HDFC CLICK 2 PROTECT SUPER టర్మ్ పాలసి రివ్యూ ? -

HDFC CLICK 2 PROTECT SUPER టర్మ్ పాలసి రివ్యూ ?

share

HDFC CLICK 2 PROTECT SUPER TERM POLICY.

స్టోరీ 

టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కుటుంభం పెద్ద లేదా సంపాదిస్తున్న వ్యక్తి అకాల మరణం చెందిన యెడల ఆ కుటుంభం రోడ్డున పడకుండా ఆ కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకోవటంలో తోడ్పడుతుంది. అందుచేత ఎప్పుడైతే సంపాదించడం మొదలు పెడుతామో అప్పుడే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఆర్ధిక నిపుణులు చెపుతుంటారు. అందుచేత పాలసీదారుల అవసరాలు దృష్టిలో పెట్టుకొని HDFC లైఫ్ ఇన్సూరెన్స్ -క్లిక్ 2 ప్రొటెక్ట్ సూపర్ అనే టర్మ్ పాలసీని తీసుకొని రావటం జరిగింది. ఈ పాలసీ యొక్క ప్రయోజనాలకు ఇప్పుడు చూద్దాం.

HDFC LIFE INSURANCE – బీమా సంస్థ వివరాలు  :

HDFC లైఫ్ ఇన్సూరెన్స్ అనేది జీవిత బీమా సంస్థ . ఈ ఇన్సూరెన్స్ కంపనీలో అనేక జీవిత బీమా మరియు పొదుపు ప్రణాళికలు కలవు. అందులో ఒక టర్మ్ పాలసీనే  ” CLICK 2 PROTECT SUPER – TERM PLAN  ”. సాధారణంగా టర్మ్ పాలసీ ఎంపికకు ముందు ఆ బీమా సంస్థ యొక్క పనితీరును పరిగణలోకి తీసుకొని పాలసీ ఎంపిక చేసుకోవటం జరుగుతుంది. అందుకోసం ఏం పరిశీలించాలో ఈ క్రింద వివరించడం జరిగింది.

1) క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో (CSR ) : అనగా బీమా సంస్థ ఎన్ని క్లెయిమ్స్ ని పరిష్కరించిందో  చెప్పే నివేదిక. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఎక్కువగా ఉంటె సంస్థ విశ్వసనీయత అంత మెరుగ్గా ఉంటుందని అర్ధం. 95% శాతం లేదా అంతకన్నా ఎక్కువ సెటిల్మెంట్  రేషియో ఉన్న సంస్థను ఎంకుకోవటం మంచిది. HDFC లైఫ్ ఇన్సూరెన్స్ గడిచిన 5 సంవత్సరాలుగా  98.69% సగటుతో అత్యుత్తమ బీమా సంస్థగా నిలిచింది.

3) అమౌంట్ సెటిల్మెంట్ రేషియో : బీమా సంస్థలు ఎంత అమౌంట్ ని సెటిల్ చేశాయో కూడా పరిగణలోకి తీసుకోవాలి.చిన్న క్లెయిమ్స్ సెటిల్ చేసి పెద్ద క్లెయిమ్స్ రిజెక్ట్ చేసే సంస్థను ఎంపిక చేసుకోక పోవటం మంచిది. HDFC లైఫ్ ఇన్సూరెన్స్ సగటున 87.03% తో మంచి సెటిల్మెంట్  రేషియోని కలిగి ఉంది.

4) కంప్లయెంట్స్ రేషియో : బీమా సంస్థకు ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయంటే ఆ సంస్థ  పనితీరు బాలేదు అన్నమాట. ప్రతి 10-వేల క్లెయిమ్స్ లో ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయో తెలియజేసే నివేదికే కంప్లైంట్స్ రేషియో అంటారు. HDFC లైఫ్ ఇన్సూరెన్స్  2.7%  రేషియోతో తక్కువ కంప్లైంట్స్ ను కలిగి ఉంది.

HDFC CLICK 2 PROTECT SUPER TERM- పాలసీ ప్లాన్  వివరాలు :

ఈ పాలసీని ”  CLICK 2 PROTECT SUPER ” టర్మ్ పాలసీ అని పిలుస్తారు. ఈ టర్మ్ పాలసీ నాన్ – లింక్డ్ , నాన్ – పార్టిసిపేటివ్ ఇండివిజువల్ ప్యూర్ రిస్క్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ పాలసి వివిధ ఆప్షన్స్ లు మరియు రైడర్స్ తో కూడిన అనేక  ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. వీటిలో పాలసీదారులు యొక్క వ్యక్తిగత అవసరాలను బట్టి  వివిధ  ఆప్షన్స్ ని ఎంపిక చేసుకోవచ్చు. వాటిని ఈ క్రింద వివరించడం జరిగింది అవి :

ఈ పాలసిలో  3 రకాల ఆప్షన్స్ కలవు అవి :

1- LIFE

లైఫ్ అప్షన్స్ లో లైఫ్ కవర్ అనేది పాలసీ కొనుగోలు సమయంలో ఎంపిక చేసుకోవచ్చు మరియు ప్రతి 5 సంవత్సరాలకు 10% మేరకు పెంచుకోవచ్చు లేదా ప్రతి సంవత్సరం 5% మేరకు కవరేజ్ పెంచుకుంటూ 200% మేరకు తమ పాలసీ లైఫ్ కవర్ ని పెంచుకొనే సదుపాయం ఈ పాలసీలో కలదు.

2- LIFE PLUS

లైఫ్ ప్లస్ ఆప్షన్ లో జీవిత బీమా కవరేజ్ తో పాటు టర్మినల్ ఇల్ నెస్ మరియు ఆక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ 2 కోట్ల వరకు ఎంపిక చేసుకొనే అవకాశం కలదు

3- LIFE GOAL

లైఫ్ గోల్ ఆప్షన్ లో జీవిత బీమా ప్రయోజనాలతో పాటు లైఫ్ కవరేజ్ ని తమ కుటుంభం ఆర్ధిక బాధ్యతలు నెరవేర్చుకుంటున్న సందర్భంలో సం అస్సురెడ్ ని తగ్గించుకొనే సదుపాయం ఈ ఆప్షన్ లో కలదు.

అర్హతలు

మొత్తంగా అన్ని అప్షన్స్ లోని వివిధ రకాల ప్రయోజనాలను  ఈ క్రింద వివరించడం జరిగింది.

DEATH BENEFIT 

ఏదేని దురదృష్ట సంఘటన జరిగి పాలసీదారుడు అకాల మరణం చెందినట్లయితె వారిపై ఆధారపడిన వారి కుటుంబానికి టర్మ్ పాలసీలో పేర్కొన్న హామీ మొత్తాన్ని వారి కుటుంబానికి లేదా వారి నామినికి చెల్లించబడుతుంది.

Terminal illness benefit

పాలసీదారుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ఆరు నెలల్లో మరణం సంభవించవచ్చు అని నిర్ధారణ అయినపుడు ఈ ప్లాన్ ద్వారా   గరిష్టంగా 2 కోటి రూపాయల వరకు నిర్దిష్ట మొత్తం ముందుగానే  చెల్లించబడుతుంది. 80 సంవత్సరాల వరకు టర్మినల్ ఇల్ నెస్ చెల్లించబడుతుంది. టర్మినల్ ఇల్ నెస్ బెనిఫిట్ అనేది పాలసీ సం అష్షుర్డ్ నుండి చెల్లించబడే ప్రయోజనం మాత్రమే కానీ అదనంగా చెల్లించే ప్రయోజనం కాదు. పాలసీ కాలంలో ఒకటే టర్మినల్ ఇల్ నెస్ బెనిఫిట్ చెల్లించ బడుతుంది. అలాగే టర్మినల్ ఇల్ నెస్ నిర్ధారణ అయినాక జీవిత బీమా కవరేజ్ మరియు రైడర్ ప్రీమియంలు అన్ని మాఫీ చెయ్యబడతాయి.

Accidental Death Benefit

పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో ఈ రైడర్ ద్వారా బేస్ కవరేజీకి సమానంగా అదనంగా లైఫ్ కవర్ బెనిఫిట్ అందించబడుతుంది.ఉదాహరణకు లైఫ్ కవరేజ్ కోటి రూపాయలు అనుకుంటే ఈ A.D.B ర రైడర్ ద్వారా ఇంకో కోటి అనగా మొత్తం రెండు కోట్ల రూపాయలు ఈ పాలసీ ద్వారా పాలసీదారుని కుటుంబానికి ఏక మొత్తంలో అందించడం జరుగుతుంది. పాలసీ కాలంలో ప్రమాదం జరిగి  అనంతరం 180 రోజుల్లో మరణించిన ఈ అదనపు ప్రయోజనం చెల్లించబడుతుంది.

Waiver of premium

పాలసీదారుడు ఏదేని టర్మినల్ ఇల్ నెస్ లేదా క్రిటికల్ ఇల్ నెస్ వ్యాధి బారిన పడిన లేదా పూర్తిగా లేదా శాశ్వతంగా వికలాంగుడిగా మారితే భవిషత్తులో చెల్లించాల్సిన అన్ని ప్రీమియంలు మాఫీ చెయ్యబడతాయి.ఏది లైఫ్ కవర్ కోసం చెల్లించే ప్రీమియంలతో పాటు అన్ని రైడర్ ప్రీమియంలు కూడా మాఫీ చెయ్యబడతాయి.

Death benefit as instalment option

పాలసీదారుని అకాల మరణాంతరం కుటుంభ సభ్యలు పొందే హామీ ప్రయోజనం మూడు విధాలుగా చెల్లించబడే సౌకర్యం ఉంది. ఏక మొత్తంలో లేదా మంత్లీ ఇన్కమ్ గా లేదా కొంత మొత్తం ఏక కాలంలో చెల్లించి మిగిలింది నెలనెలా ఆదాయం పొందే విధంగా లైఫ్ కవర్ మొత్తం పొందవచ్చు.

Option to alter premium frequency

ప్రీమియం చెల్లింపులు పాలసీదారుని సౌలభ్యం మేరకు పాలసీ కాలంలో ఎప్పుడైనా చెల్లింపులు నెల వారి ,త్రైమాసికం,అర్ధ వార్షికం ,వార్షికం ఈలా ఎప్పుడైనా మార్చుకొనే సదుపాయం కలదు.అలాగే రెగ్యులర్ ప్రీమియం చెల్లింపుల నుండి లిమిటెడ్ పే చెల్లింపులకు పాలసీ కాలంలో ఎప్పుడైనా మారవచ్చు.

Renewability option at matuarity

పాలసీ కవరేజ్ కాలం ముగిసిన తర్వాత  తన ఆర్ధిక బాధ్యతలు ఇంకను నెరవేరని సందర్భంలో లేదా తనకు ఇంకను జీవిత బీమా రక్షణ అవసరం అని భావించిన యెడల తన పాలసీ గడువును పొడిగించుకోవచ్చు. ఈ ఆప్షన్ గరిష్ఠంగా 5 సార్లు పెంచుకొనే అవకాశం ఉంది..పొడిగించిన గడువు కవరేజ్ కోసం అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది, ఇది బీమా సంస్థ యొక్క అండర్ రైటర్ ఆమోదంపై ఆధారపడి ఉంటుంది.

Life stage option

పాలసీదారుని జీవిత ఘట్టాల్లో ఎటువంటి అదనపు అండర్ రైటర్ ప్రాసెస్ లేకుండా పాలసీ కవరేజ్ ని దశల వారిగా పెంచుకొనే అవకాశం ఈ పాలసీలో ఈ క్రింది రెండు విధాలుగా కలదు. వివాహం అనంతరం బేస్ కవరేజ్ కి 50% అదనంగా కవరేజ్ పెంచుకొనే అవకాశం ఉంది.అలాగే దత్తత లేదా పుట్టుక కారరంగా జన్మించిన మొదటి సంతానం  పేరుమీద 25%  మరియు రెండవ దత్తత లేదా సంతానం పేరుమీద  25% మేరకు కవరేజ్ ని పేంచుకోనే అవకాశం ఉంది.

Smart exit benefit

పాలసీ కోసం చెల్లించిన ప్రీమియంలన్నింటినీ ఈ ఎంపిక ద్వారా తిరిగి పొందవచ్చు.అందుకోసం పాలసీ అమల్లో ఉండి  30 సంవత్సరాల పాలసీ  కవరేజ్ పూర్తి చేసుకోవాలి.ఈ బెనిఫిట్ పాలసీ చివరి 5 సంవత్సరాలలో పొందే అవకాశం లేదు.ఈ బెనిఫిట్ ద్వారా పాలసీ కోసం చెల్లించిన అన్ని  ప్రీమియంలు తిరిగి పొందవచ్చు.

CRITICAL ILLNESS RIDER

గుండె జబ్బులు ,కాన్సర్ శరీర అవయవాలు దెబ్బతినటం లాంటి ప్రాణాంతకర వ్యాధుల నుండి ఈ రైడర్ ద్వారా ఆర్ధిక ప్రయోజనం పొందవచ్చు. ఈ రైడర్ ద్వారా 64 రకాల వ్యాధులను కవర్ చేస్తాయి.ఈ రైడర్ ను ఎంచుకొనే ముందు మీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎంచుకోవాల్సి ఉంటుంది.

ACCIDENTAL TOTAL PERMANENT DISABILITY

ఏదేని ప్రమాద కారణంగా  శాశ్వత అంగవైకల్యం లేదా పాక్షిక అంగ వైకల్యం ఏర్పడితే పాలసీలో పేర్కొన్న విధంగా ఆర్ధిక ప్రయోజనంతో పాటు ప్రీమియం మినహాయింపు ఉంటుంది .దీనికి అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది  రోజు ప్రయాణాలు లేదా రిస్క్ తో కూడిన జీవన శైలి ఉన్న వ్యక్తులకు ఈ రైడర్ ఉపయోగ పడుతుంది. అంగవైకల్యం కారణంగా కుటుంబానికి భారం కాకుండా ఈ రైడర్ ద్వారా పొందే ఆర్ధిక ప్రయోజనం వారికి అండగా ఉంటుంది.

ముగింపు 

HDFC లైఫ్ ఇన్సూరెన్స్  కంపెనీని 2000ల సంవత్సరంలో  ప్రారంభించడాం జరిగింది. మొదట ఇది HDFC లిమిటెడ్ మరియు యూకేకు చెందిన Abrdn అనే పెట్టుబడి సంస్థ కలిసి స్థాపించారు. కానీ 2023లో Abrdn అనే సంస్థ తన వాటాను అమ్మగా పూర్తి వాటాను HDFC కొనుగోలు చేసింది. అప్పటి నుంచి HDFC లైఫ్ స్వతంత్రంగా పనిచేస్తోంది. మన దేశంలో టాప్ ప్రైవేట్ బ్యాంకులలో HDFC ఒకటి. దాని మద్దతుతో ఈ సంస్థ ఇప్పుడు భారతదేశంలో టాప్  జీవిత బీమా సంస్థగా ఉంది.

HDFC CLICK TO PROTECT SUPER టర్మ్ పాలసీ

 

share

Leave a Comment