ ,రేడియో థెరపీ ,అపెండెక్టమీ , స్టోన్స్ రిమూవల్స్ వంటి చికిత్సలు 24 గంటల లోపలే ఉంటాయి కావున డే కేర్ చికిత్సలు కవర్ చేసే పాలసీలను ఎంచుకోవటం ఉత్తమం.
AYUSH COVER
ఆయుష్ చికిత్సలు లేదా ప్రత్యాన్మాయ వైద్య చికిత్సలు సంప్రదాయ వైద్య పద్ధతులుగా చెప్పవచ్చు.ఆయుష్ వైద్య విధానంలో భాగంగా ఆయుర్వేదం,హోమియోపతి ,యునాని,సిద్ధ ,యోగ వంటి వైద్య పద్ధతులు ఆయుష్ చికిత్సలో భాగంగా కవర్ చెయ్యబడతాయి. కేర్ సుప్రీమ్ పాలసీ ద్వారా ఆయుష్ వైద్యం కవర్ చెయ్యబడుతుంది.
DOMICILARY COVER
కేర్ సుప్రీమ్ పాలసీ ద్వారా డొమిసిలరీ వైద్యం పొందవచ్చు. ఆరోగ్య బీమాలో డొమిసిలరీ వైద్యం అంటే ఇంటి వద్దే చికిత్స పొందే సదుపాయాన్ని కల్పించడం అన్న మాట.దీన్నే హోమ్ ట్రీట్ మెంట్ లేదా రెసిడెన్షియల్ కేర్ అనికూడా అంటారు. ఆసుపత్రిలో తీసుకోవాల్సిన చికిత్సలను ఇంట్లో ఉండే పొందే సౌకర్యాన్ని డొమిసిలరీ చికిత్సలు అంటారు.
ORGAN COVER
కేర్ సుప్రీమ్ పాలసీ ద్వారా మీకు అవయవ మార్పిడి అవసరం వచ్చినా మీరు వేరే ఎవరికైనా అవయవ దానం చేయాలకున్న అందుకు అయ్యే వైద్య ఖర్చులకు ఆరోగ్య బీమానే కవర్ చేస్తుంది. మన వాతావరణ పరిస్థితులు,జనటికల్ కారణాలు రీత్యా మన దేశంలో కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలు అధికంగా చూస్తున్నాం. అందుకోసం ఈ పాలసీ సరిగ్గా సరిపోతుంది.
MODERN TREATMENTS
హెల్త్ పాలసీలో అత్యాధునిక పరికరాలతో చేసే రోబోటిక్ సర్జరీలు కూడా ఆరోగ్య పాలసీలో కూడా కవర్ చేయబడుతాయి.వైద్య సాంకేతిక అభివృద్ధి చెందడంతో ఇప్పుడు అన్ని చికిత్సలను ఆధునిక పద్ధతుల్లో నిర్వహించడం జరుగుతుంది.కేర్ హెల్త్ పాలసీలో అన్ని రకాల ఆధునిక చికిత్సలు కవర్ చెయ్యబడతాయి.
ROAD AMBULENCE
ఇంటి నుండి ఆసుపత్రికి ఆసుపత్రి నుండి ఇంటికి అయ్యే దారి ఖర్చులను కూడా కేర్ బీమా సంస్థే భరిస్తుంది. అత్యవసర సమయంలో మీరే స్వయంగా అంబులెన్సు ఏర్పాటు చేసుకున్న ఆ ఖర్చులను కూడా కేర్ ఆరోగ్య బీమా సంస్థ రీయింబర్సుమెంట్ చేస్తుంది.
AIR AMBULENCE
వైద్య సేవల కోసం ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి పేషెంట్ ని తక్షణమే తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చినపుడు ఎయిర్ అంబులెన్సు తోడ్పడుతుంది. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఎయిర్ అంబులెన్సు సదుపాయం కూడా ఉంది.
MATERNITY BENEFIT
ఆరోగ్య బీమా సంస్థలు అన్ని ప్రసూతి బీమా లేదా మెటర్నిటీ పాలసీలు ఇవ్వవు. ఒకవేళ ఇచ్చినా వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉండి అధిక ప్రీమియం వసూలు చేస్తాయి. కానీ కేర్ సుప్రీమ్ పాలసీ ద్వారా ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ గాని అదనపు ప్రీమియం కానీ వసూలు చెయ్యకుండా 25000-వేల వరకు మెటర్నిటీ కవర్ అందించబడుతుంది. వైద్యపరమైన ఖర్చులకు చింతించకుండ ప్రశాంతంగా ఉండాలంటే ప్రసూతి బీమా తప్పనిసరి.
OPTIONAL RIDERS
రైడర్స్ లేదా ఆడ్ ఆన్స్ అనేవి అదనముగా ప్రీమియం చెల్లించి పాలసీకి జత చెయ్యాల్సి ఉంటుంది. అయితే పాలసీదారుల వ్యక్తిగత అవసరాలను దృష్టిలో పెట్టుకొని అవసరం ఉన్న రైడర్స్ ను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది.
INSTANT COVER
సాధారణంగా IRDAI రూల్స్ ప్రకారం ప్రీ ఎక్సిస్టింగ్ డిసిజెస్ కవర్ చెయ్యబడాలంటే 3 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ తప్పనిసరి.కానీ కేర్ సుప్రీం పాలసీ ద్వారా PRE EXISTING డీసెసెస్ అనగా షుగర్ ,బీపీ ,ఆస్తమా థైరాయిడ్ లాంటి జబ్బులు పాలసీ కొనుగోలుకు ముందే ఉన్నట్లయితే ఈ ”INSTANT COVER ” రైడర్ ద్వారా 31 రోజుల నుండే కవర్ చెయ్యడం జరుగుతుంది.
PED MODIFICATIONS
IRDAI నిబంధనల ప్రకారం పాలసీ తీసుకోవడానికి ముందే ఉన్న వ్యాధులను ప్రీ-ఎక్సిస్టింగ్ డిసిజెస్ గా పరిగణిస్తారు.వీటిని 3 సంవత్సరాల తర్వాత మాత్రమే ఆరోగ్య బీమాలో కవర్ చెయ్యబడతాయి.కానీ కేర్ సుప్రీమ్ పాలసీ ద్వారా 3 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ని 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలకు తగ్గించుకోవచ్చు.
CLAIM SHIELD
ఆసుపత్రిలో ఉపయోగించే కాటన్,బ్యాండేజ్ ,ధర్మామీటర్ ,సిరంజిలు,గ్లోవ్స్,మాస్కులు PPE కిట్స్ మెదలైన 68 కి పైగా ఆరోగ్య బీమాలో కవర్ చెయ్యని వస్తువులు ఈ రైడర్ తో కవర్ చెయ్యబడతాయి. ఆసుపత్రి ఖర్చులో ఈ బిల్లులు 5% నుండి 20% వరకు అయ్యే అవకాశం ఉంది. కావున ఈ రైడర్ ని ఎంచుకున్నట్లయితే ఆసుపత్రి బిల్లులో ఎటువంటి డబ్బులు పాలసీదారుడు చెల్లించాల్సిన అవసరం లేదు.
HEALTH CHEKUP
కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీ ఆరోగ్యంఫై శ్రద్ధ వహించి సంవత్సరానికి ఒకసారి ఉచితంగా ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తుంది .కొన్ని వ్యాధులను ముందుగా గుర్తించినట్లయితే ప్రారంభంలోనే ఆ వ్యాధిని నయం చేయవచ్చు.
CARE OPD
ఆసుపత్రిలో అడ్మిట్ అయి వైద్యం చేసుకుంటేనే ఆరోగ్య బీమా ద్వారా కవర్ చెయ్యబడుతుంది.కానీ సాధారణ వ్యాదుల కొరకు డాక్టర్ ని కలవటం మందులు తీసుకోవటం లాంటివి ఆరోగ్య బీమాలో కవర్ చెయ్యబడవు. కానీ కేర్ OPD రైడర్ ద్వారా వీటి ఖర్చులను ఆరోగ్య బీమా లో కవర్ చెయ్యచ్చు. కొందరు దీర్ఘ కాలంగా వ్యాధులు ఉన్నవారు లేదా మల్టీ డిసిసెస్ ఉన్నవారు తరచు డాక్టర్ ని కలవాల్సి ఉంటుంది వారికోసం ఈ అవుట్ పేషెంట్ డాక్ట్ర ర్ కన్సల్టేషన్ (OPD )రైడర్ ఉపయోగ పడుతుంది.
CONS :
ఇప్పటివరకు కేర్ సుప్రీమ్ పాలసీలో ఫీచర్స్ మరియు ప్రయోజనాలను గురించి చెప్పడం జరిగింది.ఇప్పడు పాలసీలో లోపాల గురించి మాట్లాడుకుందాం.
1) డెంటల్ ట్రీట్ మెంట్స్ అనేవి ఈ పాలసీలో కవర్ చేయబడదు.
2) ANIMAL BITE VACCINATION అనేది ఈ పాలసీలో కవర్ చేయబడదు
3) ఈ పాలసీ ద్వారా వరల్డ్ వైడ్ గా వైద్య సేవలు పొందలేము.
4) మెటర్నిటీ రైడర్ అనేది ఈ పాలసీలో లేకపోవటం పెద్ద లోపంగా చెప్పవచ్చు.
కేర్ సుప్రీం పాలసీ అనేది తక్కువ ప్రీమియంతో అధిక కవరేజ్ తో పాటు పాలసీదారుల వ్యక్తిగత అవసరాలను దృష్టిలో పెట్టుకొని అనేక రకాల అదనపు రైడర్స్ ను కలిగి ఉంది. ఇతర పాలసీ ప్రీమియంలతో పోల్చుకుంటే ఈ పాలసీ మధ్య తరగతి ,ఎగువ మధ్య తరగతి కుటుంబాలకు తక్కువ ప్రీమియంతో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పొంది నాణ్యమైన వైద్యం పొందవచ్చు.