Bajaj Allianz Life eTouch II Term Insurance
బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది భారతదేశంలోని ప్రముఖ జీవిత బీమా సంస్థలలో ఒకటి. ఇది భారతదేశంలో నాన్ -బ్యాంకింగ్ సేవలు అందించే ప్రముఖ బజాజ్ ఫిన్‌సర్వ్ లిమిటెడ్ మరియు ప్రపంచ వ్యాప్తంగా బీమా సేవలు మరియు అసెట్ మేనేజర్ గా సేవలు అందిస్తున్న అలియాంజ్ SE కంపెనీ కి మధ్య జాయింట్ వెంచర్‌గా 2001లో ఏర్పడింది. ఇప్పుడు అలియాంజ్ కంపెనీ కి చెందిన అన్ని వాటాలు పూర్తిగా కొని సరికొత్త పూర్తి భారతీయ కంపెనీగా రూపొందింది. బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సురెన్సు పాలసీలతో పాటు హోల్ లైఫ్ పాలసీలు, (ULIPS) యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు,ఎండోమెంట్ పాలసీలు, మనీ బ్యాక్ పాలసీలు,రిటైర్ మెంట్ /పెన్షన్ పాలసీలు , చైల్డ్ ఎడ్యుకేషన్ పాలసీలు కలవు. పాలసీదారులు వారి వ్యక్తిగత పాలసీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారి అవసరాలకు తగ్గ పాలసీను బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తుంది. ఇప్పడు మనం బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క LIFE eTOUCH || టర్మ్ పాలసీ యొక్క ఫీచర్స్ గురించి తెల్సుకునే ముందు బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క పనితీరును గురించి తెలుస్కుందాం
చాట్ :
అర్హతలు :
Bajaj Allianz Life eTouch II పాలసీలో మూడు వేరియంట్స్ కలవు అవి.
1 Life Shield
2 Life Shield Plus
3 Life Shield ROP
లైఫ్ షీల్డ్ మరియు లైఫ్ షీల్డ్ ప్లస్- ప్యూర్ టర్మ్ పాలసీ కాగా లైఫ్ షీల్డ్ ROP- అనేది రిటర్న్ అఫ్ ప్రీమియం పాలసీగా చెప్పవచ్చు. మొత్తంగా ఈ మూడు అప్షన్స్ లోని టర్మ్ పాలసీలో బెనిఫిట్స్ గురించి తెల్సుకుందాం.
LIFE COVER
ఏదేని దురదృష్ట సంఘటన జరిగి పాలసీదారుడు అకాల మరణం చెందినట్లయితె వారిపై ఆధారపడిన వారి కుటుంబానికి ఆర్ధిక పరిహారాన్ని అందించి వారి కుటుంబానికి అండగా ఉంటుంది.50 లక్షల నుండి పాలసీదారుని అర్హత మేరకు అపరిమితంగా లైఫ్ కవర్ అందించే సదుపాయం ఈ పాలసీలో కలదు.
TARMINAL ILLNESS
పాలసీదారుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ఆరు నెలల్లో మరణం సంభవించవచ్చు అని నిర్ధారణ అయినపుడు గరిష్టంగా 2 కోట్ల రూపాయల వరకు నిర్దిష్ట మొత్తం ముందుగానే చెల్లించబడుతుంది. పాలసీ కాలంలో ఒకటే టర్మినల్ ఇల్ నెస్ బెనిఫిట్ చెల్లించ బడుతుంది. అలాగే టర్మినల్ ఇల్ నెస్ నిర్ధారణ అయినాక జీవిత బీమా కవరేజ్ మరియు రైడర్ ప్రీమియంలు అన్ని మాఫీ చెయ్యబడతాయి. పాలసీదారుని జీవిత బీమా కవరేజ్ 2 కోట్లకు మించి ఉంటె పాలసీ కొనసాగుతుంది మరియు పాలసీదారుడు మరణించిన తర్వాత మిగతా లైఫ్ కవర్ చెల్లించబడుతుంది.
WOP Benefit on ATPD/TI
పాలసీదారుడు ఏదేని ప్రమాదం కారణంగా అంగ వైకల్యం కలిగినా లేదా టర్మినల్ అనారోగ్యానికి గురైన జీవిత బీమా కోసం మరియు ఇతర రైడర్ ప్రయోజనాల కోసం చెల్లించే ప్రీమియంలన్ని మాఫీ చెయ్యబడతాయి. ప్రీమియంలు మాఫీ చెయ్యబడినప్పటికీ లైఫ్ కవర్ ప్రయోజనంతో పాటు ఇతర అన్ని రైడర్ ప్రయోజనాలు పాలసీతో పాటు కొనసాగుతాయి.ఈ ప్రయోజనం పాలసీదారుని కుటుంబానికి ఆర్ధిక భద్రతను అందిస్తుంది.
Accidental Death Benefit
ఈ రైడర్ ఎంపిక ద్వారా పాలసీదారుడు ప్రమాద కారణంగా మరణించిన యెడల బీమా సంస్థ హామీ మేరకు క్లెయిమ్ మొత్తం 100% ఏక మొత్తంలో చెల్లించబడుతుంది. దీనికి అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది రోజు ప్రయాణాలు లేదా రిస్క్ తో కూడిన జీవన శైలి ఉన్న వ్యక్తులకు ఉపయోగ పడుతుంది ఇది జీవిత బీమా కవరేజ్ కి అదనంగా చెల్లించే ఆర్ధిక ప్రయోజనం.
CRITICAL ILLNESS
గుండె జబ్బులు ,కాన్సర్ శరీర అవయవాలు దెబ్బతినటం లాంటి ప్రాణాంతకర వ్యాధుల నుండి వచ్చే ఆర్ధిక నష్టాన్ని ఈ రైడర్ కాపాడుతుంది. ఈ పాలసీలో 3 వేరియంట్స్ లో ఒక్కో విధమైన వ్యాదులు కవర్ చేస్తాయి కొన్ని పాలసీలు 10 రకాల వ్యాధులను కవర్ చేస్తే, కొన్ని పాలసీలు 60 కి పైగా వ్యాధులను కవర్ చేస్తాయి. మీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ రైడర్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
Maturity Benefit
లైఫ్ షీల్డ్ ,లైఫ్ షీల్డ్ ప్లస్ లో ఎటుంటి మెచూరిటీ ప్రయోజనాలు ఉండవు , కానీ లైఫ్ షీల్డ్ (ROP) లో మెచూరిటీ ప్రయోజనాలు కలవు.పాలసీ కాలపరిమితి ముగిసిన తరవాత లైఫ్ కవర్ కోసం ఇన్ని సంవత్సరాలుగా కట్టిన ప్రీమియంలు అన్ని తిరిగి పొందవచ్చు. ఇందులో జీవించి ఉన్న కూడా తాను కట్టినా ప్రీమియం లన్నింటినీ మెచ్యూరిటీ రూపంలో GST ని మినహాయించుకుని తిరిగి పొందటం జరుగుతుంది .కానీ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంతో పోల్చుకుంటే ఈ పాలసీలో ప్రీమియం చాలా అధికంగా ఉంటుంది.
Early Exit Value
ఎర్లీ ఎగ్జిట్ వాల్యూలో ఒక నిర్దిష్ట సమయంలో పాలసీదారుడు పాలసీ నుండి నిష్క్రమిస్తే అనగా పాలసీ కాల పరిమితి పూర్తికాక ముందు పాలసీ నుండి ఎగ్జిట్ అయితే పాలసీకోసం కట్టిన ప్రీమియంలో gst ని మినహాయించుకొని 100% ప్రీమియంలు తిరిగి పొందవచ్చు.
Life Stage Upgrade
పాలసీదారుని జీవిత ముఖ్య దశల్లో పాలసీ కవరేజ్ ని దశల వారిగా పెంచుకొనే అవకాశం ఈ పాలసీలో కలదు. వివాహం అనంతరం బేస్ కవరేజ్ కి 50% అదనంగా లేదా గరిష్టంగా 50 లక్షలు పెంచుకోవచ్చు. మొదటి దత్తత లేదా పుట్టుక కారరంగా జన్మించిన మొదటి సంతానం పేరుమీద 25% లేదా 25 లక్షలు గరిష్టంగా మరియు రెండవ దత్తత లేదా సంతానం పేరుమీద 25% మేరకు లేదా 25 లక్షలు గరిష్టంగా కవరేజ్ ని పేంచుకోనే అవకాశం ఉంది. హోమ్ లోన్ తీసుకున్నట్లయితే 25% లేదా గరిష్టంగా 50లక్షలు మరియు పిల్లల కోసం ఎడ్యుకేషన్ లోన్ 25% లేదా 25 లక్షలు కవర్ ని పెంచుకొనే సదుపాయం కలదు.
Premium Holiday
ఈ ప్రీమియం హాలిడే బెనిఫిట్ ద్వారా 1 నుండి 3 సంవత్సరాలు ప్రీమియం చెల్లించకున్న పాలసీని కొనసాగించే అవకాశం ఉంది.ఆర్ధిక అత్యవసర పరిస్థితులు ఉద్యోగం కోల్పోవటం లేదా అనుకోని వైద్య ఖర్చులు లాంటి ఆర్ధిక పరిస్థితుల్లో ఎటువంటి వత్తిడి లేకుండా మీ జీవిత బీమా కొనసాగింపుపై ఈ బెనిఫిట్ ఎంతగానో తోడ్పడుతుంది.
Death Benefit Payment option
పాలసీదారుని అకాల మరణాంతరం కుటుంభ సభ్యలు పొందే హామీ ప్రయోజనం మూడు విధాలుగా చెల్లించబడే సౌకర్యం ఉంది. ఏక మొత్తంలో లేదా మంత్లీ ఇన్కమ్ గా లేదా కొంత మొత్తం ఏక కాలంలో చెల్లించి మిగిలింది నెలనెలా ఆదాయం పొందే విధంగా లైఫ్ కవర్ మొత్తం పొందవచ్చు.
Auto Cover Continuance Benefit
పాలసీదారుడు తమ లైఫ్ కవర్ కోసం చెల్లించే ప్రీమియంలు మరియు రైడర్ చెల్లింపులు 12 నెలలు లేదా ఒక సంవత్సరం వరకు ఆలస్యం గా చెల్లించిన లేదా వాయిదా వేసిన పాలసీ ప్రయోజనాలు కొనసాగించబడుతాయి.ఆ సంవత్సర ప్రీమియంలు వచ్చే సంవత్సరం ప్రీమియంతో కలిపి కట్టాల్సి ఉంటుంది.అందుకోసం ఎటువంటి అదనపు ప్రీమియంలు చెల్లించ వలసిన అవసరం లేదు.ఈ ప్రయోజనం పాలసీ లాప్స్ కాకుండా కాపాడుతుంది.
Option to Change Premium Payment Frequency
ప్రీమియం చెల్లింపులు పాలసీదారుని సౌలభ్యం మేరకు పాలసీ కాలంలో ఎప్పుడైనా చెల్లింపులు నెల వారి ,త్రైమాసికం,అర్ధ వార్షికం ,వార్షికం ఈలా ఎప్పుడైనా మార్చుకొనే సదుపాయం కలదు.
LOAN
లైఫ్ షీల్డ్ ,లైఫ్ షీల్డ్ ప్లస్ వేరియంట్స్ లో ఎటువంటి లోన్ సౌకర్యం ఉండదు కానీ లైఫ్ షీల్డ్ (ROP) ఆప్షన్ లో కట్టిన ప్రీమియంల నుండి 50% వరకు లోన్ పొందే అవకాశం ఉంది
HEALTH MANAGEMENT SERVICE
ఈ హెల్త్ మేనేజ్మెంట్ సేవలు అనేవి చాలా తక్కువ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల్లోనే అందుబాటులో ఉన్నాయి . బజాజ్ లైఫ్ eTouch || ప్లాన్ అలాంటి కొన్ని పాలసీలలో ఒకటి. ఈ ప్లాన్ ద్వారా బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ తమ యాప్ ద్వారా ప్రత్యేక సేవలను అందిస్తోంది. ఇందులో మెడికల్ సెకండ్ ఒపినియన్, మెడికల్ కేస్ మేనేజ్మెంట్, మెడికల్ కన్సల్టేషన్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ సేవల వల్ల పాలసీదారుల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు మరియు అవసరమైన చికిత్సలను సమయానుకూలంగా పొందవచ్చు.
FAMILY PROTECT RIDER :
ఈ రైడర్ ద్వారా పాలసీదారుడు ఏదేని ప్రమాదంలో మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం ఏర్పడిన (ATPD) అటువంటి పరిస్థితుల్లో మీ తల్లిదండ్రులకు ప్రతి నెల కొంత ఆదాయాన్ని ఇచ్చే వెసులుబాటు ఈ పాలసీ ద్వారా కలదు. అలాగే పైన చెప్పిన విధముగా పాలసీదారుడు మరణించిన శాశ్వత అంగవైకల్యం ఏర్పడిన అప్పటి వరకు కట్టిన ప్రీమియంలన్నింటినీ కలిపి 105% తిరిగి పాలసీదారుని తల్లిదండ్రులకు లంప్ సం గా చెల్లించబడుతుంది. అంతే కాకుండా మీ పాలసీ కొనుగోలు సమయంలో ఎంత లైఫ్ కవరేజ్ ఎంచుకున్నారో అందులో 1% మేరకు ప్రతి నెల వారు జీవించి ఉన్నంత కలం చెల్లించబడుతుంది.
ముగింపు :