Aditya birla DIGISHIELD term insurance plan
మీరు మీ కుటుంబానికి హీరో -మీరు ఉన్నంతవరకు మీ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతారు. వారి అవసరాలు తీర్చుతూ వారు సౌకర్యముగా ఉండటానికి అన్ని విధాలా కృషి చేస్తూ వారిని ఆనందంగా ఉంచుతారు. మీరు ఉన్నంతవరకు మీ సంరక్షణలో వారు భద్రంగా భావిస్తారు. అయితే అనుకోని పరిస్థితుల్లో మీరు లేని సమయంలో మీ కుటుంభ ఆర్ధిక అవసరాలు, భవిషత్తు భద్రత కోసం ఆందోళన చెందకుండా మీరు ఉన్నప్పుడు కొనసాగించిన జీవన శైలిని మీరు కలలుగన్న మీ పిల్లల భవిష్యత్ లక్షణాలను నెరవేర్చడానికి మీకు ఒక టర్మ్ పాలసీ అవసరం.అందుకు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ వారి డిజి షీల్డ్ టర్మ్ పాలసీ మీ కుటుంభం అవసరాలను తీర్చుతూ వారి భవిష్యత్ కు భద్రత ఇస్తుంది.
పాలసీ ప్రత్యేకతలు :
పాలసీదారుల అవసరాలకు అనుగుణంగా 10 రకాల పాలసీ ఎంపికలు
1 సంవత్సరం నుండి 100 సంవత్సరాల వరకు జీవిత బీమా కవరేజ్
డెత్ బెనిఫిట్ చెల్లింపు ఏక మొత్తంగా మరియు నెల వారి లేదా కొంత ఏక మొత్తంగా చెల్లించి మిగతాది నెలనెలా చెల్లింపు ఎంపికలు
సర్వైవల్ బెనిఫిట్స్ ని 60 యేండ్ల తర్వాత నెలనెలా పొందే అవకాశం
రిటర్న్ అఫ్ ప్రీమియంతో జీవిత బీమా కోసం చెల్లించిన ప్రీమియంలు అన్నింటిని తిరిగి పొందవచ్చు
ఎటువంటి ప్రీమియం లేకుండా టర్మినల్ ఇల్ నెస్ బెనిఫిట్ సదుపాయం.
అదనపు ప్రీమియంతో క్రిటికల్ ఇల్ నెస్ రైడర్ ద్వారా 42 వ్యాధులను కవర్ చేస్తుంది
జాయింట్ లైఫ్ ప్రొటెక్షన్ పాలసీ ద్వారా జీవిత భాగస్వాములు ఇద్దరు ఒకే పాలసీలో కవర్ చేసే సదుపాయం.
ఈ క్రింద పేర్కొన్న 10 రకాల ప్లాన్ ఆప్షన్స్ లో మీ అవసరాలకు తగ్గ ప్లాన్ ఎంచుకొనే సదుపాయం ఉంది. వాటిని ఈ క్రింద పేర్కొనటం జరిగింది.
1: Level Cover Option
2: Increasing Cover Option
3: Sum Assured Reduction Option
4: Whole Life Option (Level Cover)
5: Whole Life Option (Sum Assured Reduction Cover)
6: Income Benefit
7: Level Cover plus Income Benefit
8: Low Cover Option
9: Level Cover with Survival Benefit
10: Return of Premium (ROP)
ఈ పైన పేర్కొన్న పాలసీలో మీరు ఏదో ఒక పాలసీని ఎంచుకోవాల్సి ఉంటుంది.మీరు ఎంచుకున్న పాలసీని బట్టి ప్రీమియం మారుతుంటుంది. ఒకసారి పాలసీ ప్లాన్ ఎంచుకున్నాక తరవాత మార్చలేము.
పాలసీ అర్హతలు :
పాలసీ కవరేజీ పరిమితి : 50 లక్షల నుండి -అపరిమితం
వయస్సు అర్హతలు : 18 సం .. నుండి 65 సం.. రాల వరకు
ప్రీమియం చెల్లింపుల కాలం : రెగ్యూలర్ పే ,లిమిటెడ్ పే ,సింగిల్ పే
ప్రీమియం చెల్లింపులు : నెలనెల, అర్ధ సంవత్సరం ,సంవత్సరం
పాలసీ ప్రయోజనాలు :
మరణ ప్రయోజనం :
ఏదేని దురదృష్ట సంఘటన జరిగి పాలసీదారుడు అకాల మరణం చెందినట్లయితె వారిపై ఆధారపడిన వారి కుటుంబానికి పాలసీ డాక్యుమెంట్ ప్రకారం ఆర్ధిక పరిహారాన్ని అందించి వారి కుటుంబానికి అండగా ఉంటుంది. టర్మినల్ ఇల్ నెస్ లేదా క్రిటికల్ ఇల్ నెస్ బెనిఫిట్ మరణ ప్రయోజనాని కన్నా ముందే ఏదేని చెల్లింపులు చెల్లించినట్లయితే దాన్ని మినహాయించుకొని మిగతా లైఫ్ కవర్ చెల్లించబడుతుంది.
టర్మినల్ ఇల్ నెస్ :
పాలసీదారుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ఆరు నెలల్లో మరణం సంభవించవచ్చు అని నిర్ధారణ అయినపుడు లైఫ్ కవరేజ్ లో 50% లేదా గరిష్టంగా 2 కోటి రూపాయల వరకు నిర్దిష్ట మొత్తం ఒకేసారి చెల్లించబడుతుంది. ఇలా 80 సంవత్సరాల వరకు టర్మినల్ ఇల్ నెస్ బెనిఫిట్ పొందవచ్చు. పాలసీ కాలంలో ఒకటే టర్మినల్ ఇల్ నెస్ బెనిఫిట్ చెల్లించ బడుతుంది. అలాగే టర్మినల్ ఇల్ నెస్ నిర్ధారణ అయినాక జీవిత బీమా కవరేజ్ మరియు రైడర్ ప్రీమియంలు అన్ని మాఫీ చెయ్యబడతాయి. టర్మినల్ ఇల్ నెస్ బెనిఫిట్ అనేది పాలసీ కవరేజ్ లో భాగంగా చెల్లించబడే ప్రయోజనం మాత్రమే.
క్రిటికల్ ఇల్ నెస్ :
గుండె జబ్బులు ,కాన్సర్ శరీర అవయవాలు దెబ్బతినటం లాంటి తీవ్రమైన లేదా ప్రాణాంతకర వ్యాధుల నుండి ఈ రైడర్ ద్వారా ఆర్ధిక ప్రయోజనం పొందవచ్చు. ఈ రైడర్ ద్వారా 42 రకాల వ్యాధులను కవర్ చేస్తాయి. పాలసీ అమలులో ఉండి మీరు క్రిటికల్ ఇల్ నెస్ కు గురైతే హామీ మేరకు ఒకేసారి చెల్లిస్తుంది. అనంతరం ఈ రైడర్ ప్రయోజనం ముగుస్తుంది ఈ బెనిఫిట్ అనేది అదనంగా పొందే ప్రయోజనం కాదు. డెత్ బెనిఫిట్ లో నుండే ముందుగానే పొందే ప్రయోజనంగా చెప్పవచ్చు. ఇది పాలసీ కవరేజ్ లో 50% లేదా గరిష్టంగా 50 లక్షల పొందవచ్చు. 70 సంవత్సరాల వరకు ఈ ప్రయోజనం ఎంచుకోవచ్చు.
ఉదాహరణ:
రాము అనే పాలసీదారుడు వయస్సు 35 -సంవత్సరాలు, ₹1 కోటి పాలసీ మరియు ₹25 లక్షల ACI కవరేజ్ ఎంచుకున్నాడు.
-వార్షిక ప్రీమియం ₹28,725 (డెత్ కవర్ కోసం ₹14,600 + ACI కోసం ₹14,125).
-15వ పాలసీ సంవత్సరంలో క్యాన్సర్ అని నిర్ధారణ అవుతుంది.
-ACI మొత్తంగా ₹25 లక్షలు వెంటనే ఒకేసారి చెల్లించబడుతుంది.
-పాలసీ మిగిలిన మొత్తం ₹75 లక్షలు కొనసాగుతుంది.
-కానీ ACI ప్రీమియం ₹14125 తర్వాత నుండి రద్దు చెయ్యబడి జీవిత బీమా కోసం 14600 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది
షరతులు :
పాలసీ ప్రారంభమైన 90 రోజుల్లోపుగా ఏదైనా క్రిటికల్ ఇల్ నెస్ నిర్ధారణ అయితే ACI ప్రయోజనం చెల్లించబడదు.
ప్రీ-ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటే ఇప్పటికే ఉన్న వ్యాధులకు ఈ ప్రయోజనం వర్తించదు.
జాయింట్ లైఫ్ ఆప్షన్ :
ఈ ఆప్షన్ ద్వారా తనకు తన జీవిత భాగస్వామికి ఒకే పాలసీ ద్వారా ఇద్దరికి జీవిత బీమా పొందవచ్చు.దీనిని పాలసీ కొనుగోలు సమయంలోనే ఎంపీక చెయ్యాల్సి ఉంటుంది.ఈ పాలసీలో ప్రాధమిక జీవిత బీమా పొందిన మొదటి వ్యక్తి మరణించినట్లయితే ద్వితీయ బీమా పొందిన వ్యక్తికి మరణ ప్రయోజనం చెల్లించబడుతుంది. ఆ తర్వాత రెండో పాలసీదారుని కోసం పాలసీ కొనసాగుతుంది కానీ ప్రీమియం రద్దు చెయ్యబడుతుంది. ద్వితీయ బీమా పొందిన వ్యక్తి మరణించినట్లయితే మరణ ప్రయోజనం ప్రాధమిక పాలసీ పొందిన వ్యక్తికి చెల్లించి ఇప్పుడు ఒకే లైఫ్ కవర్ కోసం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు ఒకేసారి మరణించినట్లయితే మరణ ప్రయోజనం నామినికి చెల్లించి పాలసీ ముగుస్తుంది.ఈ పాలసీలో అదనముగా ఎటువంటి రైడర్స్ ని ఎంచుకొనే అవకాశం లేదు.
లైఫ్ స్టేజ్ ప్రొటెక్షన్ :
భవిష్యత్ లో వివాహం ,పిల్లలు వంటి జీవిత ముఖ్య దశల్లో పాలసీ కవరేజ్ ని దశల వారిగా పెంచుకొనే అవకాశం ఈ పాలసీలో కలదు. వివాహం అనంతరం బేస్ కవరేజ్ కి 50% అదనంగా లేదా గరిష్టంగా 50 లక్షలు పెంచుకోవచ్చు. మొదటి దత్తత లేదా పుట్టుక కారరంగా జన్మించిన మొదటి సంతానం మరియు రెండవ సంతానం పేరుమీద 25% లేదా 25 లక్షలు గరిష్టంగా కవరేజ్ ని పేంచుకోనే అవకాశం ఉంది. హోమ్ లోన్ తీసుకున్నట్లయితే 50% లేదా గరిష్టంగా 50లక్షల కవర్ ని పెంచుకొనే సదుపాయం కలదు. ఈ ఆప్షన్ ని పాలసీ కొనుగోలు సమయంలోనే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వైద్య పరీక్షలు లేకుండానే లైఫ్ కవర్ ని అదనముగా ఈ విధంగా పెంచుకొనే అవకాశం ఉంది.
ప్రీమియం చెల్లింపు ఎంపికలు :
ప్రీమియం చెల్లింపులు పాలసీదారుని సౌలభ్యం మేరకు సింగిల్ ప్రీమియం ,లిమిటెడ్ ప్రీమియం ,రెగ్యూలర్ ప్రీమియం చెల్లింపులు చేసుకొనే సౌలభ్యం ఉంది. ఈ చెల్లింపులు నెల , త్రైమాసికం అర్ధవార్షికం, వార్షికంగా చెల్లించవచ్చు.
సర్వైవల్ బెనిఫిట్స్ :
ప్లాన్ ఆప్షన్ 9 మినహా ఇతర ఎంపికలు చేసిన వారికి సర్వైవల్ బెనిఫిట్ అందుబాటులో ఉండదు. ప్లాన్ ఆప్షన్ 9 ఎంపిక చేసిన పాలసీదారుడికి 60 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకున్నట్లయితే, సర్వైవల్ బెనిఫిట్ చెల్లించబడుతుంది. ఈ ప్రయోజనం క్రింద, ప్రతి నెల 0.12% సమ్ అష్యూర్డ్
పాలసీ కాలం ముగిసే వరకు లేదా పాలసీదారుడు మరణించే వరకు ప్రతి నెలా ఈ చెల్లింపు కొనసాగుతుంది.
మెచూరిటీ బెనిఫిట్ :
ఈ పాలసీలో రిటర్న్ అఫ్ ప్రీమియం (10-వ ఆప్షన్) ను ఎంపిక చేసుకున్న పాలసీదారులను మినహ ఎటువంటి మెచూరిటీ ప్రయోజనాలు చెల్లించబడవు. 10 వ ఆప్షన్ ఎంపిక చేసుకున్న పాలసీదారులకు పాలసీ కాలం ముగిసిన తర్వాత లైఫ్ కవర్ కోసం కట్టిన ప్రీమియం లన్నింటినీ తిరిగి పొందవచ్చు.
రైడర్ ఆప్షన్స్ :
యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసబిలిటీ రైడర్ :
ఈ రైడర్ ఎంపిక ద్వారా పాలసీదారుడు ప్రమాద కారణంగా మరణించిన లేదా అంగవైకల్యం ఏర్పడిన బీమా సంస్థ హామీ మేరకు క్లెయిమ్ మొత్తం 100% ఏక మొత్తంలో చెల్లించబడుతుంది. దీనికి అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది రోజు ప్రయాణాలు లేదా రిస్క్ తో కూడిన జీవన శైలి ఉన్న వ్యక్తులకు ఉపయోగ పడుతుంది ఇది అదనముగా చెల్లించే ప్రయోజనం కాదు జీవిత బీమా కవరేజ్ లో నుండే చెల్లించబడే ప్రయోజనం. 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు ఈ రైడర్ ను ఎంచుకోవచ్చు.75000 వేల నుండి గరిష్టంగా 50 లక్షల వరకు రైడర్ సం అస్ర్డ్ ఎంపిక చెయ్యవచ్చు.
క్రిటికల్ ఇల్ నెస్ రైడర్ :
గుండె జబ్బులు ,కాన్సర్ శరీర అవయవాలు దెబ్బతినటం లాంటి ప్రాణాంతకర వ్యాధుల నుండి ఈ రైడర్ ద్వారా ఆర్ధిక ప్రయోజనం పొందవచ్చు. ఈ రైడర్ ద్వారా 42 రకాల వ్యాధులను కవర్ చేస్తాయి. ఈ ప్లాన్ ద్వారా గరిష్టంగా 50 లక్షల వరకు చెల్లించబడుతుంది. గరిష్టంగా 70 సంవత్సరాల వరకు క్రిటికల్ ఇల్ నెస్ బెనిఫిట్ చెల్లించబడుతుంది. క్రిటికల్ ఇల్ నెస్ బెనిఫిట్ అనేది పాలసీ సం అష్షుర్డ్ నుండి చెల్లించబడే ప్రయోజనం మాత్రమే కానీ అదనంగా చెల్లించే ప్రయోజనం కాదు.
సర్జికల్ కేర్ రైడర్ :
ఈ రైడర్ ఎంచుకున్నట్లయితే వైద్యపరంగా అవసరమైన శస్త్రచికిత్స కోసం ఖర్చు పెట్టిన వైద్య ఖర్చులను ఈ పాలసీ ద్వారా పాలసీదారునికి చెల్లింపులు చెయ్యబడుతుంది. ఇది 3000 నుండి 30000 వెల వరకు ఎంపిక చేసుకోవచ్చు. దీని ఆధారంగా ప్రీమియంకు 50 రేట్లు మొత్తాన్ని పొందవచ్చు అలాగే బ్రెయిన్ ,హార్ట్ ,కాలేయం, ఊపిరితిత్తులు,రక్త నాళాలు వంటి శరీర భాగాలకు శస్త్ర చికిత్స జరిగితే ఎంపిక చేసికొన్న బెనిఫిట్ మొత్తానికి 5 రేట్లు మొత్తాన్ని పొందవచ్చు.
హాస్పిటల్ కేర్ రైడర్ :
ఈ రైడర్ ద్వారా ప్రయోజనం ఏంటంటే పాలసీదారుడు కనుక ఏదేని వ్యాధి లేదా గాయానికి వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినట్లయితే అందుకు పాలసీదారునికి బీమా సంస్థ నగదును చెల్లింస్తుంది ఇది 600 నుండి 6000 వేల వరకు పాలసీదారుడు కట్టే ప్రీమియం మీద ఆధారపడి ఉంటుంది.
యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ :
ఈ రైడర్ ఎంపిక ద్వారా పాలసీదారుడు ప్రమాద కారణంగా మరణించిన యెడల బీమా సంస్థ హామీ మేరకు క్లెయిమ్ మొత్తం 100% ఏక మొత్తంలో చెల్లించబడుతుంది. దీనికి అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది రోజు ప్రయాణాలు లేదా రిస్క్ తో కూడిన జీవన శైలి ఉన్న వ్యక్తులకు ఉపయోగ పడుతుంది. పాలసీ కాలంలో ప్రమాదం జరిగి అనంతరం 180 రోజుల తర్వాత మరణం సంభవించిన మరణ ప్రయోజనం చెల్లించబడుతుంది. ప్రమాదం జరిగిన తేదీ నుండి మరణించే తేదీ వరకు చెల్లించబడిన ప్రీమియాలను , మీమా సంస్థ వడ్డీతో కలిపి, మరణ ప్రయోజనంతో పాటు పాలసీదారునికి తిరిగి చెల్లిస్తుంది
ప్రీమియం వేవియర్ రైడర్ :
పాలసీదారుడు ఏదేని ప్రమాదం లేదా క్రిటికల్ ఇల్ నెస్ అనారోగ్యానికి గురైతె జీవిత బీమా కోసం మరియు ఇతర రైడర్ ప్రయోజనాల కోసం చెల్లించే ప్రీమియంలన్ని మాఫీ చెయ్యబడతాయి. ప్రీమియంలు మాఫీ చెయ్యబడినప్పటికీ లైఫ్ కవర్ ప్రయోజనంతో పాటు ఇతర అన్ని రైడర్ ప్రయోజనాలు పాలసీతో పాటు కొనసాగుతాయి.ఈ ప్రయోజనం పాలసీదారుని కుటుంబానికి ఆర్ధిక భద్రతను అందిస్తుంది.
ముగింపు : ఆదిత్య బిర్లా డిజి ఫీల్డ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎన్నో ప్రయోజనాలతో పాటు రైడర్స్ తో కూడిన ఒక సంపూర్ణ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీగా చెప్పవచ్చు. అలాగే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మంచి ఆర్ధిక పరమైన వృద్ధితో పాటు క్లెయిమ్స్ సమయంలో పాలసీదారులను ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్లెయిమ్స్ సెటిల్ చేస్తూ మంచి పనితీరును సంపాదించుకుంది. 2024 సంవత్సరంలో 98.40 శాతం కలిగి మంచి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో పాలసీదారుల నమ్మకాన్ని పొందింది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ తో పాటు పాలసీ జారీ చెయ్యడంలో ఎటువంటి జాప్యం లేకుండా మంచి పనితీరును కలిగి ఉండటం ఆదిత్య బిర్లా లైఫ్ ఇన్సూరెన్స్ కంపినీ ప్రత్యేకతగా చ్చేప్పవచ్చు.